Jump to content

ఓం బిర్లా

వికీపీడియా నుండి
ఓం బిర్లా
ఓం బిర్లా


17వ లోక్‌సభ స్పీకరు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 జూన్ 2019
డిప్యూటీ ఖాళీ
ముందు సుమిత్రా మహాజన్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు లియారాజ్ సింగ్
నియోజకవర్గం కోటా

రాజస్థాన్ రాష్ట్ర శాసససభ సభ్యుడు
పదవీ కాలం
8 డిసెంబరు 2003 – 16 మే 2014
ముందు శాంతి ధరివాల్
తరువాత సందీప్ శర్మ
నియోజకవర్గం కోటా సౌత్ [1]

వ్యక్తిగత వివరాలు

జననం (1962-11-23) 1962 నవంబరు 23 (వయసు 62)
కోటా, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అమితా బిర్లా
సంతానం 2
నివాసం 20 అక్బర్ రోడ్, న్యూఢిల్లీ (అధికార)
కోటా, రాజస్థాన్ (ప్రైవేట్)
పూర్వ విద్యార్థి ప్రభుత్వ కామర్స్ కళాశాల, కోటా
మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు, పరోపకారి
మతం హిందూ మతం
మూలం సభ్యుని సమాచారం

ఓం బిర్లా (జననం:1962 నవంబరు 23) భారతదేశ రాజకీయ నాయకుడు. అతను భారతదేశానికి 17వ లోక్‌సభ స్పీకరుగా పనిచేసాడు. అంతకు ముందు అతను రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు శాసనసభ్యునిగా కోటా దక్షిణ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2019 జూన్ 19న అతను 17 లోక్‌సభ స్పీకరుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు.[2][3] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో అతను తిరిగి రాజస్థాన్ లోని కోటా పార్లమెంటు నియోజకవర్గం నుండి లోకసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. తిరిగి ప్రస్తుత18వ లోకసభ స్పీకరుగా 2024 జూన్ 26న ఎన్నికయ్యాడు.[4][5]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఓం బిర్లా 1962 నవంబరు 23న శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. అతను కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తరువాత ఆజ్మీరు లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుండి కామర్స్ డిగ్రీని పొందాడు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను బిర్లా ఉత్తరప్రదేశ్ లో జైలుశిక్ష అనుభవించాడు.[6]

శాసనసభ్యునిగా

[మార్చు]

అతను 2003లో మొట్టమొదటి సారి రాజస్థాన్ లోని కోటా దక్షిణ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను భారత కాంగ్రెస్ అభ్యర్థి శాంతి ధరివాల్ ను 10,101 ఓట్ల మెజారితో ఓడించాడు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతను 24, 300 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాం కిషన్ వెర్మ చేతిలో ఓడిపోయాడు. పార్లమెంటు సభ్యునిగా ఎంపిక కాక ముందు అతను 2013లో మూడవసారి అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ మెహ్రాను 50,000 ఓట్ల తేడాతో ఓడించాడు. అతని 2003-08 పదవీ కాలంలో రాజస్థాన్ ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రటరీగా వ్యవహరించాడు.

పార్లమెంటు సభ్యునిగా

[మార్చు]

అతను 16వ, 17వ లోక్‌సభలకు సభ్యునిగా కోట (రాజస్థాన్) పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపిక అయ్యాడు.అతను 16వ లోక్‌సభలో సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా వ్యవహరించాడు. 17వ లోక్‌సభలో లోక్‌సభ స్పీకరుగా ఎంపిక అయ్యాడు.

సామాజిక సేవలు

[మార్చు]

ఒక క్రియాశీల పార్లెమెంటు సభ్యునిగా [7] కోట (రాజస్థాన్) పార్లమెంటు నియోజక వర్గ పరిథిలో అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాడు. అందులో "పరీధాన్" అనే కార్యక్రమళ్ 2012లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అతను బట్టలు, పుస్తకాలను సమాజంలో బలహీన వర్గాల ప్రజలకు అందజేయడం, రక్త దాన శిబిరాలను నిర్వహించాడు.[8] అతను పేద ప్రజలకు ఉచితంగా భోజనం, మందులు సరఫరా కార్యక్రమం కూడా చేపట్టాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా యువ మోర్చా, కోటా.[9] (1987–91)
  • రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ యువమోర్చా, రాజస్థాన్. (1991-1997)
  • జాతీయ ఉపాధ్యక్షుడు, భారతీయ జనతా యువమోర్చా. (1997-2003)
  • వైస్ చైర్మన్, జాతీయ కో-ఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్ లిమిటెడ్.
  • చైర్మన్, రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ (CONFED), జైపూర్. (1992 జూన్ జూన్ -1995 జూన్)
  • 17వ లోక్‌సభ స్పీకరుగా, (2019 జూన్ 19 నుండి 2024 జూన్ 24 వరకు)

18వ లోక్‌సభ స్పీకరుగా తిరిగి ఎన్నిక

[మార్చు]

2024 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 18 లోక్‌సభ ఏర్పడింది. లోక్‌సభ స్పీకర్‌గా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) అభ్యర్థి, కోటా పార్లమెంటు సభ్యుడు ఓం బిర్లా 2024 జూన్ 26న (బుధవారం) తిరిగి ఎన్నికయ్యాడు. అతని ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బలపరిచారు, వాయిస్ ఓట్ల ద్వారా ఆమోదించబడింది.[10][11]

కాంగ్రెస్ ఎంపీ కోడికున్నిల్ సురేష్‌ను తమ అభ్యర్థిగా ముందుకు తెచ్చిన ప్రతిపక్షాలు ఓట్ల కోసం ఒత్తిడి చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత, ప్రోటెం స్పీకర్‌గా పనిచేస్తున్న బి మహాతాబ్, ఓం బిర్లా 18వ స్పీకరుగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన చేశారు.[12]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kota South (Rajasthan) Assembly Election Results". MapsofIndia. Retrieved 19 June 2019.
  2. Sakshi (19 June 2019). "లోక్‌సభ స్పీకర్‌: ఎవరీ ఓం బిర్లా." Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. Andhrajyothy (25 June 2024). "స్పీకర్ ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గురించి ఆసక్తికర విషయాలు". Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.
  4. Bureau, The Hindu (2024-06-26). "Lok Sabha Speaker election 2024 highlights: Speaker Om Birla brings resolution on Emergency". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-06-27.
  5. Desk, Online (2024-06-26). "Om Birla wins first election for Lok Sabha Speaker's post in about five decades". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-27.
  6. "Parliament profile".
  7. "PRS". www.prsindia.org. Retrieved 2015-08-29.
  8. "Om Birla". www.ombirla.com. Archived from the original on 2015-08-23. Retrieved 2015-08-29.
  9. "BJYM : Bharatiya Janata Yuva Morcha : भाजयुमो : भारतीय जनता युवा मोर्चा | BJYM : Bharatiya Janata Yuva Morcha is youth wing of Bharatiya Janata Party one of the leading Political Party in India, भाजयुमो : भारतीय जनता युवा मोर्चा". www.bjym.org. Retrieved 2015-08-29.
  10. https://www.business-standard.com/politics/nda-candidate-om-birla-elected-as-lok-sabha-speaker-for-second-time-124062600345_1.html
  11. Bureau, The Hindu (2024-06-26). "Om Birla elected Lok Sabha speaker for second term". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-06-27.
  12. "Om Birla re-elected as Lok Sabha Speaker: All about Speaker's role, appointment process, and more | India News - The Indian Express". web.archive.org. 2024-06-26. Archived from the original on 2024-06-26. Retrieved 2024-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు

[మార్చు]
లోక్‌సభ
అంతకు ముందువారు
జయరాజ్ సింగ్
పార్లమెంటు సభ్యుడు
కోటా పార్లమెంటు నియోజకవర్గం

2014 – ప్రస్తుతం
తరువాత వారు
Incumbent
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
సుమిత్ర మహాజన్
లోక్‌సభ స్పీకరు
2019 – ప్రస్తుతం
Incumbent
"https://te.wikipedia.org/w/index.php?title=ఓం_బిర్లా&oldid=4309156" నుండి వెలికితీశారు