ఓం శాంతి శాంతి శాంతిః (2026)
| ఓం శాంతి శాంతి శాంతిః | |
|---|---|
| దర్శకత్వం | ఏ.ఆర్. సజీవ్ |
| స్క్రీన్ ప్లే | ఏ.ఆర్. సజీవ్ |
| దీనిపై ఆధారితం | జయ జయ జయ జయహే (మలయాళం) |
| నిర్మాత | సృజన్ యరబోలు ఆదిత్య పిట్టీ |
| తారాగణం | తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా బ్రహ్మాజీ |
| ఛాయాగ్రహణం | దీపక్ యెరగరా |
| కూర్పు | ఏ.ఆర్. సజీవ్ |
| సంగీతం | జే క్రిష్ |
నిర్మాణ సంస్థలు | ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2026 జనవరి 30 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఓం శాంతి శాంతి శాంతిః 2026లో విడుదలైన తెలుగు హాస్యభరిత చలనచిత్రం. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్. సజీవ్ తొలిసారి దర్శకత్వం వహించాడు.[1] ఇది 2022లో విడుదలైన మలయాళ చిత్రం జయ జయ జయ జయహే ఆధారంగా తిరిగి నిర్మించబడింది. ఇందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 జనవరి 30న థియేటర్లలో విడుదల చేశారు.[2][3]
కథ
[మార్చు]గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓంకర్ నాయుడు (తరుణ్ భాస్కర్) ఒక కోపిష్టి మరియు అహంకారం కలిగిన వ్యక్తి. ప్రశాంతి (ఈషా రెబ్బా) తన కలలను పక్కనపెట్టి ఓంకర్ నాయుడుని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత భర్త పెట్టే వేధింపులు, అతని పెత్తనాన్ని ప్రశాంతి భరిస్తూ వస్తుంది. అయితే ఒకానొక దశలో ఆమె సహనం నశించి, తన భర్త అహంకారాన్ని ఎలా అణిచింది? అతనికి ఎలా బుద్ధి చెప్పింది? అనేది ఈ చిత్ర కథాంశం. భార్యాభర్తల మధ్య గొడవలను వినోదాత్మకంగా ఈ చిత్రంలో చూపించారు.
నటీనటులు
[మార్చు]- తరుణ్ భాస్కర్ - అంబటి ఓంకర్ నాయుడు[4]
- ఈషా రెబ్బా - కొండవీటి ప్రశాంతి
- బ్రహ్మాజీ - పులస రామారావు
- బ్రహ్మానందం
- సురభి ప్రభావతి
- రోహిణి నోని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్
- నిర్మాతలు: సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ
- దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: ఏ.ఆర్. సజీవ్
- సంగీతం: జే క్రిష్
- సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
విడుదల
[మార్చు]ఈ చిత్రం 2026 జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. [5]
మూలాలు
[మార్చు]- ↑ "Om Shanti Shanti Shantihi Trailer: 'ఓం శాంతి శాంతి శాంతిః' ట్రైలర్.. కోపిష్టి భర్తపై తిరగబడిన భార్య కథ..!". Samayam Telugu. Retrieved 2026-01-24.
- ↑ "భర్త అహంకారం.. భార్య ప్రతీకారం". Eenadu. 24 January 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "ఓం శాంతి శాంతి శాంతి శాంతి: ఎలా ఉందంటే". Chitrajyothy. 30 January 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "నటన కంటే దర్శకత్వమే ఇష్టం". Eenadu. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "Om Shanti Shanti Shantihi: 'ఓం శాంతి శాంతి శాంతిః'.. అలరిస్తున్న ట్రైలర్". EENADU. Retrieved 2026-01-24.