ఓగేటి అచ్యుతరామశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓగేటి అచ్యుతరామశాస్త్రి
జననం(1932-01-02)1932 జనవరి 2
వృత్తిరచయిత, కవి, వక్త, పరిశోధకుడు

ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు.

రచనలు[మార్చు]

 1. శంకరాచార్య (1958) - పద్యకృతి
 2. బంధాబైరాగి (1959) - చారిత్రక నాటకం
 3. సంస్కృత నాటక ప్రయోగరంగము (1975) - పరిశోధన గ్రంథము
 4. స్నేహబంధనమ్‌ (1978) - సంస్కృతంలో వ్రాయబడిన సాంఘిక నాటకం
 5. హిమకిరీటిని (1981) - కవితాసంకలనం
 6. స్వామి వివేకానంద కవితా వైభవం (1983) - సాహిత్య విమర్శ
 7. భారతీయ చరిత్ర సత్యాన్వేషణ (1983)
 8. హైదరాబాదు నగర తెలుగు భాషా సాహిత్య వికాసచరిత్ర[1] (1985)
 9. ఓగేటి వ్యాసపీఠి[2] (1986)
 10. హైదరాబాదు నగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము[3] (1987)
 11. ఎఱ్ఱన అరణ్యపర్వశేషము[4] - పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథము
 12. అచ్యుతగీత - సంస్కృత గేయ సంపుటి
 13. Lady of the Lake - ఆంగ్ల భాషలో తెలుగు జానపద కథల సంపుటి
 14. హరిహరనాథ ద్విశతి
 15. హిందూ మతం (1990) - సంస్కృత గద్యగ్రంథం
 16. శ్రీ బాసర సరస్వతీక్షేత్రము - పద్యప్రబంధము
 17. మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహాదూర్ "శాద్" జీవితచరిత్ర (1994) - హిందీ భాషలో
 18. ఆంధ్రకేసరి - పద్యప్రబంధము
 19. వేకువ వెలుగులు (ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఎస్.ఎస్) [5] (1997) -

బిరుదులు[మార్చు]

 1. సంస్కృత నాటకప్రయోగోద్ధారక
 2. నటరాజరాజ
 3. ఆశ్చర్య కుశలవక్త
 4. మహోపాధ్యాయ
 5. రాష్ట్రకవి
 6. భాగ్యనగర భారతి మొదలైనవి.

మూలాలు[మార్చు]

 1. ఓగేటి అచ్యుతరామశాస్త్త్రి (1985). హైదరాబాదు నగర తెలుగు భాషా సాహిత్య వికాస చరిత్ర (1 ed.). హైదరాబాద్: భారతీయ ఇతిహాస సంకలన సమితి. Retrieved 2 May 2015.
 2. ఓగేటి అచ్యుతరామశాస్త్రి (1986). ఓగేటి వ్యాసపీఠి (1 ed.). హైదరాబాదు: సాహిత్యసభా ప్రచురణ. Retrieved 1 May 2015.
 3. ఓగేటి అచ్యుతరామశాస్త్రి (1987). హైదరాబాదు నగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము (1 ed.). హైదరాబాదు: సాహిత్యసభా ప్రచురణ. Retrieved 2 May 2015.
 4. ఓగేటి అచ్యుతరామశాస్త్రి (1989-04-06). ఎఱ్ఱన అరణ్యపర్వశేషము (1 ed.). హైదరాబాద్: సాహిత్యసభ ప్రచురణలు. Retrieved 2 May 2015.
 5. ఓగేటి అచ్యుతరామశాస్త్రి (1997). వేకువవెలుగులు. హైదరాబాద్: నవయుగభారతి ప్రచురణలు. Retrieved 2 May 2015.