ఓటుకు కోట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

ఓటుకి కోట్ల రూపాయ‌లు ఆఫ‌ర్ చేస్తూ తెలుగుదేశం నాయ‌కులు దొరికిపోవ‌టంతో ఈ క్యాష్ ఫ‌ర్ ఓటు [1] అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నిక‌ల్లో .. ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్ర‌లోభ పెట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. ఆయ‌న్ని కోర్టు ముందు హాజ‌రు పరిచి, జైలుకి పంపించ‌టం జ‌రిగింది. త‌ర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యుని తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు [2] ఫోన్ సంభాష‌ణ‌లు నాట‌కీయంగా బ‌య‌ట‌కు పొక్క‌టంతో దృష్టంతా చంద్ర‌బాబు మీద‌కు మ‌ళ్లింది. దీంతో ఇది సంచ‌ల‌నం అయింది. ఈ కేసు విషయమై ఉమ్మడి హైకొర్టు చంద్రబాబుకి స్టే ఇవ్వడం జరిగినది.

అసలేం జరిగింది?[మార్చు]

తెలంగాణ లో శాస‌న‌స‌భ నుంచి కౌన్సిల్ కోసం ఎన్నిక‌ల‌కు తెర లేచింది. ఆరు స్థానాల‌కు గాను నోటిఫికేష‌న్ ప‌డింది. టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఒక‌రు, తెలుగుదేశంనుంచి ఒక‌రు బ‌రిలోకి దిగారు. తెలుగుదేశానికి, దాని మిత్ర ప‌క్ష‌మైన బీజేపీకి క‌లిపి .. స‌రిప‌డిన‌న్ని ఓట్లు లేవు. దీంతో ఇత‌ర ప‌క్షాల నుంచి ఓట్లు రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు ఈ అంశంపై పార్టీ ప‌రంగా స‌మీక్ష‌లు జ‌ర‌ప‌టంతో.. ఆయ‌న సూచ‌న మేర‌కు టీటీడీపీ నేత‌లు రంగంలోకి దిగారు. ఇత‌ర పార్టీల శాసన సభ్యుల‌కు వ‌ల వేస్తున్నార‌ని తెలియ‌టంతో ఆయా పార్టీల నేత‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈ క్ర‌మంలోనే స్టీఫెన్ స‌న్ ద‌గ్గ‌ర హై డ్రామా చోటు చేసుకొంది. టీడీపీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఒక స‌హాయ‌కునితో క‌లిసి ఆయ‌న్ని క‌లిశారు. రేవంత్ సూచ‌న‌ల మేర‌కు ఆ స‌హాయ‌కుడు రూ.50ల‌క్ష‌ల రూపాయిల నోట్ల క‌ట్ట‌ల‌ను అందించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ స‌మ‌యంలో రేవంత్ చేసిన సంభాష‌ణ‌లు కీల‌కంగా మారాయి. ఇవి టీవీ చానెల్స్ లో ప్రసారం అయ్యాయి.

కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సి ఎన్నికలు జరుగుతున్నవి ఒక్కో ఏమ్మేల్సిని ఎన్నుకోవడానికి 17 మంది ఎమ్మెల్యేలు అవసరం. అలా అప్పుడు అధికార పార్టి తెలంగాణా రాష్ట్ర సమితికి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టికి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం ఒక్క ఏమ్మేల్సిని గెలిపించుకోవాలన్నా తెలుగుదేశం పార్టికి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కొనడానికి పెద్ద కసరత్తే జరిగింది . దాని ప్రకారం సెబాస్టియన్ అనే ఒక ఎమ్మెల్యేని కొనడానికి తెలుగుదేశానికి సంబంధించిన రేవంత్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు సెబాస్టియన్ ఇంటికి డబ్బుల బ్యాగుతో వెళ్లి ఇది అడ్వాన్సు నువ్వు ఓటు వెయ్యంగానే మిగిలిన డబ్బులు మీకు అంధ జేస్తాం అని చెప్పి మమ్మల్ని బాస్ ( చంద్ర బాబు ) పంపించాడు కావాలంటే మీరు మా బాస్ తో డైరెక్ట్ గా మాట్లాడచ్చు ఇక్కడ తెలంగాణాలో మీకు ఎలాంటి ప్రాబ్లం వున్నా నేన్ను చూసుకుంటాను అని హామీ ఇస్తూ మాట్లాడుతారు .

రేవంత్ రెడ్డి సంభాష‌ణ‌[మార్చు]

స్టీఫెన్ స‌న్ తో రేవంత్ రెడ్డి [3] చాలా విష‌యాలు మాట్లాడిన‌ట్లు వీడియో లో రికార్డు అయ్యాయి. తెలంగాణ‌లో తాను యాక్టివ్ గా ఉన్న నేత‌ను అని ఆయ‌న చెప్పుకొని వ‌చ్చారు. ముఖ్య‌మైన ప‌నుల‌కు బాస్ త‌న‌నే పంపిస్తార‌ని చెప్పారు. అన్ని విష‌యాలు బాస్ చూసుకొంటార‌ని న‌మ్మ ప‌లికారు. ఇప్ప‌టికే డ‌బ్బు విష‌యం అందించాన‌ని చెప్పుకొచ్చారు. బాస్ సూచ‌న మేర‌కే అన్ని చేస్తున్న‌ట్లు చెప్పారు. ఆ వెంట‌నే ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. త‌ర్వాత ఈ దృశ్యాలు మీడియాలో ప్ర‌సారం అయ్యాయి. ఒక పార్టీ శాసన సభ్యుడు ప‌దే ప‌దే బాస్ బాస్ అంటూండ‌టంతో ఆ బాస్ ఎవ‌రో కాదు పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబే అని అంతా అర్థం చేసుకొన్నారు.

స్టీఫెన్ స‌న్ వాద‌న‌లు[మార్చు]

నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ స‌న్ [4] వాద‌న‌ల ప్ర‌కారం చంద్ర‌బాబే ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపించిన‌ట్లు తెలుస్తోంది. మే 28న మ‌త్త‌య్య అనే వ్యక్తి స్టీఫెన్ స‌న్ ను క‌ల‌వ‌టంతో ఈ ఎపిసోడ్ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న డ‌బ్బు ఇవ్వ చూపారు. ఇది అనైతికం అని భావించిన స్టీఫెన్‌స‌న్ మాత్రం ఏసీబీ ని ఆశ్ర‌యించారు. త‌ర్వాత సెబాస్టియ‌న్‌, ఆ పై రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. 30వ తేదీ రేవంత్ రెడ్డి, సెబాస్టియ‌న్ నేరుగా స్టీఫెన్ స‌న్ ఇంటికి వ‌చ్చి బేరం మాట్లాడారు. చంద్ర‌బాబుతో ర‌హ‌స్యంగా స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అదే రోజు సాయంత్రం చంద్ర‌బాబుతో ఫోన్ లో మాట్లాడించారు. అన్నీ తాను చూసుకొంటాన‌ని, మా వాళ్లు డీల్ గురించి చెప్పార‌ని చంద్ర‌బాబు ప‌లికారు. ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని న‌మ్మ బ‌లికారు. త‌ర్వాత రోజు అంటే మే నెల 31న రేవంత్ రెడ్డి, అత‌ని అనుచ‌రులు డ‌బ్బు తీసుకొని స్టీఫెన్ స‌న్ ను క‌లిశారు. అప్ప‌టికే ఏసీబీ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో ఆయ‌న్ని అరెస్టు చేయ‌టం జ‌రిగింది.

చంద్ర‌బాబు పాత్ర‌[మార్చు]

తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు కాగానే అంద‌రి దృష్టి ఆ పార్టీ కార్య‌క‌లాపాల మీద‌కు వెళ్లింది. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అనేక మంది ప్రజా ప్ర‌తినిధుల్ని కొనుగోలుచేసింద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ప్రాదేశిక స‌భ్యుల్ని కొనుగోలు చేసి, జ‌డ్పీ మండ‌ల అధ్య‌క్ష ప‌ద‌వుల్ని ద‌క్కించుకొంద‌న్న మాట ఉంది. అదే క్ర‌మంలో తెలంగాణ‌లో కూడా ముందుకు వెళుతోందా అన్న మాట వినిపించింది. ఈ లోగా చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా స్టీఫెన్ స‌న్ తో మాట్లాడారంటూ ఒక ఆడియో సంభాష‌ణ‌టేపు వెలుగు చూసింది. టీవీ చానెల్స్ లో ప్ర‌సారం అయిన ఆ సంభాష‌ణ‌ల ప్ర‌కారం చంద్ర‌బాబు స్వ‌యంగా స్టీఫెన్ స‌న్ తో మాట్లాడ‌టం జ‌రిగింది. మ‌న వాళ్లు అన్నీ నాకు చెప్పారు. మీ సంగ‌తి నేను చూసుకొంటాను. హామీలు అన్నీ నెర‌వేరుస్తాం. మీకు నేను అండ‌గా ఉంటాను. క‌లిసి ప‌ని చేద్దాం..అన్న సందేశం ఉంది. ఇది టీవీ చానెల్స్ లో ప్ర‌సారం కాగానే రాష్ట్ర‌మంతా ఇదే అంశం గురించి చ‌ర్చ న‌డిచింది. అప్ప‌టి దాకా తాను నిజాయితీ ప‌రుడ్ని అనిప‌దేప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబు అస‌లు స్వ‌రూపం ఇదా అని అంతా చ‌ర్చించుకోవ‌టం మొద‌లెట్టారు.

రేవంత్ రెడ్డి సెబాస్టియన్ కు డబ్బులు ఇస్తూ ఓటును కొంటు వీడియో తో సహా దొరికిపోయిన ఒక వారానికి చంద్రబాబు కు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయ్యి అది పెను సంచలనాన్ని సృష్టించింది , ఆ ఆడియో లో చంద్ర బాబు సెబాస్టియన్ సంబాషణ ఇలా సాగింది

సంభాషణ[మార్చు]

సెబాస్టియన్ :- హలో

చంద్ర బాబు మనిషి :- ఆ యా బ్రదర్

సెబాస్టియన్ :- సర్

చంద్ర బాబు మనిషి :- అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్

సెబాస్టియన్ :- ఒకే సర్ చంద్రబాబు :- హలో సెబాస్టియన్ :- సర్ గుడ్ ఈవెనింగ్ సర్

చంద్ర బాబు:- ఆ గుడ్ ఈవెనింగ్ బ్రదర్ హౌ ఆర్ యు

సెబాస్టియన్ :- ఫైన్ సర్ థ్యాంక్ యు

చంద్ర బాబు :- మనవాళ్ళు అదే దే బ్రీఫుడు మీ

సెబాస్టియన్ :- యా సర్

చంద్ర బాబు :- ఐ యాం విత్ యు డోంట్ బాదర్

సెబాస్టియన్ :- రైట్

చంద్ర బాబు :- ఫర్ ఎవెరి థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్

సెబాస్టియన్ :- యా సర్ రైట్

చంద్ర బాబు :- ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్

సెబాస్టియన్ :- ఎస్ సర్

చంద్ర బాబు :- దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టూ గెధెర్

సెబాస్టియన్ :- రైట్

చంద్ర బాబు :- థ్యాంక్ యు [5]

ప‌క్క దారి ప‌ట్టించే య‌త్నం[మార్చు]

టీవీ చానెల్స్ లో ప‌దే ప‌దే ప్ర‌సారం అవుతున్న సంభాష‌ణ‌ల‌మీద తెలుగుదేశం పార్టీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లెట్టింది. ముందుగా చంద్ర‌బాబునాయుడు ఢిల్లీ వెళ్లి అక్క‌డి పెద్ద‌ల్ని క‌లిసి వ‌చ్చారు. అక్క‌డ నుంచి సానుకూల స్పంద‌న‌కానీ, ప్ర‌క‌ట‌న‌లుకానీ వెలువ‌డ‌లేదు. పైగా ఈ విష‌యంలో జోక్యం చేసుకోబోమ‌నికేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. ఇటు, గ‌వ‌ర్న‌ర్‌న‌ర‌సింహ‌న్ కూడా ఢిల్లీ వెళ్లి నివేదిక స‌మ‌ర్పించారు [6]. దీనిపై కోపించిన టీడీపీ మంత్రులు, నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్ మీద తిట్లు మొద‌లెట్టారు. ఆయ‌న్ని ర‌క ర‌కాలుగా తిట్టడం చ‌ర్చ‌నీయాంశంగామారింది. ఈలోగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతటా భావోద్వేగాల్ని రెచ్చ గొట్టారు. ఇది ఆంధ‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ట‌కుసంబంధించిన అంశంగా తెలుగుదేశంశ్రేణులు మార్చేశాయి. హైదరాబాదు లో ఆంధ్రుల‌కు ర‌క్ష‌ణ లేదంటూ ప్ర‌చారం చేయ‌టంతో పాటుఉమ్మ‌డి రాజ‌ధానిలో సెక్ష‌న్ 8 ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ప్ర‌చారం కొంత వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోకి పంపించ‌గ‌లిగారు.

చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి[మార్చు]

రాష్ట్ర‌మంతా దీనిమీదేచ‌ర్చించుకోవ‌ట‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దీన్ని సీరియ‌స్ గా తీసుకొన్నారు. కొన్ని రోజుల పాటు దీనిమీదే పూర్తి దృష్టి పెట్టారు. పోలీసు ఉన్న‌తాధికారుల్ని పిలిపించుకొని దీని మీదేస‌మీక్ష‌లు జ‌రిపారు. ఓటుకి నోటుకుంభ‌కోణంలో తెలుగుదేశం ఎమ్ ఎల్ ఎ రేవంత్ రెడ్డి అరెస్టు కావ‌టం, సూత్ర‌ధారి తెలుగుదేశంపార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు అన్న ప్ర‌చారం బాగా జ‌రిగింది. ఇదంతా పార్టీ వ్య‌వ‌హారం అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం దీన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారంగా భావించారు. ప్ర‌భుత్వ యంత్రాంగం ద్వారా దీని మీద చ‌ర్య‌లు సాగించారు.

ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌[మార్చు]

ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో ఇరుక్కొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు అయిన కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ, తెలంగాణ‌లో అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్ డిమాండ్ చేశాయి. తెలుగుదేశం పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ వ్యూహాత్మ‌క మౌనం పాటించింది.

తెలుగుదేశం వాద‌న‌[మార్చు]

తెలుగుదేశం పార్టీ మాత్రం ఇదంతా తెలంగాణ ప్ర‌భుత్వ కుట్ర అని వాదించింది. ఇందులో ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైఎస్సార్‌సీపీ పాత్ర ఉంద‌ని ఆరోపించింది. గ‌వ‌ర్న‌ర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ వ్య‌వ‌హార శైలి బాగోలేద‌ని ఆక్షేపించింది.

ముగింపు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ జిల్లాల్లో ఓటుకి నోటుకుంభ‌కోణం చాలా సంచ‌ల‌నం క‌లిగించింది. అనేక రాజ‌కీయా పార్టీలు, పార్టీల నాయకుల్ని ఈ దుమారం చుట్టుముడుతోంది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో అవినీతిపాత్ర కోణంలో చూసిన‌ప్పుడుఒక ముఖ్య‌మంత్రి ప్ర‌మేయం ఒక అవినీతి కుంభ‌కోణం [7] లో ఇరుక్కోవ‌టం సంచ‌ల‌నం గా మారింది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]