ఓటు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ఇస్తుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడును. డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను "ఓటర్లు" అని పిలుస్తారు. ఓట్లు సేకరణ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి.
ఓటింగ్ పద్ధతులు[మార్చు]
బ్యాలెట్ ఓటింగ్[మార్చు]
ఒక ప్రజాస్వామ్యంలో ఓటు చేయడం ద్వారా ప్రభుత్వం ఎంపిక చేయబడుతుంది. ఎన్నుకునే విధానంలో పలువురు అభ్యర్థుల్లో ఎంపిక చేసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, ఓటింగ్ పద్ధతి ప్రకారం ఓటర్లు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంపిక విధానం ఎన్నికల సంఘం గోప్యతా ఉంచుతుంది ఒక రహస్య బ్యాలెట్ ఉపయోగిస్తారు. ఓటర్లు తమ రాజకీయ గోప్యతను కాపాడటానికి ఈ బ్యాలెట్ ఉపయోగ పడుతుంది.
మెషిన్ ఓటింగ్[మార్చు]
ఓటింగ్ యంత్రం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యంత్రాలను ఉపయోగిస్తుంది
ఆన్లైన్ ఓటింగ్[మార్చు]
కొన్ని దేశాల్లో ప్రజలు ఆన్లైన్ ఓటు అనుమతి. ఆన్లైన్ ఓటింగ్ను ఉపయోగించిన మొట్టమొదటి దేశాలలో ఎస్టోనియా ఒకటి: ఇది 2005 స్థానిక ఎన్నికలలో మొదట ఉపయోగించబడింది.
పోస్టల్ ఓటింగ్[మార్చు]
అనేక దేశాలు పోస్టల్ ఓటింగ్ ను అనుమతిస్తాయి, ఇక్కడ ఓటర్లు బ్యాలెట్ను పంపించి పోస్ట్ ద్వారా దానిని తిరిగి పొందుతారు.
నోటా ఓటింగ్[మార్చు]
నోటా నన్ ఆఫ్ ది ఎబో అభ్యర్థులు నచ్చని వారు ఓటర్లు ప్రయోగించే అస్త్రం నోటా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈవీఎం మెషిన్లలో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటాను కూడా ఏర్పాటుచేసింది. ఓటరు ఈ బటన్ నొక్కితే ఓటు హక్కును వినియోగించుకున్నట్లే. 2014 ఎన్నికల నుంచి నోటాను అందుబాటులోకి తేసుకోచ్చారు.
ఓటుహక్కు గుర్తింపు పత్రాలు[మార్చు]
- ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
- భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్ పోర్టు,
- డ్రైవింగ్ లైసెన్స్,
- పాన్ కార్డు,
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
- బ్యాంకు, కిసాన్, పోస్టాఫీస్ పాసుబుక్కులు,
- విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
- పట్టాదారు పాసు పుస్తకాలు,
- రిజిస్టర్డ్ డీడ్ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
- రేషన్ కార్డు,
- ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
- పెన్షన్ మంజూరు పత్రాలు,
- రైల్వే గుర్తింపు కార్డు,
- స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
- ఆయుధ లైసెన్స్‌లు,
- వికలాంగుల పత్రాలు.
ప్రవాస భారతీయులకు (ఎన్నారైలకు) ఓటు హక్కు[మార్చు]
ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల మందికి పైగా ఎన్నారైలు ఉన్నట్లు అంచనా.ఎన్నారైలకు ఓటు హక్కు కల్పిస్తూ త్వరలోనే ఒక చట్టం తెస్తారు. ఎన్నికల సమయంలో వారు భారత్‌ను సందర్శించాల్సి ఉంటుంది.ఇతర దేశాల పౌరసత్వం పొందిన వారికి మాత్రం ఓటు హక్కు కల్పించరు.