Jump to content

ఓదెల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°27′19″N 79°26′48″E / 18.4552672°N 79.4466877°E / 18.4552672; 79.4466877
వికీపీడియా నుండి
ఓదెల
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ఓదెల స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ఓదెల స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ఓదెల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°27′19″N 79°26′48″E / 18.4552672°N 79.4466877°E / 18.4552672; 79.4466877
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం ఓదెల
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 149 km² (57.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,211
 - పురుషులు 20,964
 - స్త్రీలు 21,247
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.21%
 - పురుషులు 62.92%
 - స్త్రీలు 46.1%
పిన్‌కోడ్ 505152


ఓదెల మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా లోని మండలం.[1]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం ఓదెల

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ ఓదెల గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలోని, పెద్దపల్లి రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఓదెల మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 42,211 - పురుషులు 20,964 - స్త్రీలు 21,247. అక్షరాస్యత - మొత్తం 59.61% - పురుషులు 62.92% - స్త్రీలు 46.10%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 42,211. జనాభాలో పురుషులు 20,964 కాగా, స్త్రీల సంఖ్య 21,247. మండలంలో 11,758 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

[మార్చు]

ఈ మండలానికి సరిహద్దు మండలాలు పెద్దపల్లి, జమ్మికుంట, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కొలనూర్
  2. నాంసానిపల్లి
  3. కొమెర
  4. ఓదెల
  5. కనగర్తి
  6. మడక
  7. పొత్కపల్లి
  8. శానగొండ
  9. ఇందుర్తి
  10. గూడెం
  11. గుంపుల

మండల పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

ఈ మండలంలో ఓదెల మల్లన్న దేవాలయంగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయం పెద్దపల్లి జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయ నిర్మాణక్రమం, స్తంభ వర్ణ శిలల శిల్పాల ఆధారంగా చాళుక్యుల కాలంలోనే నిర్మింపబడి, సా.శ.1300 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో పునర్నిర్మింపబడినట్లుగా తెలుస్తుంది. ఈ దేవాలయం ఓదెల గ్రామానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో జరిగే జాతరకు పెద్దపల్లి జిల్లా నుండేకాక సరిహద్దు జిల్లాలైన కరీంనగర్, పూర్వపు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రితో మొదలయ్యే ఈ జాతర పెద్దపట్నం అనే కార్యక్రమంతో ముగుస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ మండలానికి సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యం ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]