ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
దస్త్రం:Oriental Bank of Commerce logo vector Graphics.svg | |
రకం | ప్రభుత్వ |
---|---|
పరిశ్రమ | |
స్థాపన | 19 ఫిబ్రవరి 1943Lahore, British India | in
స్థాపకుడు | రాయ్ బహదుర్ సోహన్ లాల్ |
క్రియా శూన్యత | 1 ఏప్రిల్ 2020 |
విధి | విలీనంపంజాబ్ నేషనల్ బ్యాంక్ |
వారసులు | పంజాబ్ నేషనల్ బ్యాంక్ |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
కీలక వ్యక్తులు | ముకేశ్ కుమార్ జైన్(మేనేజింగ్ డైరెక్టర్ & ముఖ్య నిర్వహణ అధికారి) |
ఉత్పత్తులు | |
రెవెన్యూ | ₹17,867.69 crore (US$2.2 billion) (2019) |
₹3,754 crore (US$470 million) (2019) | |
₹55.00 crore (US$6.9 million) (2019) | |
Total assets | ₹2,71,909.57 crore (US$34 billion) (2019) |
ఉద్యోగుల సంఖ్య | 21,729 (March 2019) |
మూలధన నిష్పత్తి | 12.73% (2019) |
Footnotes / references [1][2][3] |
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ Oriental Bank of Commerce (OBC) 1943 ఫిబ్రవరి 19న లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్) లో స్థాపించబడినది.దేశ విభజన తరువాత, బ్యాంక్ రిజిస్టర్డ్ ఆఫీసుకు ఢిల్లీ కి మార్చబడింది. 1980 ఏప్రిల్ 15న 307 శాఖలు, మొత్తం వ్యాపారం సుమారు రూ.4350 మిలియన్లు (అమెరికా డాలర్లు 108 మిలియన్ డాలర్లు) తో ఈ బ్యాంకు జాతీయం చేయబడింది. బ్యాంకు వ్యాపార స్థాయిల పరంగా అసాధారణమైన పురోగతి, సరిఅయిన లాభాన్ని ప్రకటించడంలో మచ్చలేని ట్రాక్ రికార్డ్ బ్యాంకు గా ఉన్నది.[4]
బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయం 19 ఫిబ్రవరి, 2012న దాని 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ నుండి గుర్గావ్‌లోని సొంత భవనానికి మార్చబడింది.[5]
చరిత్ర
[మార్చు]ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, మొదటి ఛైర్మన్ రాయ్ బహదూర్ లాలా సోహన్ లాల్ 1943 సంవత్సరంలో లాహోర్ లో స్థాపించాడు. బ్యాంక్ ప్రారంభమైన నాలుగు సంవత్సరాలలో దేశ విభజనను ఎదుర్కోవలసి వచ్చింది. బ్యాంకు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ లో తన శాఖలను మూసివేసి, తన రిజిస్టర్డ్ కార్యాలయాన్ని లాహోర్ నుండి అమృత్ సర్ (పంజాబ్ భారతదేశం) కు మార్చవలసి వచ్చింది. అప్పటి బ్యాంకు ఛైర్మన్ లాలా కరమ్ చంద్ థాపర్ పాకిస్తాన్ డిపాజిటర్లకు ఇచ్చిన వాగ్దానాలకు అనుసరించి, పాకిస్తాన్ దేశ ఖాతాదారుల అందరికి వారి సొమ్మును చెల్లించాడు.[6]
అభివృద్ధి
[మార్చు]బ్యాంక్ కార్యాలయాన్ని మార్చిన తరువాత బ్యాంకు పాకిస్తాన్ డిపాజిటర్లకు వారి డబ్బును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. 1970-76 సంవత్సరాల వరకు బ్యాంక్ మంచి స్థాయిలో నడిచింది. బ్యాంక్ వ్యాపారం సజావుగా లేక, పెరుగుతున్న మార్జిన్ల కారణంగా బ్యాంకు అత్యల్ప స్థాయిలో ఉంది. ఆ సమయంలో చైర్మన్ అయిన లాలా కరంచంద్ థాపర్ బ్యాంకును మూసివేసే నిర్ణయానికి దాదాపుగా వచ్చాడు. ఈ నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగులు, నాయకులు బ్యాంకును కాపాడేందుకు ముందుకు వచ్చారు. దీంతో యాజమాన్యం ఉద్యోగులతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనితో బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. బ్యాంక్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచింది. బ్యాంకును 1980 సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 1997 లో బారీ దోయాబ్ బ్యాంక్, పంజాబ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లను కొనుగోలు చేసింది, ఇది దేశవ్యాప్తంగా బ్యాంకు స్థాయిని పెంచింది.[7]
26 జులై 2004 సంవత్సరంలో సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్‌ను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది.[8]
విలీనం
[మార్చు]ఏప్రిల్ 2020లో, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం చేయబడింది, ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ Agarwal, Amol (1 September 2017). "How banks migrated during Partition". Livemint. Retrieved 31 October 2021.
- ↑ "Board of Directors". Archived from the original on 2021-02-24. Retrieved 2022-05-27.
- ↑ "Annual Report of Oriental Bank of Commerce" (PDF).[permanent dead link]
- ↑ "ORIENTAL BANK OF COMMERCE" (PDF). apraca. 27 May 2022.
- ↑ "Oriental Bank of Commerce — 'Where every individual is committed'". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-05-27.
- ↑ "Oriental Bank Of Commerce Gwalior - Gwalior Business :: Gwalior's No.1 Local Business Directory". gwaliorbusiness.com. Retrieved 2022-05-27.[permanent dead link]
- ↑ "Oriental Bank of Commerce Lucknow - Main Branch, IFSC, Rates 2022". Wishfin (in ఇంగ్లీష్). Retrieved 2022-05-27.
- ↑ "GTB to be merged with OBC: RBI". The Economic Times. Retrieved 2022-05-27.
- ↑ "Punjab National Bank". www.pnbindia.in. Retrieved 2022-05-27.