ఓరి దేవుడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓరి దేవుడా
Ori-devuda-3-1.webp
దర్శకత్వంఅశ్వత్ మ‌రిముత్తు
కథఅశ్వత్ మ‌రిముత్తు
దీనిపై ఆధారితంఓమై క‌డువ‌లే (తమిళ సినిమా 2020)
నిర్మాతపిరల్‌ వి పొట్లూరి
పరమ్‌ వి పొట్లూరి
నటవర్గంవెంకటేష్
విశ్వక్ సేన్
మిథిలా పాల్కర్‌
ఆశా భట్
ఛాయాగ్రహణంవిదు అయ్య‌న్న
కూర్పువిజయ్ ముక్తవరపు
సంగీతంలియన్‌ జేమ్స్‌
నిర్మాణ
సంస్థలు
పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్
విడుదల తేదీలు
2022 అక్టోబరు 21 (2022-10-21)(థియేటర్)
2022 నవంబరు 11 (2022-11-11)(ఆహా ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓరి దేవుడా 2022లో రూపొందిన తెలుగు సినిమా. త‌మిళ సినిమా ‘ఓమై క‌డువ‌లే’ సినిమాను తెలుగులో పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యానర్‌లపై పిరల్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు త‌మిళంలో దర్శకత్వం వహించిన అశ్వత్ మ‌రిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు. వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్‌, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 7న విడుదల చేసి[1] సినిమాను అక్టోబర్ 21న విడుదలైంది. ఈ సినిమా నవంబర్ 11న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[2] ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది.

కథ[మార్చు]

అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి స్నేహితులు. వారిద్దరి తల్లిదండ్రులు వారి పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. అదే సమయంలో అతడు స్కూల్లో తన సీనియర్ అయిన మీరా (ఆశా భట్)ను కలుస్తాడు. అర్జున్ తాను ఇష్టపడిన అమ్మాయిని కాక తనను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అర్ధం కాని ఇబ్బందులు, బాధలతో జీవితాన్ని సాగిస్తూ అనుతో విడిపోవడానికి సిద్ధపడతాడు. ఈ నిర్ణయంతో అర్జున్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. దేవుడు (వెంకటేష్) అర్జున్ కు ఎలాంటి సహాయం చేస్తాడు? చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్లు:పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్
 • నిర్మాత: పిరల్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వత్ మ‌రిముత్తు
 • సంగీతం: లియన్‌ జేమ్స్‌
 • సినిమాటోగ్రఫీ: విదు అయ్య‌న్న
 • మాటలు: తరుణ్ భాస్కర్
 • ఎడిటర్: విజయ్ ముక్తవరపు

పాటలు[మార్చు]

ఓరి దేవుడా
లియన్‌ జేమ్స్‌ స్వరపరచిన పాటలు
విడుదల2022
రికార్డింగు2022
సంగీత ప్రక్రియసినిమా పాటలు
భాషతెలుగు
నిర్మాతలియన్‌ జేమ్స్‌
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఔననవా ఔననవా"  సిద్ శ్రీరామ్[5] 4:50
2. "పాఠశాలలో ఫ్రెండ్ షిప్"  అర్మాన్ మాలిక్
సమీరా భరద్వాజ్
3:54

మూలాలు[మార్చు]

 1. Namasthe Telangana (7 October 2022). "ఆసక్తికరంగా విశ్వక్‌ సేన్‌ 'ఓరి దేవుడా' ట్రైలర్‌..!". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
 2. Namasthe Telangana (11 November 2022). "ఓటీటీలోకి వచ్చేసిన 'ఓరి దేవుడా'.. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏదంటే?". Archived from the original on 11 November 2022. Retrieved 11 November 2022.
 3. Eenadu (21 October 2022). "రివ్యూ: ఓరి దేవుడా." Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
 4. Mana Telangana (22 September 2022). "దేవుడు పాత్ర‌లో విక్ట‌రీ వెంటేష్". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
 5. Hindustan Times Telugu (28 September 2022). "విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' చిత్రం నుంచి అదిరిపోయే మెలోడీ.. అద్భుతంగా పాడిన సిద్ శ్రీరామ్". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.