ఓరు వడక్కన్ వీరగాథ
ఓరు వడక్కన్ వీరగాథ | |
---|---|
దర్శకత్వం | హరిహరన్ |
రచన | ఎం.టి.వాసుదేవన్ నాయర్ |
నిర్మాత | పివి గంగాధరన్ |
తారాగణం | మమ్ముట్టి, బాలన్ కె. నైర్, సురేష్ గోపీ, మాధవి, గీత, కెప్టెన్ రాజు |
ఛాయాగ్రహణం | కె. రామచంద్రబాబు |
కూర్పు | ఎం.ఎస్. మణి |
సంగీతం | బొంబాయి రవి |
నిర్మాణ సంస్థ | గృహలక్ష్మీ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | కల్పక ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 14 ఏప్రిల్ 1989 |
సినిమా నిడివి | 168 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
ఓరు వడక్కన్ వీరగాథ, 1989 ఏప్రిల్ 14న విడుదలైన మలయాళం పౌరాణిక సినిమా. హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎం.టి.వాసుదేవన్ నాయర్, మమ్ముట్టి, బాలన్ కె. నైర్, సురేష్ గోపీ, మాధవి, గీత, కెప్టెన్ రాజు తదితరులు నటించారు.[1] 1989లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు (మమ్ముట్టి), జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే (ఎంటి వాసుదేవన్ నాయర్), జాతీయ ఉత్తమ కళా దర్శకుడు, జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (పి. కృష్ణమూర్తి ) వంటి నాలుగు విభాగాలలో, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో ఏడు అవార్డులను గెలుచుకుంది.
నటవర్గం
[మార్చు]- మమ్ముట్టి (చందు చెకవర్)[2]
- బాలన్ కె. నాయర్ (కన్నప్పన్ చెకవర్)
- సురేశ్ గోపి (ఆరోమల్ చెకవర్)
- మాధవి (ఉన్నియర్చ)
- కెప్టెన్ రాజు (అరింగోదర్ చెకవర్]]
- గీత (కుంజీ)
- రాజ్యలక్ష్మి (కుట్టిమణి)
- జోమోల్ (ఉన్నియర్చ)
- వినీత్ కుమార్ (యువ చందు)
- విశాల్ మీనన్ (యువ కుంజిరామన్)
- బియాన్ (చైల్డ్ ఆర్టిస్ట్)
- రాము
- దేవన్ (ఉన్నికొన్నార్)
- ఒడువిల్ ఉన్నికృష్ణన్ (రాజు)
- చిత్ర (కుంజినూలీ)
- సూర్య (కమ్మరి కూతురి)
- సంజయ్ మిత్రా (ఆరోమల్ ఉన్ని)
- రషీద్ ఉమర్ (కనప్పన్ ఉన్ని)
- సుకుమారి (కన్నప్పన్ చెకవర్ భార్య)
- వికె శ్రీరామన్ (కుంజిరామన్)
- కుందార జానీ (అరింగోదర్ విద్యార్థి)
- భీమన్ రఘు (అరింగోదర్ విద్యార్థి)
- టోనీ (ఉన్నికన్నన్)
స్పందన
[మార్చు]ఓరు వడక్కన్ వీరగాథ వాణిజ్యపరంగా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది.[3]
బాక్సాఫీస్
[మార్చు]ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. థియేటర్లలో 375 రోజులు నడిచింది. [4]
అవార్డులు
[మార్చు]భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- ఉత్తమ స్క్రీన్ ప్లే - ఎం.టి.వాసుదేవన్ నాయర్
- జాతీయ ఉత్తమ నటుడు - మమ్ముట్టి(మథిలుకల్) సినిమాకు
- జాతీయ ఉత్తమ కళా దర్శకత్వం - పి. కృష్ణమూర్తి
- జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - పి. కృష్ణమూర్తి
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
- ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం - పివి గంగాధరన్
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
- ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- ఉత్తమ స్క్రీన్ ప్లే - ఎం.టి.వాసుదేవన్ నాయర్
- ఉత్తమ నటుడు - మమ్ముట్టి
- రెండవ ఉత్తమ నటి - గీత
- ఉత్తమ సినిమాటోగ్రఫీ - కె. రామచంద్ర బాబు
- ఉత్తమ మహిళా ప్లే బ్యాక్ సింగర్ - కె. ఎస్. చిత్ర
- ఉత్తమ బాలనటుడు - వినీత్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ "Oru Vadakkan Veeragatha (1989)". Indiancine.ma. Retrieved 2021-08-22.
- ↑ K. T. C. Abdullah, P. M. Jayan. "വടക്കന് വീരഗാഥയില് ആദ്യം പ്രേംനസീര് ആയിരുന്നു നായകന്" Archived 23 సెప్టెంబరు 2015 at the Wayback Machine. Chandrika Weekly. 7 October 2013. Retrieved 2021-08-22.
- ↑ Srivatsan (7 September 2016). "Happy Birthday Mammootty: 5 best performances of Mammukka you shouldn't miss". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-22.
- ↑ "10 Mammootty films to watch before you die". The Times of India. 24 May 2016. Retrieved 2021-08-22.