ఓలోమ్ పాన్యాంగ్
| ఓలోమ్ పాన్యాంగ్ | |||
| పదవీ కాలం 2014 – 2019 | |||
| ముందు | జె.కె. పాంగ్గెంగ్ | ||
|---|---|---|---|
| తరువాత | కంగ్‌గోంగ్ తకు | ||
| నియోజకవర్గం | మరియాంగ్-గెకు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తృణమూల్ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఓలోమ్ పాన్యాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మరియాంగ్-గెకు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఓలోమ్ పాన్యాంగ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మరియాంగ్-గెకు శాసనసభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2,212 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జె.కె. పాంగ్గెంగ్ పై 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఓలోమ్ పాన్యాంగ్ 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి ఓని పాన్యాంగ్ చేతిలో 673 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Mariyang-Geku (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 25 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Mariyang-Geku". Election Commission of India. 4 June 2024. the original నుండి 7 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.
- ↑ "Mariyang-Geku Assembly Election Result 2024: Oni Panyang of National People's Party wins". The Times of India. 2 June 2024. the original నుండి 6 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.