ఓవర్‌డ్రాఫ్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"ఐ వార్న్ యు, సర్! ది డిస్‌కర్టసీ ఆఫ్ దిస్ బ్యాంక్ ఈజ్ బియాండ్ ఆల్ లిమిట్స్. వన్ వర్డ్ మోర్ అండ్ ఐ — ఐ విత్‌డ్రా మై ఓవర్‌డ్రాఫ్ట్!"

----

పుంచ్ మేగజైన్ వాల్యూమ్ 152, జూన్ 27, 1917 నుంచి సేకరించిన కార్టూన్]]

ఒక బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ (నగదు శేషం) కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలు (విత్‌డ్రా) జరిగినప్పుడు ఓవర్‌డ్రాఫ్ట్ సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో సంబంధిత వ్యక్తి "ఓవర్‌డ్రాన్ " (అందుబాటులో ఉన్నదాని కంటే ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసినట్లు) చేసినట్లు చెప్పబడుతుంది.

ఖాతాను అందించిన సంస్థతో ఒక ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ పథకంపై ముందుగానే ఒప్పందం ఉండి మరియు అధికృత ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలోనే నగదు అధిక ఉపసంహరణ జరిగినట్లయితే, సాధారణంగా ముందుగా అంగీకరించిన రేటుతో దీనికి వడ్డీ వసూలు చేస్తారు. అంగీకరించిన నిబంధనల కంటే ఎక్కువ స్థాయిలో నగదు తీసుకున్నట్లయితే, దానికి రుసుములు వసూలు చేయడంతోపాటు, అధిక వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఓవర్‌డ్రాఫ్ట్ యొక్క చరిత్ర[మార్చు]

మొదటి గుర్తించిన ఓవర్‌డ్రాఫ్ట్‌ను 1728లో విలియమ్ హాగ్ అనే వ్యాపారికి అందించడం జరిగింది, ఇతనికి తన ఖాతాలో ఉన్నదాని కంటే అదనంగా £1000 వరకు నగదు తీసుకునేందుకు (ప్రస్తుత విలువ ప్రకారం దాదాపుగా £65000, US $93000) అనుమతి ఇచ్చారు.[1] ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఈ ఓవర్‌డ్రాఫ్ట్‌ను కల్పించింది, దీనికి ముందు ఏడాది ఎడిన్‌బర్గ్‌లో ఈ బ్యాంకు ప్రారంభమైంది.

ఓవర్‌డ్రాఫ్ట్‌లకు కారణాలు[మార్చు]

ఓవర్‌డ్రాఫ్ట్‌లు వివిధ కారణాలతో సంభవిస్తుంటాయి. అవి:

 • ఉద్దేశపూర్వక స్వల్ప-కాలిక రుణం - ఒక ఖాతాదారు తన వద్ద తక్కువ నగదు ఉన్నట్లు గుర్తించి, తెలిసే ఒక అసమృద్ధ-నగదు రుణం స్వీకరిస్తాడు. దీని ద్వారా వారు అనుబంధ రుసుములకు అంగీకరించడంతోపాటు, తరువాతి జమతో (డిపాజిట్) ఓవర్‌డ్రాఫ్ట్ పరిధిలోకి వస్తారు.
 • ఒక సరైన ఖాతా నమోదుచిట్టాను నిర్వహించడంలో వైఫల్యం - దీనిలో ఒక ఖాతాదారు తన ఖాతాలో కార్యకలాపానికి సరిగా బాధ్యత వహించకుండా, నిర్లక్ష్యం ద్వారా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.
 • ATM ఓవర్‌డ్రాఫ్ట్ - బ్యాంకులు లేదా ATMలు నగదు తగిన స్థాయిలో అందుబాటులో లేనప్పటికీ, అదనపు నగదును తీసుకునేందుకు అనుమతిస్తాయి. నగదు తీసుకునే సమయంలో ఈ వాస్తవం ఖాతాదారు తెలిసి లేదా తెలియకుండా జరగవచ్చు. కార్డు ఉన్న వ్యక్తి యొక్క బ్యాంకుతో ATM సంప్రదింపు జరపలేనట్లయితే, అది అధికృత వ్యవస్థ చేత ముందుగా నిర్దేశించబడిన పరిమితులకు లోబటి నగదు ఉపసంహరణకు వీలు కల్పించబడుతుంది.
 • తాత్కాలిక జమ నిలిపివేత - ఒక ఖాతాలో చేసిన జమ బ్యాంకు ద్వారా నిలిపివేయబడుతుంది. నియంత్రణ CC (జమ చేసిన చెక్‌లపై నిలిపివేతలు విధించడాన్ని ఇది నియంత్రిస్తుంది) కారణంగా ఇది జరగవచ్చు లేదా బ్యాంకుల సొంత విధానాలు కారణంగా కూడా ఇది జరిగే అవకాశం ఉంది. దీంతో నగదు తక్షణమే అందుబాటులో లేకపోవడంతో, ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములకు దారితీస్తుంది.
 • అనూహ్య ఎలక్ట్రానిక్ ఉపసంహరణలు - ఒక వ్యాపారం ద్వారా గతంలో ఒక సందర్భంలో ఖాతాదారుకు అధికృత ఎలక్ట్రానిక్ ఉపసంహరణలకు అనుమతి ఉండవచ్చు. ఒక ఉచిత వినియోగ కాలం తరువాత ఒక ఆవర్త (రికరింగ్) సేవ యొక్క ప్రారంభం వంటి, ఒప్పందం యొక్క నిబంధనలు ద్వారా న్యాయబద్ధంగా ఎలక్ట్రానిక్ ఉపసంహరణ సాధ్యనీయం చేయబడినట్లయితే, ఇరుపక్షాల మధ్య మంచి నమ్మకంతో దీనికి వీలు కల్పిస్తారు. ఒక అధిక చెల్లింపును తిరిగి పొందేందుకు ఒక వేతన ఆదేశం, ఒక పన్ను సంస్థకు చేసిన ఒక ఆఫ్‌సెట్ విజ్ఞప్తి లేదా ఒక రుణ ఖాతా లేదా అదే బ్యాంకులో వేరొక ఖాతా నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ లేదా ప్రత్యక్ష-జమ ఛార్జ్‌బ్యాక్ (రుసుము) ఫలితంగా కూడా రుణం ఇవ్వబడుతుంది.
 • మర్చంట్ ఎర్రర్ (వ్యాపార తప్పిదం) - మానవ తప్పిదం కారణంగా ఒక వినియోగదారు యొక్క ఖాతా నుంచి ఒక వ్యాపారి పొరపాటున నగదును ఉపసంహరించవచ్చు. ఉదాహరణకు, ఒక వినియోగదారు $5.00 కొనుగోలుకు అనుమతి ఇచ్చినప్పుడు, ఈ ఖాతాలో $500.00 కొనుగోలు జరిగినట్లు చేయవచ్చు. వినియోగదారుకు కోల్పోయిన ఈ నగదును వ్యాపారికి ఛార్జ్‌బ్యాక్ (తిరిగి చెల్లించాలని పంపే ఆదేశం) ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంది.
 • వ్యాపారికి ఛార్జ్‌‍బ్యాక్ - ఒక వినియోగదారు వద్ద తప్పుడు క్రెడిడ్ లేదా డెబిట్ కార్డు ఛార్జిని వసూలు చేసిన కారణంగా లేదా ఒక ఖాతాదారు ఒక వ్యాపారి వద్ద నుంచి వస్తువులు లేదా సేవలకు "చెల్లింపు" చేసేందుకు మరొకరి ఖాతాను ఉపయోగించి అనుమతిలేని క్రెడిట్ లేదా డెబిట్ కార్డు చెల్లింపులు చేసినప్పుడు వ్యాపారి ఖాతాకు ఒక ఛార్జ్‌బ్యాక్ (వివాదాస్పద నగదును తిరిగి చెల్లించాలనే ఆదేశం) వెళుతుంది. ఛార్జ్‌బ్యాక్ మరియు అనుబంధ రుసుము ఫలితంగా ఛార్జ్‌బ్యాక్ పొందిన వ్యాపారి ఖాతా నుంచి తరువాతి నగదు ఉపసంహరణ లేదా డెబిట్ సమయంలో ఓవర్‌డ్రాఫ్ట్ లేదా అసమృద్ధ నగదు ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు.
 • అధికృత నిలిపివేతలు - ఒక వినియోగదారు తన పిన్‌ను (PIN) ఉపయోగించకుండా డెబిట్ కార్డుతో ఒక కొనుగోలు జరిపినప్పుడు, ఈ లావాదేవీని ఒక రుణ లావాదేవీగా పరిగణిస్తారు. వినియోగదారు ఖాతాలో నగదు నిలిపివేయబడుతుంది, తద్వారా వినియోగదారుకు అందుబాటులో ఉండే నగదు పరిమాణం తగ్గుతుంది. అయితే ఈ లావాదేవీని పూర్తి చేసే వరకు వ్యాపారికి దీనికి సంబంధించిన నగదు చేరదు. బ్యాంకులు నిరవధికంగా ఈ నిధులను నిలిపివుంచవు, వ్యాపారి నిధులు సేకరించడానికి ముందుగానే బ్యాంకు ఈ నగదును విడుదల చేస్తుంది, అందువలన ఈ నగదు తిరిగి అందుబాటులోకి వస్తుంది. ఖాతాదారు ఈ నగదును ఖర్చుపెట్టినట్లయితే, వ్యాపారి అసలు కొనుగోలు కోసం నగదును సేకరిస్తున్న సమయానికి మధ్యంతర జమలేవీ జరగప్పుడు, సంబంధిత ఖాతాలో ఓవర్‌డ్రా జరుగుతుంది.
 • బ్యాంకు రుసుములు - ఒక ఖాతాదారుకు అనూహ్యంగా బ్యాంకు ఒక రుసుమును విధించవచ్చు, తద్వారా ఈ ఖాతాలో తరువాతి నగదు ఉపసంహరణ సమయంలో అసమృద్ధ నగదు ఉంటుంది.
 • ప్లెయింగ్ ది ఫ్లోట్ - ఒక ఖాతాదారు రుణం సర్దుబాటు అయ్యే సమయానికి ముందుగానే తగిన నిధులను తాను జమ చేయగలనని భావించి తన ఖాతా నుంచి ఒక నగదు ఉపసంహరణ జరపవచ్చు. అనేక సందర్భాల్లో ఇటువంటి పనులను నిజాయితీగల ఉద్దేశాలతోనే చేయడం జరుగుతుంది, చెక్‌లు క్లియర్ అవడానికి పట్టే సయమం మరియు ఉపసంహరణలు మరియు జమల సంవిధానంలో వ్యత్యాసం వంటి సందర్భాలు చెక్ కిట్టింగ్ చేసే వారి ద్వారా దోచుకోబడతాయి.
 • తిరిగివచ్చిన చెక్ డిపాజిట్ - ఒక ఖాతాదారు చెక్ లేదా మనియార్డర్‌ను డిపాజిట్ చేసినప్పుడు, డిపాజిట్ చేసిన (జమ చేసిన) చెక్ అసమృద్ధ నిధులు, ఒక మూసివేసిన ఖాతా లేదా నకిలీ, దొంగిలించిన, మార్పలు చేసిన లేదా మోసపూరిత సర్దుబాటు చేసిన కారణంగా తిరిగి వస్తుంది. చెక్ ఛార్జ్‌బ్యాక్ మరియు అనుబంధ రుసుము ఫలితంగా, ఒక ఓవర్‌డ్రాఫ్ట్ ఏర్పడుతుంది లేదా ఒక తరువాతి వ్యయానికి కారణమవుతుంది. జమ చేసినది తప్పుడు వస్తువుగా తేలినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడవచ్చు, సంబంధిత ఖాతాదారు ఒక తప్పుడు చెక్ లేదా ఒక నకిలీ చెక్ కళంకం యొక్క బాధితుడు అవతాడు. పర్యవసానంగా ఏర్పడిన ఓవర్‌డ్రాఫ్ట్ భారీమొత్తంలో ఉన్నప్పుడు లేదా స్వల్ప సమయంలో దానిని తిరిగి చెల్లించినప్పుడు, ఈ ఖాతాదారుపై బ్యాంకు కేసు పెడుతుంది లేదా క్రిమినల్ అభియోగాలు కూడా మోపే అవకాశం ఉంది.
 • ఉద్దేశపూర్వక మోసం - తప్పిదం ద్వారా తమ ఖాతాలో కనిపించిన నిధులను ఒక ATM ద్వారా ఉపసంహరించినట్లయితే లేదా ఒక ఖాతాదారు జమచేసిన ఒక చెక్ లేదా మనియార్డర్ మోసపూరితమైనదని తేలితే (పై భాగాన్ని చూపండి) మరియు మోసం గుర్తించడానికి ముందే ఆ నగదును ఉపసంహరించినట్లయితే తిరిగి చెల్లించాలని ఆదేశం వచ్చిన తరువాత ఒక ఓవర్‌డ్రాఫ్ట్ ఏర్పడుతుంది.

సంబంధిత వ్యక్తి ఖాతాపై, మరో వ్యక్తి ఖాతాపై లేదా మరో వ్యక్తి పేరుమీద ఒక గుర్తింపు చౌర్యం ద్వారా ప్రారంభించిన ఖాతాపై మోసం అభియోగం మోపబడుతుంది.

 • బ్యాంకు తప్పిదం - మానవ లేదా కంప్యూటర్ తప్పిదం కారణంగా ఒక చెక్ డెబిట్ ద్వారా ఒక తప్పుడు నగదు పరిమాణం ఖాతాలో కనిపించవచ్చు, జమ చేసిన నగదు కంటే ఎక్కువగా ఉన్న నగదును ఖాతా నుంచి ఉపసంహరించవచ్చు. కొన్ని బ్యాంకు తప్పిదాలు ఖాతాదారు ప్రయోజనాలకు భంగం కలిగించేందుకు కారణమవతాయి, అయితే ఇతరాలు ఖాతాదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.
 • వంచన - బ్యాంకు ఖాతాలు గుర్తింపు చౌర్యానికి లక్ష్యమయ్యే అవకాశం కూడా ఉంది. డిమాండ్-డ్రాఫ్ట్, ATM-కార్డు లేదా డెబిట్-కార్డు మోసం, స్కిమ్మింగ్, చెక్ ఫోర్జరీ, ఒక ఖాతా స్వాధీనం, లేదా ఫిషింగ్ వంటి చర్యల ఫలితంగా ఇది జరగవచ్చు. ఈ నేరపూరిత చర్య ఒక ఓవర్‌డ్రాఫ్ట్ లేదా దీనికి కారణమయ్యే విధంగా ఒక నగదు ఉపసంహరణకు దారితీస్తుంది. ఒక ATM డిపాజిట్ నుంచి నగదు లేదా చెక్‌లు దొంగిలించబడవచ్చు లేదా ఎన్వలప్ చేజార్చుకోవడం లేదా చోరీకి గురవడం కూడా జరగవచ్చు, ఇటువంటి సందర్భాల్లో బాధితుడికి తరచుగా పరిష్కార చర్యలు కూడా తిరస్కరించబడతాయి.
 • ఇంట్రాడే ఓవర్‌డ్రాఫ్ట్ - ఖాతాదారు ఖాతాలో ఒక డెబిట్ జరిగినప్పుడు ఒక ఓవర్‌డ్రాఫ్ట్‌కు దారితీసినట్లయితే, ఒకే వ్యాపార దినం సందర్భంగా ఖాతాకు జోడించబడే ఒక రుణం ద్వారా అది సవరించబడుతుంది. వాస్తవానికి దీని ఫలితంగా ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములు విధించాలా లేదా అనేది బ్యాంకుతో డిపాజిట్-ఖాతాదారు ఒప్పందం ఆధారంగా నిర్ణయిస్తారు.

యునైటెడ్ కింగ్‍డమ్[మార్చు]

UKలో ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ[మార్చు]

UKలో బ్యాంకులు తరచుగా ముందుగా-ఏర్పాటు చేసిన పరిమితికి లోబడి (దీనిని ఒక అధికృత ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిగా గుర్తిస్తారు) ఒక ప్రాథమిక ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే, దీనిని సగటు నెలసరి బ్యాలెన్స్ లేదా బ్యాంకు యొక్క ఓవర్‌డ్రాఫ్ రుణ మంజూరు రేటును బట్టి ఉచిత వడ్డీతో అందించడం జరుగుతుంది, అయితే బ్యాంకుల మధ్య ఓవర్‌డ్రాఫ్ట్ మంజూరు రేటును బట్టి మరియు ఖాతాను బట్టి ఇది మారుతుంటుంది.

ఒక ఖాతాదారు తన యొక్క అధికృత ఓవర్‌డ్రాఫ్ట్‌ను పరిమితిని మించి ఉపయోగించినప్పుడు, వారు అనుమతి లేకుండా ఓవర్‌డ్రాన్ చేసినట్లు అవుతుంది, దీని ఫలితంగా సంబంధిత ఖాతాదారుపై ఒకటి లేదా రెండు రుసుముల విధించడం, వీటితోపాటు తమ అధికృత ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని మించి తీసుకున్న నగదుకు అధిక వడ్డీ రేటు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాంకులు వసూలు చేసే రుసుములు బ్యాంకులనుబట్టి మారుతుంటాయి, అసమృద్ధ నిధుల కారణంగా ఒక వస్తువును బ్యాంకు తిరస్కరించినట్లయితే, సంబంధిత ఖాతాదారుపై ఒక రుసుము విధించడం జరుగుతుంది, అంటే, అనుమతిలేని ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఖాతాదారు తీసుకునేందుకు బ్యాంకు అనుమతించదు. ఇటువంటి రుసుముల స్థాయి మరియు విధానం బ్యాంకులనుబట్టి మారుతుంటుంది. సాధారణంగా, బ్యాంకు ఖాతాదారుకు ఈ రుసుముకు సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ ఒక లేఖను పంపుతుంది మరియు ఈ దశ నుంచి పరిమితులకు లోబడి ఖాతాను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఒక BBC వైజిల్‌బ్లౌజర్ కార్యక్రమంలో, ఒక అనుమతిలేని ఓవర్‌డ్రాఫ్ట్‌పై బ్యాంకుకు అయ్యే వాస్తవ వ్యయం రెండు పౌండ్‌ల కంటే ఎక్కువ ఉండదని సూచించారు. [4]

రుసుముల పరిమాణం[మార్చు]

UKలో ప్రధాన బ్యాంకులేవీ పూర్తిస్థాయిలో అనుమతిలేని ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములను తొలగించలేదు. అయితే కొన్ని ఒక "బఫర్ జోన్"ను అందిస్తున్నాయి, ఖాతాదారులు తమ పరిమితికి మించి ఒక నిర్దిష్ట పరిమాణం కంటే తక్కువ మొత్తాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ చేసినట్లయితే ఎటువంటి రుసుములు వసూలు చేయరు. ఓవర్‌డ్రాఫ్ట్ పరిమాణం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఇతర బ్యాంకులు రుసుములు విధిస్తున్నాయి, కొందరు దీనిని అనైతికంగా భావిస్తున్నారు. ఈ విమర్శలకు స్పందనగా, లాయిడ్స్ TSB తన రుసుము విధానంలో మార్పులు చేసింది; ఒక అధికృత ఓవర్‌డ్రాఫ్ట్‌కు ఒకే నెలసరి రుసుముకు బదులుగా, ఈ బ్యాంకు ఇప్పుడు రోజువారీ రుసుమును వసూలు చేస్తుంది. బ్యాంకు ఒక "గ్రేస్ పిరియడ్"ను కూడా అందిస్తుంది, దీని పరిధిలో ఏ వస్తువు తిరిగి పొందకముందు లేదా ఏ బ్యాంకు ఛార్జీలు విధించబడకముందుగా (సోమవారం నుంచి శుక్రవారం వరకు) మధ్యాహ్నం 3.30 గంటలులోగా నగదును చెల్లించవచ్చు (పని దినం యొక్క ప్రారంభంలో చెల్లించబడే స్థాయీ ఆదేశం ఇందుకు మినహాయింపు). ఉదాహరణకు శుక్రవారం ఒక అనూహ్యమైన ఓవర్‌డ్రాఫ్ట్ చేసిన తమ ఖాతాదారులు తిరిగి ఆ డబ్బును సోమవారం ఉదయం 10 గంటలలోగా తిరిగి చెల్లించేందుకు లాయిడ్స్ TSB అనుమతిస్తుంది, వారాంతపు రోజులు (శనివారం మరియు ఆదివారం) యొక్క రోజువారీ ఛార్జీలను మాఫీ చేస్తుంది. అయితే ఇది విడిపించిన నిధులు కానవసరం లేదు. అలయన్స్ & లీసెస్టర్ గతంలో ఒక బఫర్ జోన్ సౌకర్యాన్ని అందించింది (వారి ఖాతా యొక్క ఒక లాస్ట్ ఫ్యూ పౌండ్స్ సౌకర్యంగా దీనిని ప్రచారం చేశారు), అయితే ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని బ్యాంకు ఉపసంహరించింది.

సాధారణంగా, విధించే రుసుములు ఇరవై ఐదు నుంచి ముప్పై పౌండ్‌ల మధ్య ఉంటాయి, వీటితోపాటు డెబిట్ వడ్డీ అధిక స్థాయిలో ఉంటుంది. అసమృద్ధ నిధులు కారణంగా తిరస్కరించబడిన (లేదా బౌన్స్ అయిన) చెక్‌లకు మరియు ప్రత్యక్ష డెబిట్‌లకు విధించే రుసుములు సాధారణంగా ఇదే స్థాయిలో లేదా సాధారణ ఓవర్‌డ్రాఫ్ట్ రుసుముల కంటే కాస్త తక్కువగా ఉంటాయి, మరియు వీటి కంటే ఎక్కువగా కూడా రుసుములు విధించవచ్చు. ఒక చెక్/ప్రత్యక్ష డెబిట్‌ను బ్యాంకులు తిరస్కరించడం, ఇది ఖాతాదారు ఓవర్‌డ్రాన్‌కు దారితీడం మరియు తరువాత ఓవర్‌డ్రాన్‌కు సంబంధిత ఖాతాదారుపై రుసుము విధించడంపై తీవ్ర వివాదం నెలకొంది. అయితే హాలిఫాక్స్ వంటి కొన్ని బ్యాంకులు విధానపరంగా ఎటువంటి రుసుములు విధించడం లేదు, ఇక్కడ ఒక చెల్లించని వస్తువు రుసుము కారణంగా ఓవర్‌డ్రాన్‌కు వెళ్లిన ఒక ఖాతాపై అదనపు రుసుము విధించరు.

న్యాయ హోదా మరియు వివాదం[మార్చు]

2006లో ఆఫీస్ ఆఫ్ ఫెయిర్ ట్రేడింగ్ ఒక ప్రకటన జారీ చేసింది, ఈ ప్రకటన ఖాతాదారులు వారి గరిష్ఠ వ్యయ పరిమితిని అధిగమించినప్పుడు మరియు/లేదా తమ ఖాతాలకు ఆలస్యంగా చెల్లింపులు చేసినప్పుడు క్రెడిడ్ కార్డు మంజూరు చేసే సంస్థలు రుసుములు విధించవచ్చని సూచించింది. ఈ ప్రకటనలో, OFT ఇటువంటి రుసుములను గరిష్ఠంగా 12 UK పౌండ్‌లకు పరిమితం చేయాలని క్రెడిట్ కార్డు మంజూరు సంస్థలకు సిఫార్సు చేసింది.[2]

క్రెడిట్ కార్డు మంజూరు సంస్థలు విధించే రుసుములు అనుమతిలేని ఓవర్‌డ్రాఫ్ట్‌కు బ్యాంకులు విధించే రుసుముకు సమానంగా ఉండాలని OFT అభిప్రాయపడింది. ఈ ప్రకటనను ఉపయోగించుకొని అనేక మంది ఖాతాదారులు తమపై అనుమతిలేని ఓవర్‌డ్రాఫ్ట్ ద్వారా వసూలు చేసిన రుసుములను తిరిగి పొందేందుకు బ్యాంకులపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు వేల్స్ దేశ కోర్టులు ఇటువంటి కేసులతో నిండిపోయనట్లు భావనలు ఉన్నాయి.[3] ది కన్స్యూమర్ యాక్షన్ గ్రూపు వంటి వెబ్‌సైట్‌‍ల ద్వారా ఫిర్యాదుదారులకు తరచుగా సాయం అందుతుంది.[4] అనుమతి లేని ఓవర్‌డ్రాఫ్ట్‌లకు తాము విధించే రుసుములను సమర్థించుకున్న అనేక బ్యాంకులు ఈ రోజు వరకు న్యాయస్థానాల్లో హాజరుకాలేదు, అనేక మంది ఖాతాదారులు ఇటువంటి రసుములను పూర్తిగా తిరిగి పొందడం జరిగింది,[5] అయితే బ్యాంకులకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇటువంటి కేసుల్లో తమ బ్యాంకుపై సరిగా వ్యాజ్యం దాఖలు చేయని కారణంగా ఖాతాదారులపై న్యాయస్థానాలు జరిమానాలు కూడా విధించాయి.[6]

అమెరికా సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

USలో ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ అనేది ప్రధానంగా ఆర్థిక సంస్థలు అందించే ఒక ఆర్థిక సేవగా ఉంది. నగదు ఉపసంహరణకు తగిన మొత్తంలో నిధులు లేనప్పుడు ఖాతాదారు యొక్క ఖాతాకు అందించిన వస్తువులకు, ఓవర్‌డ్రాఫ్ట్ లేదా కర్టసీ చెల్లింపు కార్యక్రమ రక్షణ చెల్లింపులు చేస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ పరిధిలో ATM ఉపసంహరణలు, ఒక డెబిట్ కార్డు ద్వారా జరిపిన కొనుగోళ్లు, ఎలక్ట్రానిక్ నగదు బదిలీలు, మరియు చెక్‌లు ఉంటాయి. చెక్‌లు లేదా ACH ఉపసంహరణలు వంటి ముందుగా అనుమతించని వస్తువుల సందర్భంలో కూడా ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ ఈ వస్తువులకు చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తుంది, చెల్లింపుల తిరస్కరణ లేదా బౌన్స్ కావడం జరగకుండా అడ్డుకుంటుంది. అయితే, ఒక డెబిట్ లేదా చెక్ కార్డుతో నిర్వహించిన ATM ఉపసంహరణలు మరియు కొనుగోళ్లు ముందుగా అనుమతించబడినవిగా పరిగణించబడతాయి, వీటిని నిర్వహించినప్పుడు ఓవర్‌డ్రాఫ్ట్‌కు దారితీసినప్పటికీ, బ్యాంకు తప్పనిసరిగా సంబంధిత చెల్లింపులు చేయాలి.

ఓవర్‌డ్రాఫ్ట్‌ల యొక్క తదర్థ భద్రత[మార్చు]

సాంప్రదాయికంగా, ఒక బ్యాంకు మేనేజర్ ప్రతి రోజు బ్యాంకు యొక్క ఓవర్‌డ్రాఫ్ట్‌ల జాబితాను పరిశీలిస్తాడు. ఒక విలువైన ఖాతాదారు ఒక ఓవర్‌డ్రాఫ్ట్ జరిపినట్లు మేనేజర్ చూసినట్లయితే, సంబంధిత ఖాతాదారు ఓవర్‌డ్రాఫ్ట్‌కు చెల్లింపులు చేయడంపై వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అధికారం అతనికి ఉంటుంది. ఈ తదర్థ భద్రతకు బ్యాంకులు సాంప్రదాయికంగా ఎటువంటి రుసుములు వసూలు చేయవు. అయితే, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడివుంటుంది, అందువలన దీనిపై ఆధారపడలేము. భారీ-స్థాయి అంతరాష్ట్ర శాఖా బ్యాంకింగ్ అందుబాటులోకి రావడంతో, సాంప్రదాయిక తదర్థ భద్రత ఆచరణలో కనుమరుగైంది.

బలవంతపు చెల్లింపు జాబితాలుగా పిలిచేవాటికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రతి వ్యాపార దినం ప్రారంభంలో, బ్రాంచ్ మేనేజర్‌లు తరచుగా ఇప్పటికీ తిరస్కరణ పెండింగ్‌లో ఉన్న కంప్యూటరీకరించిన వస్తువుల జాబితాను పొందుతున్నారు, తమ బ్రాంచ్, నగరం లేదా రాష్ట్రంలోని ఖాతాల వివరాలు మాత్రమే వీరు పొందుతారు. సాధారణంగా, ఒక ఖాతాదారు నగదు చెల్లింపుకు బ్యాంకు శాఖకు వచ్చినట్లయితే లేదా తిరస్కరణ పెండింగ్‌లో ఉన్న వస్తువు యొక్క మొత్తానికి సరిపోయే నగదు బదిలీ చేసినట్లయితే మేనేజర్ సంబంధిత వస్తువుకు బలవంతపు చెల్లింపును చేయవచ్చు. అంతేకాకుండా, ఏదైనా అరుదైన పరిస్థితుల్లో లేదా ఒక ప్రామాణిక ఖాతాదారు యొక్క ఖాతాకు చెందిన వస్తువు ఉన్నట్లయితే మేనేజర్ ఆ వస్తువుకు చెల్లింపు పూర్తి చేసేందుకు సాహసించవచ్చు, అయితే ఇది నానాటికీ అసాధారణమవుతుంది. బ్యాంకులు ఈ చర్య తీసుకునేందుకు ఒక నిర్ణీత సమయం ఉంటుంది, ఈ సమయం తరువాత, వస్తువు దానంతటదే తిరస్కరణ పెండింగ్‌లో ఉన్న జాబితా నుంచి తిరస్కరించిన జాబితాకు బదిలీ అవుతుంది, ఈ దశకు చేరుకున్న తరువాత ఎటువంటి చర్య తీసుకోలేము.

జమ యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ క్రమాలు[మార్చు]

ఈ రకమైన ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ ఒక ఒప్పంద సంబంధంగా ఉంది, ఈ ఒప్పందంలో బ్యాంకు ఒక నిర్ణీత డాలర్ పరిమితి వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌లకు బ్యాంకు చెల్లింపులు చేసేందుకు హామీ ఇస్తుంది. జమ యొక్క ఒక ఓవర్‌డ్రాఫ్ట్ క్రమాన్ని కోరుకునే వినియోగదారు ఒక దరఖాస్తును పూర్తి చేసి, దానిపై సంతకం చేయాలి, తరువాత వినియోగదారు యొక్క రుణాన్ని బ్యాంకు పరిశీలిస్తుంది, ఆపై ఈ దరఖాస్తుకు అంగీకారం తెలపడం లేదా తిరస్కరించడంపై నిర్ణయం తీసుకుంటుంది. జమ యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ క్రమాలు అప్పులుగా ఉంటాయి, ట్రూత్ ఇన్ లెండింగ్ యాక్ట్‌కు ఇవి అనుగుణంగా ఉండాలి. అనుబంధ ఖాతాలు మాదిరిగా, బ్యాంకులు ఎక్కువగా ఓవర్‌డ్రాఫ్ట్‌కు ఒక నామమాత్రపు రుసుమును వసూలు చేస్తాయి, అంతేకాకుండా నిల్వవున్న బ్యాలెన్స్‌పై వడ్డీరేటును విధిస్తాయి. కొన్ని బ్యాంకులు కొద్దిస్థాయిలో నెలసరి రుసుమును వసూలు చేస్తాయి, ఉపయోగించిన జమ యొక్క క్రమంతో సంబంధం లేకుండా దీనిని వసూలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన ఓవర్‌డ్రాఫ్ట్ భద్రత ఖాతాలకు బ్యాంకులు ఏర్పాటు చేసిన విశ్వసనీయత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వినియోగదారులకు కల్పించబడుతుంది. జమ యొక్క క్రమం ఏర్పాటు చేసిన తరువాత, అందుబాటులో ఉండే జమ యొక్క మొత్తం వినియోగదారు యొక్క అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో భాగంగా కనిపిస్తుంది.

అనుబంధ ఖాతాలు[మార్చు]

"ఓవర్‌డ్రాఫ్ట్ బదిలీ భద్రత"గా కూడా ఇది సూచించబడుతుంది, దీనిలో ఒక పరిశీలనలో ఉన్న ఖాతాను మరో ఖాతాకు అనుసంధానం చేయడం జరుగుతుంది, పొదుపు ఖాతా, క్రెడిట్ కార్డు లేదా జమ యొక్క క్రమం వంటి వాటికి ఖాతాను అనుసంధానం చేస్తారు. అనుసంధానం చేసిన తరువాత, ఒక వస్తువును పరిశీలనలో ఉన్న ఖాతాకు ప్రతిపాదించినట్లయితే, అది ఒక ఓవర్‌డ్రాఫ్ట్‌కు దారితీస్తుంది, నిధులు అనుబంధ ఖాతా నుంచి ఓవర్‌డ్రాఫ్ట్‌ను పూడ్చేందుకు మళ్లించబడతాయి. ప్రతి ఓవర్‌డ్రాఫ్ట్ బదిలీకి ఒక నామమాత్రపు రుసుము వసూలు చేయబడుతుంది, అనుసంధానం చేసిన ఖాతా ఒక క్రెడిట్ కార్డు లేదా ఇతర రుణ క్రమం అయినప్పుడు, వినియోగదారు ఖాతాకు సంబంధించిన నిబంధనలు ప్రకారం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.

అనుసంధాన ఖాతాలు మరియు ఒక జమ యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ క్రమం మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే జమ యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ క్రమం ఎక్కువగా ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ కోసం ఉపయోగించబడుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్ రక్షణ కోసం అనుసంధానం చేయబడిన వేర్వేరు ఖాతాలు వారి సొంత హక్కులో స్వతంత్ర ఖాతాలుగా ఉంటాయి.

బౌన్స్ రక్షణ పథకాలు[మార్చు]

కొన్ని బ్యాంకులు అందిస్తున్న ఇటీవలి సదుపాయాన్ని "బౌన్స్ రక్షణ"గా పిలుస్తారు.

బ్యాంకులు అదనపు రుసుము ఆదాయాన్ని పొందేందుకు సాయపడే తృతీయ పక్ష కంపెనీల ద్వారా అమలు చేయబడే పథకాలను చిన్న బ్యాంకులు అందిస్తున్నాయి.[7] పెద్ద బ్యాంకులు బౌన్స్ రక్షణ పథకాలను అందించడం లేదు, అయితే దీనికి బదులుగా ఓవర్‌డ్రాఫ్ట్‌లను వారి ఖాతా నిబంధనలు మరియు షరుతుల పరిధిలో అమలు చేస్తున్నాయి.

రెండు సందర్భాల్లోనూ, బ్యాంకు వ్యక్తిగత నిర్ణయం మరియు ఒక ఓవర్‌డ్రాఫ్ట్ రుసుము వసూలు చేయడం ద్వారా ఓవర్‌డ్రాన్ వస్తువులకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తుంది, ఈ మొత్తం వెల్లడి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. సాంప్రదాయిక తదర్థ రక్షణకు భిన్నంగా, ఓవర్‌డ్రాన్ వస్తువులకు చెల్లింపులు చేయాలా వద్దా అనే ఈ నిర్ణయం స్వయంచాలకంగా జరుగుతుంది, ఖాతాదారు యొక్క సగటు బ్యాలెన్స్, ఖాతా యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ చరిత్ర, బ్యాంకులో ఖాతాదారుకు ఉన్న ఖాతాల సంఖ్య మరియు ఖాతాలను ఎంత కాలం నుంచి నిర్వహిస్తున్నారనే అంశాల ఆధారంగా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోబడతాయి.[8] అయితే, స్వయంచాలక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ఓవర్‌డ్రాఫ్ట్‌కు చెల్లింపులు చేస్తామని బ్యాంకు హామీ ఇవ్వదు.

బౌన్స్ రక్షణ పథకాలకు జమ యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ క్రమాలు మరియు ఓవర్‌డ్రాఫ్ట్‌ల యొక్క తదర్థ రక్షణలతో అసాధారణ సారూప్యతలు ఉన్నాయి, అయితే ఇవి వేర్వేరు నిబంధనల పరిధిలో నిర్వహించబడుతున్నాయి. జమ యొక్క ఒక ఓవర్‌డ్రాఫ్ట్ క్రమం మాదిరిగా, బౌన్స్ రక్షణ పథకం యొక్క బ్యాలెన్స్ ఖాతాదారు యొక్క అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో భాగంగా కనిపిస్తుంది, ఒక ఓవర్‌డ్రాన్ వస్తువుకు చెల్లింపులు చేయాలా వద్దా అనేది బ్యాంకు నిర్ణయంపై ఆధారపడివుంటుంది, సాంప్రదాయిక తదర్థ రక్షణ మాదిరిగానే ఇక్కడ కార్యకలాపం ఉంటుంది. ప్రతి ఓవర్‌డ్రాఫ్ట్ చెల్లింపుకు బ్యాంకులు ఎక్కువగా ఒకే-సమయంలో రుసుము వసూలు చేస్తాయి. ఖాతా రుణాత్మక బ్యాలెన్స్‌లో ఉన్న కాలంలో ప్రతి రోజు ఒక పునరావృత రోజువారీ రుసుమును కూడా బ్యాంకు వసూలు చేయవచ్చు.

ఒక వినియోగదారుకు నిధులు చేరుకున్న కారణంగా, తిరిగి చెల్లింపును ఆశించవచ్చు, అందువలన బౌన్స్ రక్షణ ఒక రకమైన రుణమవుతుందని విమర్శకులు వాదిస్తున్నారు.[9] ఓవర్‌డ్రాఫ్ట్‌లకు బాధ్యత వహించేందుకు ఒప్పందం ప్రకారం బ్యాంకులు హామీ ఇవ్వడం లేదు కాబట్టి, బౌన్స్ రక్షణ ట్రూత్ ఇన్ లెండింగ్ యాక్ట్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, ఈ చట్టం కొన్ని మోసపూరిత ప్రకటనలను నిషేధిస్తుంది, రుణాల యొక్క నిబంధనలను వెల్లడించాలని సూచిస్తుంది. చారిత్రాత్మకంగా, బౌన్స్ రక్షణను ఒక వినియోగదారు ఖాతాకు అతను లేదా ఆమె అనుమతి లేదా పరిజ్ఞానం లేకుండానే జోడిస్తారు.

మే 2005లో ట్రూత్ ఇన్ సేవింగ్స్ యాక్ట్ యొక్క రెగ్యులేషన్ DDకి సవరణ చేశారు, బౌన్స్ రక్షణ పథకాలు అందిస్తున్న బ్యాంకులు వారి ఖాతాదారుల గురించి కొన్ని వివరాలు వెల్లడించాలని ఈ సవరణ సూచిస్తుంది. బౌన్స్ రక్షణ అమల్లోకి వచ్చేందుకు కారణమ్యే లావాదేవీల రకాలను, బౌన్స్ రక్షణకు సంబంధించిన రుసుములు, విధించిన రుసుముల సంఖ్యను అంచనా వేసేందుకు ప్రత్యేక ప్రకటన విభాగాలు మరియు తప్పుదోవపట్టించే ప్రకటనలను నిరోధించేందుకు బౌన్స్ రక్షణ పథకాల యొక్క మార్కెటింగ్‌పై నియంత్రణలను వెల్లడించాలని ఈ సవరణలు తెలియజేశాయి. ఈ వివరాలను ఇప్పటికే పెద్ద బ్యాంకులు వెల్లడిస్తున్నాయి, ఇవి ఓవర్‌డ్రాఫ్ట్‌లను వాటి నిబంధనలు మరియు షరతుల ప్రకారం అమలు చేస్తున్నాయి.

పరిశ్రమ గణాంకాలు[మార్చు]

U.S. బ్యాంకులు 2009లో $38.5 బిలియన్‌ల ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములు వసూలు చేస్తున్నట్లు అంచనా వేశారు, 2000 సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం ఇప్పుడు రెట్టింపయింది.[10]

లావాదేవీ నియంత్రణ క్రమం[మార్చు]

బ్యాంకులు ఒక వినియోగదారు యొక్క ఖాతాకు లావాదేవీలు ప్రకటించే క్రమం ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములకు సంబంధించిన వివాదాస్పద అంశంగా ఉంది. పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు నియంత్రణ ఒక ఖాతాదారు యొక్క ఖాతాపై ఓవర్‌డ్రాఫ్ట్ సంభవనీయతలను ఎక్కువగా చేసేవిధంగా ఉండటం ఇది వివాదాస్పదంగా మారడానికి కారణమైంది. కొనుగోలు చేసే సమయంలో ఖాతాలో తగిన నిధులు ఉండి, ఖాతాదారు అనేక కొద్దిస్థాయి ఉపసంహరణలు జరిపిన పరిస్థితిలో ఈ సమస్య ఏర్పడుతుంది. తరువాత, ఖాతాదారు తన ఖాతాలో ఒక పెద్ద చెల్లింపు చేసినట్లయితే (అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా) అది ఓవర్‌డ్రాఫ్ట్‌కు దారితీస్తుంది. ఒకే రోజు అన్ని వస్తువులకు చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు, బ్యాంకు మొదట పెద్ద లావాదేవీని అమలు చేస్తుంది, దీని వలన పలు ఓవర్‌డ్రాఫ్ట్‌లు ఏర్పడతాయి.

పెద్ద U.S. బ్యాంకుల్లో పెద్దదానిని మొదట పరిశీలించే విధానం సాధారణంగా పాటించబడుతుంది.[11] వినియోగదారు యొక్క అత్యంత ముఖ్యమైన లావాదేవీలను రక్షించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి (అద్దె లేదా తనఖా పరిశీలన లేదా సౌకర్య చెల్లింపు వంటివి) ఈ లావాదేవీలకు చెల్లింపులు జరగకుండా తిరిగి రావడాన్ని అడ్డుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వాదిస్తున్నాయి, కొన్ని బ్యాంకులు ఇటువంటి లావాదేవీలకు తప్పనిసరి చెల్లింపులను హామీ ఇస్తున్నాయి. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వినియోగదారులు ప్రయత్నించారు, బ్యాంకులు పాటిస్తున్న పెద్ద లావాదేవీని మొదట చెల్లించే విధానం కారణంగా ఎక్కువ ఓవర్‌డ్రాఫ్ట్ రుసుముల వసూలుకు దారితీస్తున్నాయని వాదిస్తూ వారు న్యాయస్థానాలకు వెళ్లారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బ్యాంకులు ఎక్కువగా ఆఫీస్ ఆఫ్ ది కంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ చేత నియంత్రించబడుతున్నాయి, ఇది ఒక సమాఖ్య సంస్థ, ఇది గతంలో ఈ విధానాన్ని ఆమోదించింది: ఈ విధానాన్ని ఇటీవల సవాలు చేయడం జరిగింది, అయితే అనేక మంది వ్యక్తులు వీటిని తప్పుదారిపట్టించే చట్టాలుగా సూచించారు.[12]

బ్యాంకు డిపాజిట్ ఒప్పందాలు సాధారణంగా బ్యాంకు సొంత నిర్ణయం ప్రకారం లావాదేవీలను ఏ క్రమంలోనైనా సర్దుబాటు చేయవచ్చని సూచిస్తాయి.[13]

ప్రతిపాదిత చట్టం[మార్చు]

H.R. 946ను US ప్రతినిధుల సభలో ఫిబ్రవరి 10, 2007న ప్రవేశపెట్టారు, ఇది ఓవర్‌డ్రాఫ్ట్ రుణ పథకాలపై నియంత్రణలను పెంచుతుంది. ట్రూత్ ఇన్ లెండింగ్ యాక్ట్ (రెగ్యులేషన్ Z)కు సవరణ చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదిత చట్టం ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములను స్పష్టీకరిస్తుంది, ఓవర్‌డ్రాఫ్ట్ రుణ పథకంలో వీటికి ముందుగానే రాతపూర్వక సమ్మతిని తీసుకోవాలని సూచిస్తుంది, అంతేకాకుండా ఈ సవరణ ATM నగదు ఉపసంహరణ ఒక రుసుము విధింపుకు దారితీసే సందర్భం గురించి బ్యాంకు ఖాతాదారుకు సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతోపాటు, చెక్ క్లియరింగ్ క్రమాన్ని ఆర్థిక సంస్థలు మార్చడాన్ని లేదా ఓవర్‌డ్రాఫ్ట్ రుసుములు పెంచేందుకు డిపాజిట్‌లను నమోదు చేయడంలో జాప్యం చేయడాన్ని నిషేధిస్తుంది. ఈ బిల్లును ఏప్రిల్ 2007లో కమిటీకి సూచించడం జరిగింది, కమిటీలో ఈ బిల్లు రద్దు చేయబడింది.[14] ఫిబ్రవరి 2009లో, ఫెడరల్ రిజర్వ్ ఈ వివాదంపై ప్రజాభిప్రాయాలను సేకరించింది.[15]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఆథరైజేషన్ హోల్డ్
 • బ్యాంకులు
 • బ్యాంకు రుసుము
 • సమాజాల నిర్మాణం
 • రుణం
 • వ్యాపార ఖాతాలు

సూచనలు[మార్చు]

 1. RBS: అవర్ సెంచరీస్ ఆఫ్ ఇన్నోవేషన్ - ప్రోడక్టస్ అండ్ సర్వీసెస్
 2. [1]
 3. [2]
 4. ది కన్స్యూమర్ యాక్షన్ గ్రూప్
 5. [3]
 6. BBC వ్యాసం
 7. అపెండిక్స్ - బౌన్స్ ప్రొటక్షన్
 8. http://www.house.gov/apps/list/hearing/financialsvcs_dem/htfeddis071107.pdf
 9. U.S. PIRG కన్స్యూమర్ బ్లాగ్: బౌన్స్ ప్రొటక్షన్ లోన్స్/డెబిట్ కార్డ్స్ అండర్ కమిటీ మైక్రోస్కోప్
 10. FT.com Banks make $38bn from overdraft fees
 11. USA టుడే: బ్యాంక్స్ చెక్-క్లియరింగ్ పాలసీస్ కుడ్ లీవ్ యు విత్ ఓవర్‌డ్రాఫ్ట్స్
 12. [స్కాట్ జే క్రెప్పెయిన్, డిసెంట్ ఆఫ్ మ్యాన్ లా బ్లాగ్, "పొటన్షియన్ టైడ్ టర్నింగ్ విక్టరీ ఇన్ ది బ్యాటిల్ ఎగైనెస్ట్ ఇల్లీగల్ నాన్-సఫిషియంట్ ఫండ్ అండ్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫీస్: బ్యాంక్ ఆఫ్ అమెరికా సెటిల్స్ క్లోసోన్ క్లాస్ యాక్షన్," http://kreppein.blogspot.com/2009/02/california-class-action-against-bank-of.html] [సీ ఆల్సో క్రెప్పెయిన్, డిసెంట్ ఆఫ్ మ్యాన్ లా బ్లాగ్, "ది UK టేక్స్ స్పెప్స్ టు కర్బ్ ఇల్లీగల్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫీస్, బట్ US ఎఫోర్ట్స్ నాట్ బీన్ సో వెల్ రిసీవ్డ్," http://kreppein.blogspot.com/2007/08/uk-takes-steps-to-curb-illegal.html]
 13. Bank of America Deposit Agreement
 14. H.R. 946: కన్స్యూమర్ ఓవర్‌డ్రాఫ్ట్ ప్రొటక్షన్ ఫెయిర్ ప్రాక్టీసెస్ యాక్ట్ (GovTrack.us)
 15. http://consumerist.com/5145455/should-banks-be-required-to-ask-permission-for-overdrafts

మూస:NSF