ఓవైసీ - మిథాని ఫ్లైఓవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒవైసీ - మిధాని జంక్షన్, హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. కంచన్‌బాగ్‌లోని పిసల్‌బండ్‌ డీఆర్‌డీఎల్‌ వైపు నుంచి ఒవైసీ హాస్పిటల్ జంక్షన్‌ మీదగా ఎల్‌బీ నగర్‌ వైపు నూతనంగా ఓవైసీ - మిథాని ఫ్లైఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

ఓవైసీ - మిథాని ఫ్లైఓవర్ \ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఫ్లై ఓవ‌ర్‌

నిర్మాణ వివరాలు[మార్చు]

డీఆర్​డీఎల్​, మిధాని కూడలి నుంచి ప్రారంభమయ్యే ఓవైసీ - మిథాని ఫ్లైఓవర్ ను 12 మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల యూనీ డైరెక్షనల్‌ పద్ధతిలో 1.365 కిలోమీటర్ల పొడవుతో 38 పిల్లర్లతో స్టాటిజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో రూ.80 కోట్ల వ్యయంతో 2018లో నిర్మాణాన్ని ప్రారంభించారు.

ప్రారంభం[మార్చు]

ఓవైసీ మిథాని ప్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 28 డిసెంబర్ 2021న ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.[1][2] ఒవైసీ - మిధాని జంక్షన్ కు మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఫ్లై ఓవ‌ర్‌ గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపాడు.[3][4]ఈ ఫ్లైఓవర్ వల్ల ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా, కర్మాన్‌ఘాట్, మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్ రింగ్ రోడ్డు, వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం అవుతుంది.[5]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (28 December 2021). "ఒవైసీ - మిధాని ఫ్లై ఓవ‌ర్ ప్రారంభం". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  2. TNews Telugu (28 December 2021). "ఓవైసీ-మిధాని ప్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  3. Namasthe Telangana (28 December 2021). "మాజీ రాష్ట్ర‌ప‌తికి అరుదైన గౌర‌వం.. మిధాని ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరు." Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  4. Andhrajyothy (29 December 2021). "ఒవైసీ ఫ్లైఓవర్‌కు అబ్దుల్‌ కలాం పేరు!". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  5. Eenadu (28 December 2021). "హైదరాబాద్‌ సిగలో మరో ఫ్లైఓవర్‌.. ప్రారంభించిన కేటీఆర్‌". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.