ఓ. వి. ఉష
ఓ. వి. ఉష | |
|---|---|
2016లో ఓ. వి. ఉష | |
| జననం | 1948 నవంబరు 4 |
| వృత్తి | కవయిత్రి, నవలా రచయిత్రి |
| బంధువులు | ఓ. వి. విజయన్ (సోదరుడు) |
ఓ. వి. ఉష (జననం 4 నవంబర్ 1948)[1] ఒక మలయాళ కవయిత్రి, నవలా రచయిత్రి. కె. ఎం. జార్జ్ ఆమెను “లోతైన నైతిక ఆందోళన, సాంకేతిక నైపుణ్యం కలిగిన కవయిత్రి”గా అభివర్ణించాడు.[2] ఆమె నాలుగు కవితా సంపుటాలు, కొన్ని చిన్న కథలు రచించడంతో పాటు ఒక నవల కూడా రచించింది. పలు పత్రికలలో వ్యాసాలు కూడా రాసింది. ఉష మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం డైరెక్టర్‌గా పనిచేసింది. 2000లో విడుదలైన మలయాళ చిత్రం మఝా కు గాను ఆమెకు కేరళ రాష్ట్ర ఉత్తమ గేయరచయిత పురస్కారం లభించింది.[3]
జీవిత విశేషాలు
[మార్చు]ఉష కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో తన కుటుంబంలో చిన్న సంతానంగా జన్మించింది.[4] ఆమె బాల్యం ఎక్కువగా స్వగ్రామంలోనే గడిచింది. ఆమె తండ్రి “మలబార్ స్పెషల్ పోలీస్”లో ఉద్యోగిగా పనిచేశారు. ఆమె పెద్దన్న ఓ. వి. విజయన్ నవలా రచయిత, కార్టూన్ చిత్రకారుడు.[4] తల్లి ప్రభావంతో ఉషకు చిన్ననాటి నుంచే మలయాళ సాహిత్యంపై ఆసక్తి పెరిగింది.[5]
ఉష 13 ఏళ్ల వయస్సులోనే కవితలు రాయడం ప్రారంభించింది. మలయాళ వారపత్రిక మాతృభూమి లోని “చిల్డ్రన్స్ కార్నర్”కు ఆమె తరచూ రచనలు పంపేది.[5] 1973 వరకు ఆమె కవితలు ఆ వారపత్రికలో క్రమం తప్పకుండా ప్రచురితమయ్యాయి. పాఠశాల విద్య పూర్తయ్యాక, ఆమె అన్న ఢిల్లీలో స్థిరపడటం వల్ల ఉష ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో పీజీ పట్టా పొందింది.[4]
విద్య పూర్తయ్యాక ఉష ఒక ప్రచురణ సంస్థలో సంపాదక శిక్షణార్థిగా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ప్రధాన సంపాదకురాలిగా ఎదిగింది.[5] 1971లో ఆమె రాసిన “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే చిన్న కథ అదే పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది.[6] అదే చిత్రానికి ఆమె “ఆరుడే మనసిలే గానమాయీ ” అనే పాటను రచించింది. దీనికి జి. దేవരാജన్ సంగీతం సమకూర్చగా, పి. లీల ఆలపించింది. ఆధునిక మలయాళ సినీ ప్రపంచంలో తొలి మహిళా గేయరచయిత్రిగా ఆమెను భావిస్తారు.
1973 తర్వాత దాదాపు పది సంవత్సరాలు ఆమె రచనలు చేయలేదు. 1982లో మళ్లీ రచనలు ప్రారంభించి అప్పటి నుండి నిరంతరంగా సాహిత్యానికి సేవలందిస్తోంది. ఆమె కవితల్లో చాలా వరకు పుస్తకరూపంలో వెలువడలేదు. ఆమె ఏకైక నవల షాహిద్ నామా 2001లో ప్రచురితమైంది.[5]
2008లో జరిగిన కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల న్యాయనిర్ణేతల మండలిలో సభ్యురాలిగా పనిచేసింది. అలాగే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, కొట్టాయంలో ప్రచురణల విభాగం డైరెక్టర్‌గా సేవలందించింది.[7][8]
రచనలు
[మార్చు]- ధ్యానం (కవిత్వం)
- షాహిద్ నామా (నవల, 2001)
పురస్కారాలు
[మార్చు]- 2000 – మఝా చిత్రానికి గాను కేరళ రాష్ట్ర ఉత్తమ గేయరచయిత పురస్కారం
గమనికలు
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "Archived copy". the original నుండి 13 November 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2018.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ George 1992, p. 253.
- ↑ "State Film Awards 1969 - 2012". Department of Information and Public Relations (Kerala). the original నుండి 7 July 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2014.
- 1 2 3 Ajith Kumar, J. (24 November 2002). "A passion for the unknown". The Hindu. the original నుండి 19 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2014.
- 1 2 3 4 Tharu & Lalita 1993, p. 567.
- ↑ "Some Lady Bards". The Hindu. 3 February 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2014.
- ↑ "Film award jury formed". The Hindu. 19 May 2009. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2014.
- ↑ "Bibliography of new books released". The Hindu. 22 March 2010. the original నుండి 27 March 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2014.
మూలాలు
[మార్చు]- George, K. M. (1992). Modern Indian Literature, an Anthology: Plays and prose. Sahitya Akademi. ISBN 978-81-7201-324-0.
- Tharu, Susie J.; Lalita, Ke (1993). Women Writing in India: The twentieth century. Feminist Press at CUNY. ISBN 978-1-55861-029-3.
బాహ్య లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1948 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- కేరళకు చెందిన నవలా రచయితలు
- మలయాళ గేయరచయితలు
- మలయాళ కవులు
- ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు
- కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కార గ్రహీతలు
- గవర్నమెంట్ విక్టోరియా కళాశాల, పాలక్కాడ్ పూర్వ విద్యార్థులు
- భారతీయ గేయరచయితలు
- భారతీయ కవులు
- భారతీయ చిన్నకథా రచయితలు
- భారతీయ నవలా రచయితలు
- భారతీయ మహిళా చిన్నకథా రచయితలు
- పాలక్కాడ్ జిల్లా ప్రజలు
- కేరళ రచయిత్రులు
- కేరళ కవులు
- భారతీయ కవయిత్రులు
- భారతీయ మహిళా నవలా రచయితలు