ఓ ఇంటి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ ఇంటి కథ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
తారాగణం రజనీకాంత్,
సంగీత,
ఫటాఫట్ జయలక్ష్మి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి బాలాజీ చిత్ర
భాష తెలుగు

ఓ ఇంటి కథ 1981, అక్టోబర్ 7న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో 1979లో విడుదలైన ఆరిలిరింతు అరుపత్తు వరై అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాతృక. ఈ చిత్రంలో రజనీకాంత్, సంగీత, ఫటాఫట్ జయలక్ష్మి నటించగా ఇళయరాజా సంగీతం అందించాడు.[1] ఇదే సినిమా 1985లో శోభన్ బాబు హీరోగా, సుహాసిని హీరోయిన్‌గా మహారాజు పేరుతో పునర్మించబడింది. 1987లో అంబరీష్, అంబిక జంటగా కన్నడభాషలో పూర్ణచంద్ర పేరుతో రీమేక్ చేయబడింది.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
  • స్టూడియో: శ్రీ లక్ష్మి బాలాజీ చిత్ర
  • నిర్మాత: పి.మధుసూధన్ రావు
  • స్వరకర్త: ఇళయరాజా
  • గీత రచయిత: రాజశ్రీ
  • విడుదల తేదీ: అక్టోబర్ 7, 1981
  • కథ: పంచు అరుణాచలం
  • సంభాషణ: రాజశ్రీ
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను రాజశ్రీ వ్రాయగా, వాటికి ఇళయరాజా బాణీలు కట్టాడు.[2]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట పాడిన వారు
1 కమ్మని కన్నె మనసు రమ్మనేనో నీ మనసే పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 మానవజీవితమే దేవుని చదరంగం పి.సుశీల బృందం
3 వేదనే వేరని అనుబంధమే తీరిపోతే తెలిసే ఈ లోకం పోకడ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు[మార్చు]

  1. web master. "O Inti Katha". indiancine.ma. Retrieved 26 October 2020.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఓ ఇంటి కధ - 1981 (డబ్బింగ్ )". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 26 October 2020.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_ఇంటి_కథ&oldid=3829972" నుండి వెలికితీశారు