Jump to content

ఓ భామ అయ్యో రామ

వికీపీడియా నుండి
ఓ భామ అయ్యో రామ
దర్శకత్వంరామ్‌ గోదాల
రచనరామ్‌ గోదాల
దీనిపై ఆధారితం
ఆర్ట్ డైరెక్టర్బ్రహ్మకడలి
నిర్మాత
  • హరీష్‌ నల్లా
  • ప్రదీప్‌ తాళ్లపు రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంమణికందన్
కూర్పుభ‌వీన్ ఎమ్‌.షా
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థలు
  • వి ఆర్ట్స్‌
  • చిత్రలహరి టాకీస్‌
పంపిణీదార్లుమైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీs
2025 జులై 11 (థియేటర్)
2025 ఆగష్టు 1 (ఈటీవీ విన్ ఓటీటీలో)
సినిమా నిడివి
154 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓ భామ అయ్యో రామ 2025లో విడుదలైన రొమాంటిక్‌ కామెడీ సినిమా. వి ఆర్ట్స్‌, చిత్రలహరి టాకీస్‌ బ్యానర్‌పై హరీష్‌ నల్లా, ప్రదీప్‌ తాళ్లపు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రామ్‌ గోదాల దర్శకత్వం వహించాడు. సుహాస్‌, మాళవిక మనోజ్‌, అనితా హస్సానందని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 24న,[1] ట్రైలర్‌ను జులై 5న విడుదల చేయగా,[2] సినిమాను జులై 11న విడుదల చేశారు.[3][4]

ఓ భామ అయ్యో రామ సినిమా ఆగష్టు 1 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

రామ్ (సుహాస్) చిన్నతనంలోనే తల్లిని (అనిత) కోల్పోతాడు. తండ్రి (రవీంద్ర విజయ్) దగ్గరకు తీసుకోకపోవడంతో, అతని మేనమామ (అలీ) రామ్ బాధ్యతను స్వీకరించి, అతనికి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. రామ్ (సుహాస్) దర్శకుడు కావాలనేది అతని తల్లి కల. కానీ రామ్‌ సినిమాలకు దూరంగా చదువుల కోసం ఫారెన్‌ వెళ్ళాలనుకుంటాడు. ఈ క్రమంలో సత్యభామ (మాళవిక మనోజ్‌) రాకతో రామ్ జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తెచ్చింది. సినిమాలకు దూరంగా ఉండే రామ్ డైరెక్ష‌న్ వైపు ఎందుకు అడుగులు వేశాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ గ‌డ‌గోని, ప్రదీప్ తల్లపురెడ్డి
  • కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌: అశ్వంత్ & ప్రతిభ
  • ప్రొడక్షన్ మేనేజర్: సంతోష్ గౌడ్
  • పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ భామా అయ్యో రామా[9]"శ్రీ హర్ష ఈమానిశరత్ సంతోష్3:31
2."రామచంద్రుడే[10]"శ్రీ హర్ష ఈమని, పార్ధు సన్నిధిరాజుటిప్పు, హరిణి5:06
3."గల్లీ స్టెప్"కాసర్ల శ్యామ్సుహాస్2:58
4."అమ్మ పాట"బాలాజీప్రణవి3:11
5."నా చెలివే"ఎం. వెంకట్ కళ్యాణ్కార్తీక్4:50
6."సజ్ని రే"గోసాల రాంబాబుశరత్ సంతోష్5:56
మొత్తం నిడివి:25:32

మూలాలు

[మార్చు]
  1. "ఇదేం బొమ్మరిల్లు సినిమా కాదు రక్త చరిత్ర... అమ్మాయిలను నమ్మొద్దు బాబోయ్". ABP Desham. 24 March 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  2. "బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ' ఓ భామ అయ్యో రామ' ట్రైల‌ర్‌ విడుదల". NT News. 5 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  3. "జూలై 11న థియేట‌ర్ల‌లోకి.. సుహాస్‌ ఓ భామ అయ్యో రామ". Chitrajyothy. 17 June 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  4. "రివ్యూ: ఓ భామ.. అయ్యో రామ.. సుహాస్‌ కొత్త చిత్రం మెప్పించిందా?". Eenadu. 11 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  5. "ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే". Eenadu. 31 July 2025. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.
  6. "'ఓ భామ అయ్యో రామా' మూవీ రివ్యూ". Sakshi. 11 July 2025. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.
  7. "సుహాస్‌తో జోడీ కడుతోన్న 'జో' బ్యూటీ - 'ఓ భామ అయ్యో రామా' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ". ABP Desham. 30 March 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  8. "సుహాస్ ఓ భామ అయ్యో రామ..ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీ ఎంట్రీ". V6 Velugu. 30 March 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  9. "'ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే'". Chitrajyothy. 3 April 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  10. "పెళ్లి సంద‌డి మొద‌లైంది.. 'ఓ భామ అయ్యో రామ' నుంచి 'రామచంద్రుడే' లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌!". NT News. 17 May 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.

బయటి లింకులు

[మార్చు]