Jump to content

కంచరి

వికీపీడియా నుండి

కంచరి బి.సి.బి. గ్రూపులోని కులం. విశ్వబ్రాహ్మణ కులంలోని ఐదు కులవృత్తుల్లో `కంచరి' ఒకటి.

వృత్తి, సామాజిక జీవితం

[మార్చు]

గ్లాసు మొదలు గంగాళం వరకు వీరు తయారు చేస్తారు. ఎన్ని అధునాతన యంత్రాలు వచ్చినా ఈ రోజుకూ కంచరి వృత్తి కొనసాగుతోంది. పూర్వం వీరు తయారు చేసిన వస్తువులకు బాగా గిరాకీ ఉండేది. ఇంట్లోని వంటపాత్రల్లో ఎక్కువ భాగం ఇత్తడి, రాగితో చేసినవే వాడేవారు. అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలు రాకతో వీరి వృత్తి దెబ్బతింది. ఇత్తడి, రాగి బిందెలు అటకెక్కాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే రాగి చెంబులో నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందనేవారు ఉపయోగిస్తున్నారే తప్ప, రాగి, ఇత్తడి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది. వీటిని తోమి శుభ్రం చేయాలంటే పెద్ద చాకిరీ కనుక మహిళలు కూడా వీటిని కొనుక్కునేందుకు మక్కువ చూపట్లేదు. స్టీలు బిందెలు వాడుతున్నారు.

శ్రీకాకుళంలో `బుడితి' అనే గ్రామం కంచర వృత్తికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కనుకనే `బుడితిత్తడి' అని అక్కడి ఇత్తడి వస్తువులకు పేరు. దాదాపు 250 కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ షాపులలో విక్రయిస్తున్న షీల్డులను వీరే సప్ప్లై చేస్తారు. సరికొత్త డిజైన్లతోపాటు ఫినిషింగ్‌ బాగా ఉంటుందనే పేరు వీరి వస్తువులకు ఉంది.

అదే విధంగా వరంగల్‌ జిల్లాలోని `పెంబర్తి' కూడా ఇత్తడి వస్తువులకు ప్రసిద్ధి చెందింది. వీరు తయారు చేసే బిందెలకు ప్రత్యేకత ఉంది. ఎక్కడా జాయింట్‌ కనిపించకపోవటమే ఈ ప్రత్యేకత. ఇత్తడి రేకును హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, రాజమండ్రి వంటి తమకు దగ్గర ఉన్న సెంటర్లలోని మిల్లుల నుంచి తీసుకొచ్చి కావలసిన సైజులో కట్‌ చేసి వస్తువులు తయారు చేస్తారు. ఈ రేకుల్లో కూడా గేజ్‌ ఉంటుంది. కావలసిన మందం ఉన్న గేజ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా వస్తువు మన్నిక ఈ గేజ్‌పై ఆధారపడి ఉంటుంది. బిందెలు తయారు చేయాలంటే మూడు పార్టులుగా తయారు చేసి అతికిస్తారు. కానీ ఎక్కడా అతుకు కనిపించకుండా తమ పనితనాన్ని చూపిస్తారు. మూతి, మధ్య భాగం, కింది భాగాలను విడివిడిగా తయారు చేస్తారు. మధ్య భాగాన్ని డొలక అంటారు. ఈ డొలకకుపై భాగంలో మూతి, కింది భాగంలో అడుగును అతికిస్తారు. ఈ విడిభాగాలను అతకటానికి రవ్వను ఉపయోగిస్తారు. సత్తు, తగరం, ఇత్తడి కలిపి రవ్వను తయారు చేస్తారు. తయారైన ఇత్తడి వస్తువులను `మెట్నా'తో మెరుగుపెట్టి, సల్ఫర్‌తో కడిగి సంగడి (ఫినిషింగ్‌) పట్టి ఆయా వస్తువులను ధగధగమని మెరిపిస్తారు. అయితే రాగి వస్తువుల జాయింట్లు కూడా ఇత్తడి తో చేస్తారు. కనుక రాగిబిందెలు, ఇతర రాగి వస్తువుల తయారీలో ఈ జాయింట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఇత్తడి రేకులపై దేవతా మూర్తుల ప్రతిరూపాయలను చెక్కడం, లతలూ, పూల డిజైన్లతో అలంకరణలు చేస్తారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కంచరి&oldid=2861193" నుండి వెలికితీశారు