కందదేవి ఎస్. అళగిరిస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందదేవి ఎస్. అళగిరిస్వామి
వ్యక్తిగత సమాచారం
జననం(1925-04-21)1925 ఏప్రిల్ 21
కందదేవి, తమిళనాడు
మరణం2000 అక్టోబరు 13(2000-10-13) (వయసు 75)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

కందదేవి ఎస్. అళగిరిస్వామి (1925-2000) కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.[1]

విశేషాలు[మార్చు]

ఇతడు 1925, ఏప్రిల్ 21న తమిళనాడు దేవకోట్టై సమీపంలోని కందదేవి గ్రామంలో సుందరరాజ అయ్యంగార్, అలిమేలు అమ్మాళ్ దంపతులకు జన్మించాడు.[2] ఇతడు తన 11వ యేటినుండి తన తాత శ్రీనివాస అయ్యంగార్, కందదేవి చెల్లం అయ్యంగార్‌ల వద్ద వయోలిన్ నేర్చుకున్నాడు. 1940 నుండి తిరుమకూడలు చౌడయ్య వద్ద శిక్షణ తీసుకున్నాడు. తరువాత కొంతకాలం చెంబై వైద్యనాథ భాగవతార్ వద్ద కూడా శిష్యరికం చేశాడు. ఇతడు తొలి ప్రదర్శన తన గురువు తిరుమకూడలు చౌడయ్య కచేరీలో వాద్య సహకారం అందించడం ద్వారా ప్రారంభించాడు. అరియకుడి రామానుజ అయ్యంగార్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, పి.ఎస్.నారాయణస్వామి, అలత్తూర్ బ్రదర్స్, మదురై మణి అయ్యర్, ఎం.ఎల్.వసంతకుమారి, జి.ఎన్.బాలసుబ్రమణియం మొదలైన అగ్రశ్రేణి కళాకారులకు వాద్య సహకారం అందించాడు. అనేక సోలో కచేరీలు కూడా చేశాడు. ఇతడు భారత దేశంలోని వివిధ ప్రాంతాలను, అమెరికా, బ్రిటన్, సిలోన్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, జపాన్, హాంగ్ కాంగ్ వంటి దేశాలలో పర్యటించి తన సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు.

ఇతనికి 1978లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. కంచి కామకోటి పీఠం ఇతడికి "తంత్రీ నాద విశారద" అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ ఇతనికి "వాద్యరత్న" బిరుదును ప్రదానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1991లో అవార్డును ప్రదానం చేసింది.

ఇతడు 2000, అక్టోబర్ 13వ తేదీన మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. web master. "Kandadevi S. Alagiriswamy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 19 జనవరి 2021. Retrieved 1 April 2021.
  2. web master. "Tribute KANDADEVI S ALAGIRISWAMY". carnatica.in. Srishti's Carnatica Pvt. Ltd. Retrieved 1 April 2021.