కందుల నారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుల నారాయణ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968 ఆగష్టు 5
హనుమంతరాయునిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నారాయణ రెడ్డి, నారాయణమ్మ
జీవిత భాగస్వామి వసంత లక్ష్మి
సంతానం కార్తీక సాయి, విశ్వేశ్వర్ రెడ్డి, భవ్య, నందిని
వృత్తి రాజకీయ నాయకుడు

కందుల నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు పెద్ద కొండారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు పెద్ద కొండారెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

కందుల నారాయణ రెడ్డి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జంకె వెంకట రెడ్డి, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "కలిసి కట్టుగా." Archived from the original on 3 June 2022. Retrieved 3 June 2022.