కంబర్ (కవి)
కంబర్ | |
|---|---|
చెన్నై మెరీనా బీచ్‌లో కంబర్ విగ్రహం | |
| జననం | 1180 తేరిజందూర్ (ప్రస్తుత తమిళనాడు, భారతదేశం) |
| మరణం | 1250 (వయసు: 69–70) నాట్టరసన్‌కోట్టై (ప్రస్తుత తమిళనాడు, భారతదేశం) |
| వృత్తి | కవి |
| భాష | తమిళం |
| ప్రసిద్ధ రచనలుs | కంబ రామాయణం సిలై ఎలుపతు |
కంబర్ లేదా కంబన్ (సా.శ 1180–1250) ఒక భారతీయ కవి. ఆయన హిందూ ఇతిహాసం రామాయణం తమిళ వెర్షన్ అయిన రామవతారం (దీనిని కంబరామాయణంగా పిలుస్తారు) రచయిత. ఆయన తమిళంలో సిలై ఎలుపతు, కంగై పురాణం, సడగోపర్ అంతాతి, సరస్వతి అంతాతి వంటి అనేక ఇతర సాహిత్య రచనలు కూడా చేశారు.
కంబర్ కవితా నైపుణ్యాలను పండితులు విస్తృతంగా ప్రశంసించారు, ఆయనకు కల్వియిల్ పెరియోన్ కంబన్, కవి చక్రవర్తి వంటి బిరుదులు లభించాయి. "కంబన్ వీట్టు కట్టుత్తరియుం కవి పాడుం" అనే ప్రసిద్ధ తమిళ సామెత ఆయన సాహిత్య నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ''కంబ రామాయణం'' తమిళ సాహిత్యంలో గొప్ప ఇతిహాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
జీవితం
[మార్చు]తమిళనాడు లోని ప్రస్తుత మయిలాడుతురై జిల్లా తేరిజందూర్ (తిరువళుందూర్ అని కూడా పిలుస్తారు) లో కంబర్ జన్మించాడు.[1].[2][3] ఆతని తండ్రి పేరు ఆదిత్య.
తిరువెన్నైనల్లూర్ స్థానిక నాయకుడు సదైయప్ప వల్లాళ్ కంబర్‌కు ఆశ్రయం కల్పించాడు.[4] ఆయన మద్దతుకు కృతజ్ఞతగా, రామాయణంలోని ప్రతి 1,000 పద్యాలలో కంబర్ ఒకసారి సదైయప్ప వల్లాళ్ పేరును ప్రస్తావించాడని చెబుతారు. పురాణాల ప్రకారం కంబర్ తరువాత చోళ రాజు మూడవ కులోత్తుంగ చోళ ఆస్థానంలో పనిచేశాడు, అతను కంబర్‌కు ''కంబ నాడు'' అనే భూభాగాన్ని, ''కవి చక్రవర్తి'' అనే బిరుదును ప్రసాదించాడు..[5][full citation needed] కంబన్‌కు తమిళ, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం ఉండేది. వైష్ణవ తత్వవేత్త రామానుజుల గురించి కవి తన రచనలో ప్రస్తావించినందున, కంబన్ సా.శ 12వ శతాబ్దం నాటివాడని భావిస్తారు.[6]
ఆయన తదనంతర జీవితం గురించి స్పష్టమైన సమాచారం లేదు, జానపద కథల్లో దీని గురించి పలు కథలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం, కంబన్ తన చివరి రోజులను ప్రస్తుత శివగంగై సమీపంలోని నాట్టరసన్‌కోట్టైలో గడిపాడు. కులోత్తుంగుని కుమారుడైన మూడవ రాజరాజుతో విభేదాల తర్వాత ఆయన చోళ రాజ్యాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. నాట్టరసన్‌కోట్టైకి చేరుకున్నప్పుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని తన చివరి రోజులను గడిపాడు. ఆ ప్రదేశంలో ఆయనకు అంకితం చేసిన సమాధి ఉంది, కంబర్‌ను సత్కరించడానికి ఈ ప్రదేశంలో వార్షిక కంబన్ విజా నిర్వహిస్తారు.[citation needed]
మరొక కథనం ప్రకారం, అపార్థం కారణంగా కులోత్తుంగుడు కంబన్‌ను బహిష్కరించాడు. తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడిపినందుకు కులోత్తుంగుడు కంబన్ కుమారుడైన అంబిగపతికి మరణశిక్ష విధించాడు. కులోత్తుంగుని క్రూరత్వానికి ఆగ్రహంతో, దుఃఖంతో కంబన్ తమిళ ప్రాంతాలలో సంచరిస్తూ చివరకు చేర రాజవంశం సేవలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత చోళ పాలకుడు ఆహ్వానించినప్పుడు ఆయన తిరిగి వచ్చాడు, కానీ ఈ నూతన స్నేహం ఎంతో కాలం నిలవలేదు, ఉద్రిక్తతలు మళ్ళీ తలెత్తాయి. కంబన్ చేర రాజుతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే, చిన్న యువరాజును హత్య చేశాడనే నెపంతో కులోత్తుంగుడు చివరకు ఆయనకు మరణశిక్ష విధించాడు. కంబన్ చనిపోయే ముందు రాజును శపించాడు, అతని వంశం అంతమవుతుందని ప్రకటించాడు.[7]
సాహిత్య రచనలు
[మార్చు]
- కంబ రామాయణం (రామవతారం అని కూడా పిలుస్తారు), ఇది భారతీయ ఇతిహాసం రామాయణం తమిళ పునర్ కథనం. ఇందులో 11,000 పద్యాలు ఉన్నాయి.[8][full citation needed][9] నాథముని సమక్షంలో దీనిని పవిత్ర స్థలాల్లో ఆమోదించారు.[10][full citation needed]
- సరస్వతి అంతాతి, హిందూ దేవత సరస్వతిని కీర్తిస్తూ రాసిన అంతాతి శైలి సాహిత్య రచన
- సడగోపర్ అంతాతి, వైష్ణవ సన్యాసి నమ్మాళ్వార్ ను కీర్తిస్తూ రాసిన అంతాతి
- సిలై ఎలుపతు, సా.శ 11వ శతాబ్దపు పల్లవ రాజు కరుణాకర తొండైమాన్‌ను ప్రశంసిస్తూ రాసిన రచన
- తిరుక్కై వలక్కం
- ఎరెలుపాతు
- కంగై పురాణం
- మంగళ వాళ్తు
కంబ రామాయణం
[మార్చు]వాల్మీకి సంస్కృత మూలం ఆధారంగా రూపొందించినప్పటికీ, కంబ రామాయణం కేవలం అనువాదం మాత్రమే కాదు. కథను తమిళ విలువల, సౌందర్యానికి అనుగుణంగా మార్చడానికి కంబర్ గణనీయమైన సాంస్కృతిక, కథా మార్పులను ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు, కంబర్ వెర్షన్‌లో కుంభకర్ణుడు, రావణుడు వంటి పాత్రల వర్ణన ఎంతో లోతుగా, సూక్ష్మంగా ఇవ్వబడింది.
ప్రజాదరణ పొందిన సంస్కృతిలో
[మార్చు]
1937లో వచ్చిన తమిళ సినిమా అంబికాపతిలో కంబన్ పాత్రలో సెరుకలతుర్ సామా నటించాడు. 1957లో వచ్చిన అంబికాపతి సినిమాలో, ఎం. కె. రాధా కంబన్ పాత్రలో నటించాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- కంబర్మేడు, కంబన్తో సంబంధం ఉన్న పురావస్తు ప్రదేశం
మూలాలు
[మార్చు]- ↑ "Kavi Chakravarti Kambar". Tamil Virtual University.
- ↑ Ramaswamy, Vijaya (2017-08-25). Historical Dictionary of the Tamils (in ఇంగ్లీష్). Bloomsbury Publishing USA. p. 183. ISBN 979-8-216-20821-1.
- ↑ "Kambar ( Kavi Chakravarthy )- Profile and Life History of a Tamil Poet". Aptinfo.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-22. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-17.
- ↑ India's Communities by Kumar Suresh Singh, Anthropological Survey of India – Ethnology – 1992 – page 4146
- ↑ The Cyclopaedia of India and of Eastern and Southern Asia By Edward Balfour
- ↑ Robert Caldwell (1875). A Comparative Grammar of the Dravidian Or South-Indian Family of Languages. Trübner, 1875. p. 136.
- ↑ Raja, P. (2022). A Treasury of ancient Tamil legends. Delhi: National Book Trust. pp. 127–143. ISBN 978-93-5491-025-8.
- ↑ Legend of Ram By Sanujit Ghose
- ↑ Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 212.
- ↑ Rays and Ways of Indian Culture By D. P. Dubey