కంభంపాటి సత్యనారాయణ
స్వరూపం
కంభంపాటి సత్యనారాయణ (1909-1983) స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు రచయిత, చరిత్రకారుడు.[1] తొండవరం గ్రామంలో 1909, జులై 17న జన్మించి, మద్రాసు లయోలా కళాశాలలో విద్యనభ్యసించాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వెల్లూరు జైలులో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ఎన్నో పుస్తకాల రచనలు, అనువాదాలు చేసాడు, విశాలాంధ్ర, ప్రజాశక్తి దినపత్రికల సంపాదకీయ సభ్యుడు.
రచనలు
[మార్చు]- కమ్యూనిస్టు ప్రణాళిక - తెలుగు అనువాదం
- నిర్మాణ సమస్యలు - తెలుగు అనువాదం, 1945
- తత్వశాస్త్రం అంటే ఏమిటి - 1941
- ఆంధ్రుల సంస్కృతి చరిత్ర (ఆంగ్లం)[2]
- మహాత్ముడు ఆయన సిద్ధాంతాలు
- నేటి సోవియట్ యూనియన్ - 1944
- ప్రజ్ఞా ప్రభాకరము - 1950
- నవచైనా వ్యవసాయ సంస్కరణ(చట్టం-వర్గీకరణ) - 1953
- భారతదేశం - రష్యా ఉద్యమం - 1967
మూలాలు
[మార్చు]- ↑ Jammi, Ramarao (2023-05-30). "Amrit Mahotsav".
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ Trust, Hyderabad Book (2008-10-13). "Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర ... రెండు భాగాలు ... రచన : కంభంపాటి సత్యనారాయణరావు ... తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామమోహనరావు". Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్. Retrieved 2025-03-03.