కంభంపాటి హరిబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంభంపాటి హరిబాబు

పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మే 2014
నియోజకవర్గము విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953 జూన్ 15 (age 64)
తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జయశ్రీ
నివాసము విశాఖపట్నం
పూర్వ విద్యార్థి ఆంధ్రవిశ్వవిద్యాలయం
మతం హిందూ
వెబ్‌సైటు KambhampatiHariBabu.in

కంభంపాటి హరిబాబు భారతీయ జనతాపార్టీ రాజకీయ నాయకుడు. అతడు భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1] అతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రశాఖ అధ్యక్షునిగా ఉన్నాడు.[2]

ప్రారంభ జీవితం[మార్చు]

హరిబాబు ప్రకాశం జిల్లా లోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించాడు. అతడు విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బి.టెక్ చేసాడు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసాడు. తరువాత ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి 1993 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు. తరువాత క్రియాశీల రాజకీయాలలోనికి ప్రవేశించాడు.[3][4]

రాజకీయ జీవితం[మార్చు]

హరిబాబు ఆంధ్ర రాష్ట్రం కోసం జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమంలో అతడు తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు గార్లతోకలసి విద్యార్థినాయకునిగా పాల్గొన్నాడు. అతడు 1972-73 మధ్య కాలంలో ఆంధ్రవిద్యాలయం లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల యూనియన్ కు సెక్రటరీగా ఉన్నాడు. 1974-75 కాలంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అధ్వర్యలో జరిగిన లోక్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంలో అరెస్టు కాబడ్డాడు. విశాఖపట్నం సెంట్రల్ జైలు, ముషీరాబాదు జైలు లలో 6 నెలలు శిక్ష అనుభవించా\దు. అతడు 1977 లో జనతాపార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా తన సేవలనందించాడు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసాడు.[5]

1991-1993 కాలంలో హరిబాబు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేసాడు. తరువాత 1993-2003 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగాడు.

1999లో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. 2003 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ ప్లోర్ లీడర్ గా కొనసాగాడు. మార్చి 2014 లో బి.జె.పి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.[5]

అభివృద్ధి పనులు[మార్చు]

హరిబాబు ఎం.పి.లాడ్స్ నిధులనుపయోగించి ఆరోగ్యం, విద్య, త్రాగునీరు ల కొరకు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేసాడు.[6] దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాలకు, ఎంపి నిధులను పారదర్శకతతోఖర్చు చేసాడు.[7] ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు, ఫర్నిచర్ అందించడం, జి.వి.ఎం.సి అద్వర్యంలో లేని ప్రాంతాలలో త్రాగునీరు అందించడం ముఖ్యమైనవి.[8]

అతడు ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, "ఒన్ ఎం.పి- ఒన్-ఐడియా" కాంటెస్టును నిర్వహించాడు.[9]

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". Retrieved 17 May 2014. CS1 maint: discouraged parameter (link)
  2. http://www.bjp.org/organisation/state-units
  3. http://timesofindia.indiatimes.com/home/lok-sabha-elections-2014/news/Vizags-non-local-localite/articleshow/34016778.cms
  4. http://timesofindia.indiatimes.com/home/lok-sabha-elections-2014/news/Election-Results-Professor-teaches-a-political-lesson-to-Vijayamma/articleshow/35224165.cms?intenttarget=no
  5. 5.0 5.1 http://www.kambhampatiharibabu.in/index.html
  6. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/haribabu-spells-out-thrust-areas-for-lad-funds/article7568689.ece
  7. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/move-to-bring-transparency-in-mplads-spending/article6258321.ece
  8. https://grin.news/in-south-india-a-little-furniture-toilets-makes-all-the-difference-in-schools-ea458c43c71c#.wn3q7wmu0
  9. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/an-idea-can-win-you-a-cash-prize/article6670215.ece