కంభం చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చారిత్రక కంభం చెరువు 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు కట్టించినారని భావిస్తారు. ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చెరువు, ఆసియా ఖండంలో రెండవది.గుండ్లకమ్మ మరియు జంపాలేరు నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి మరియు పసుపు, చెరుకు,అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ చెరువు యొక్క ఏకైక ఆధారము. ఈ చెరువు యొక్క ఆయకట్టు కంభం మరియు బెస్తవారిపేట మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల రైతులకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996 మరియు 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.