కచోరి
రాజ్ కచోరి | |
| ఇతర పేర్లు | కచోడి, కచూరి, కచూరి, కచౌరి[1] |
|---|---|
| Course | చిరుతిండి |
| మూల స్థానం | |
| రాష్ట్రం | రాజస్థాన్[2] |
| Associated cuisine | భారతీయ వంటలు, నేపాలీ వంటలు, బంగ్లాదేశీ వంటలు, పాకిస్తానీ వంటలు, ట్రిమ్నిడాడ్ అండ్ టొబాగో వంటలు |
| వడ్డించే ఉష్టోగ్రత | వేడిగా, చల్లగా |
| ప్రధాన అనుఘటకాలు | మైదా పిండి, శనగ పిండి, నెయ్యి |
| Ingredients generally used | పెసర పప్పు, ఉల్లిపాయలు |
| Variations | ఉల్లి కచోరి, కోటా కచోరి, రాజ్ కచోరి, మావా కచోరి, దహీ ఖీరే కీ కచోరి[3] |
కచోరి రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన, నూనెలో బాగా వేయించిన, కారంగా ఉండే, లోపల కూరతో నింపిన ఒక రకమైన పేస్ట్రీ లేదా రొట్టె.[4][5][6] దీనికి కచోడి, కచూరి, కచూరి లేదా కచౌరి అనే రూపాంతరాలున్నాయి. దీనిని మైదా పిండితో తయారు చేస్తారు. పెసరపప్పు లేదా ఉల్లిపాయలు (సాధారణంగా, రకాన్ని బట్టి), శనగపిండి, కొత్తిమీర, కారం, ఉప్పు, ఇతర భారతీయ మసాలాల మిశ్రమాన్ని కలిపి వేయించి, బంగారు గోధుమ రంగులోకి మారి కరకరలాడే వరకు కూరగాయల నూనెలో బాగా వేయిస్తారు.[7] దీనిని బంగాళాదుంప కూరతో వడ్డిస్తారు. కొన్నిసార్లు వేడివేడిగా తీపి, కారంగా ఉండే చింతపండు చట్నీతో లేదా అప్పుడప్పుడు పుదీనా, పచ్చిమిర్చి చట్నీతో వడ్డిస్తారు. [8]
భారతదేశంలో పుట్టిన కచోరీలు దక్షిణాసియా అంతటా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ప్రాంతం తమదైన స్థానిక వైవిధ్యాలను జోడిస్తోంది.
చరిత్ర
[మార్చు]కచోరీ రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతం నుండి ఉద్భవించింది.[9] కచోరీ తయారీలో కొత్తిమీర, సోంపు వంటి తేలికపాటి మసాలా దినుసుల వాడకం ఆ ప్రాంతపు వాతావరణ పరిస్థితులకు ప్రతిబింబంగా భావిస్తారు. ఇది పొడి, వేడి వాతావరణానికి బాగా సరిపోతుంది. [10] కాలక్రమేణా, కచోరీ సౌకర్యవంతమైన ప్రయాణ చిరుతిండిగా ప్రజాదరణ పొందింది.[11]
కచోరీని పోలిన ఒక ప్రాచీన వంటకం సుశ్రుత సంహితలో కనిపిస్తుంది, దీని ప్రకారం పిండి, నెయ్యి, బెల్లంతో చేసిన, మసాలా పెసరపప్పు లేదా కీమాతో కూరిన, నూనెలో బాగా వేయించిన ఒక రకమైన వంటకం గురించి ప్రస్తావించబడింది. పప్పులతో కూరిన, ఉబ్బిన, నూనెలో బాగా వేయించిన 'కచ్చారి' అనే వంటకం గురించి 7వ శతాబ్దానికి చెందిన ఒక జైన గ్రంథంలో ప్రస్తావించబడింది. ఇలాంటి వంటకాల గురించి మధ్యయుగపు వంటల పుస్తకమైన శుప శాస్త్రంలో కూడా ప్రస్తావించబడింది.
జీవితచరిత్ర గ్రంథమైన అర్ధకథానక రచయిత బనారసీదాస్, 1613 లో తాను ఇండోర్‌లో కచోరీలు కొన్నట్లు రాసాడు. ఏడు నెలల పాటు, అతను ప్రతిరోజూ ఒక శేరు కచోరీలు కొని, ఇరవై రూపాయలు బాకీ పడ్డానని రాసాడు.
వైవిధ్యాలు
[మార్చు]కూరను బట్టి వివిధ రకాల కచోరీలు:
- ప్యాజ్ కచోరి : ప్యాజ్ కచోరి లేదా కందా కచోరి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉద్భవించింది. దాని పేరు సూచించినట్లుగా, ఇది మసాలా ఉల్లిపాయలు తో నింపబడి ఉంటుంది. [12]
- రాజ్ కచోరీ: రాజస్థాన్‌లోని బికనీర్ నగరంలో [13] పుట్టిన రాజ్ కచోరీలు ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. "రాజ్" అనేది కచోరీలోని రుచికరమైన కూరను సూచిస్తుంది. దీనిపై సాధారణంగా పెరుగు, మసాలాలు, కొత్తిమీర చట్నీ, తీపి చింతపండు చట్నీ, సేవ్, దానిమ్మ గింజలతో అలంకరిస్తారు. [14] [15]

- కోటా కచోరీ: రాజస్థాన్‌లోని కోటా నగరంలో పుట్టిన కచోరీ ఇది. విలక్షణమైన ఇంగువ వాసనతో కూడిన కారమైన రుచికి ఇవి ప్రసిద్ధి చెందాయి. కోటా కచోరీ లోపలి పూరకం జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర వంటి మసాలాలు, మూలికల మిశ్రమంతో వండిన పసుపు పెసరపప్పుతో (పసుపు పప్పు) దీన్ని తయారు చేస్తారు. [16] [17]
- మావా కచోరి : ఈ రకం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉద్భవించింది. దీనిలో డ్రై ఫ్రూట్స్, ఖోవాను కూరగా నింపి, తరువాత చక్కెర పాకంలో ముంచుతారు. [18] [19]
- మహారాష్ట్రలో షెగావ్ కచోరి ప్రసిద్ధి చెందింది.
- గుజరాత్లో, ఇది సాధారణంగా పిండి, పిసకతో చేసిన గుండ్రని ఉండ. దీనిలో పసుపు పెసరపప్పు, నల్ల మిరియాలు, కారం పొడి, అల్లం పేస్ట్‌తో చేసిన కూరను నింపుతారు.
మరొక రకం - వేయించి, పప్పుధాన్యాలతో (ముఖ్యంగా మినప, పెసలు) కూరిపెట్టి తయారుచేస్తారు, ఇది సాధారణంగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో కనిపిస్తుంది.
భోజ్‌పురి ప్రాంతంలో, కచోరీని సాధారణంగా మైదాతో కాకుండా గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇది పూరీని పోలి ఉంటుంది, కానీ పూరీలో లేని విభిన్నమైన రుచి, కరకరలాడే గుణం దీనికి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇది ఒక ప్రసిద్ధ అల్పాహారం. వారణాసిలో అల్పాహారంగా కచోరీ-తర్కారీని అమ్మే ప్రసిద్ధ దుకాణాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో కచోరీ మృదువుగా, చిన్నగా ఉంటుంది. దీనిని ఎక్కువగా మైదా పిండి, రుచిని మెరుగుపరచడానికి ఇంగువతో తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా ఉదయం లేదా సాయంత్రం టీ-టైమ్ స్నాక్‌గా తింటారు. తరచుగా దీనితో పాటు బంగాళదుంప, బఠానీ కూర, బెంగాలీ స్వీట్లను తీసుకుంటారు. అలాగే, బఠానీలతో కూరిన కచోరీ (కొరైషుటి కోచురి) బెంగాల్‌లో శీతాకాలపు ప్రత్యేక వంటకం. బెంగాల్‌లో ఎక్కువగా స్వీట్ షాపులలో లభించే మరో రకం 'ఖస్తా కోచురి', ఇది (ఢిల్లీలో లాగా) లోపల మసాలాతో గట్టిగా ఉంటుంది. సాధారణంగా, ఖస్తా కోచురి రకంతో పాటు కూర ఉండదు.
ఉత్తర భారతదేశంలోని కొన్ని రకాలలో, రాజస్థానీ వంటకాన్ని పోలిన ఒక రకం ఉంటుంది, దీనితో పాటు బంగాళాదుంపలు, వివిధ మసాలాలతో చేసిన కూర లేదా చోలే భటూరేలో వడ్డించేటువంటి శనగలు వడ్డిస్తారు.
గ్యాలరీ
[మార్చు]- చింతపండు చట్నీతో ప్యాజ్ కచోరీ
- హల్దీరామ్ రాజ్ కచోరి
- మూంగ్‌దాల్ కచోరీలు
- రాజ్ కచోరి విత్ సేవ్
- కోల్‌కతాలో బెంగాలీ కచోరీలు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sen, Colleen Taylor; Bhattacharyya, Sourish; Saberi, Helen (2023-02-23). The Bloomsbury Handbook of Indian Cuisine (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 978-1-350-12865-1.
- ↑ "Mogar Kachori". recipes.timesofindia.com. 2018-03-06. Retrieved 2024-04-29.
it is believed that kachori was created by the Marwaris, in the heart of Marwar
- ↑ The Telegraph – Calcutta (Kolkata) | Opinion | Diary. Telegraphindia.com (2009-03-29). Retrieved on 2012-05-19.
- ↑ Awal, Vernika (2023-06-22). "A tale of the humble kachori". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-29.
It is believed that the Marwadi community can be credited for inventing kachori
- ↑ "Mogar Kachori". recipes.timesofindia.com. 2018-03-06. Retrieved 2024-04-29.
it is believed that kachori was created by the Marwaris, in the heart of Marwar
- ↑ Sen, Colleen Taylor; Bhattacharyya, Sourish; Saberi, Helen (2023-02-23). The Bloomsbury Handbook of Indian Cuisine (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 978-1-350-12865-1.
- ↑ "Interesting facts about Kachori that will leave you surprised". recipes.timesofindia.com. 2018-03-06. Retrieved 2024-05-07.
- ↑ Bhatia, Divya (2014-03-20). My Vegetarian Journey (in ఇంగ్లీష్). Partridge Publishing. ISBN 978-1-4828-1953-3.
- ↑ "History Of Varanasi's Kachori Sabzi And 5 Places You Should Try". Times Now (in ఇంగ్లీష్). 2024-02-18. Retrieved 2024-05-01.
- ↑ "Interesting facts about Kachori that will leave you surprised". recipes.timesofindia.com. 2018-03-06. Retrieved 2024-05-01.
- ↑ Awal, Vernika (2023-06-22). "A tale of the humble kachori". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-05-01.
- ↑ Limited, Foodity (P) (2024-02-23). Beyond Brick and Mortar: Unveiling the Soul of India's Street Food (in ఇంగ్లీష్). Notion Press. ISBN 979-8-89277-770-4.
{{cite book}}:|last=has generic name (help) - ↑ "Interesting facts about Kachori that will leave you surprised". recipes.timesofindia.com. 2018-03-06. Retrieved 2024-04-30.
- ↑ World, Eat Your; Siciliano-Rosen, Laura (2014-01-13). Delhi Food and Travel Guide: The inside scoop on the best North Indian foods in Delhi (in ఇంగ్లీష్). Eat Your World.
- ↑ Chauhan, Maneet; Eddy, Jody (2020-10-06). Chaat: Recipes from the Kitchens, Markets, and Railways of India: A Cookbook (in ఇంగ్లీష్). Clarkson Potter/Ten Speed. ISBN 978-1-9848-2389-2.
- ↑ Sen, Colleen Taylor; Bhattacharyya, Sourish; Saberi, Helen (2023-02-23). The Bloomsbury Handbook of Indian Cuisine (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 978-1-350-12865-1.
- ↑ Meena, R. P. Rajasthan Current Affairs Yearbook 2021 for Competitive Exams Preparation (in ఇంగ్లీష్). MYUPSC.
- ↑ Tripathi, Vaishali (2016-08-09). Indian desi tadka (in ఇంగ్లీష్). Onlinegatha. ISBN 978-93-85818-00-4.
- ↑ Guides, Rough (2010-10-01). RGT to Rajasthan, Delhi & Agra (in ఇంగ్లీష్). Rough Guides UK. ISBN 978-1-4053-8682-1.