కఛ్వాహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

The Pachrang flag of the former Jaipur state. Prior to the adoption of the Pachrang (five coloured) flag by Raja Man Singh I of Amber, the original flag of the Kachwahas was known as the "Jharshahi (tree-marked) flag".

భారతదేశంలోని కుష్వాహా కులంలో కఛ్వాహ ఒక ఉప కులం. సాంప్రదాయకంగా వారు వ్యవసాయంలో పాలుపంచుకునే రైతులుగా ఉన్నప్పటికీ 20 వ శతాబ్దం నుండి వారు రాజపుత్ర వంశం అని చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ కులంలోని కొన్ని కుటుంబాలు అల్వారు, అంబరు (తరువాత జైపూరు), మైహారు వంటి అనేక రాజ్యాలను, రాచరిక ప్రాంతాలను పాలించాయి.

కఛ్వాహను కొన్నిసార్లు కుష్వాహా అని అంటారు. ఈ పదాన్ని ఒకే రకమైన వృత్తిపరమైన నేపథ్యాలు కలిగిన కనీసం నాలుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహించేప్రజలకు వర్తింపజేస్తారు. వీరందరికీ పౌరాణిక సూర్యవంశ రాజవంశానికి చెందిన సీతా రాముల కవల కుమారులలో ఒకరైన కుశుడు మూలపురుషుడుగా ఉన్నాడని వారు భావిస్తున్నారు. ఇంతకు ముందు వారు శివుడిని, శక్తిని పూజించేవారు.

పూర్వీకులు[మార్చు]

కఛ్వాహలో ఒక భాగమైన ఆధునిక-కాలపు కుష్వాహా సంఘానికి సాధారణంగా విష్ణువుదశావతారాలలో ఒకరైన రాముడి కుమారుడు కుశుడు మూలం అని పేర్కొంటున్నారు. ఇది వారు సూర్యవంశానికి చెందిన రాజవంశానికి చెందిన వారన్న వారి వాదనను అనుమతిస్తుంది. అయితే ఇది ఇరవయ్యవ శతాబ్దంలో అభివృద్ధి చెందిన పురాణం మూలంగా ఉందని భావించబడుతుంది. ఆ సమయానికి ముందున్న కుష్వాహా సమాజంలో కఛ్వాహలు, కాచిలు, కోరిలు, మురాలు చెందిన ప్రజలు శివ, శక్తితో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నాయి.[1]

1920 లలో గంగా ప్రసాదు గుప్తా కుష్వా కుటుంబాలు హనుమంతుడిని ఆరాధించారని సూచించాడు.[2]

పాలకులు[మార్చు]

ఒక కఛ్వాహ కుటుంబం అంబరును పాలించింది. తరువాత ఇది జైపూర్ రాజ్యంగా పిలువబడింది. ఈ శాఖను కొన్నిసార్లు రాజపుత్ర అని అంటారు. అంబరు అధిపతులుగా వారు 1561 లో మొఘలు చక్రవర్తి అక్బరు మద్దతు కోరారు. అప్పటి అధిపతి భారమలును కఛ్వాహను రాజాగా గుర్తించారు. కొత్త కూటమిని పటిష్టం చేసినందుకు కఛ్వాహ పాలకుడు తన కుమార్తెను అక్బరుకు ఇచ్చి వివాహం చేసాడు. భారమలు భూభాగాన్ని పర్యవేక్షించడానికి ఒక ప్రతినిధి నియమించబడ్డాడు. కప్పం చెల్లిచడంలో భారమలుకు వేతనం చెల్లింపు అమలులో ఉండేది. ఈ విధానం ఆధారంగా ప్రాంతం ఆదాయంలో కొంత భాగం భారమలుకు వేతనంగా చెల్లించారు. [3][4]

వర్గీకరణ[మార్చు]

సాంప్రదాయపరంగా కుష్వాహా ఒక రైతు సమాజం. వీరు శూద్ర వర్ణాలలో ఒకదానికి చెందినవారిగా పరిగణించబడ్డారు.[5] పించు వారిని "నైపుణ్యం కలిగిన వ్యవసాయవేత్తలు" గా అభివర్ణిస్తుంది.[6] బ్రిటీషు రాజు పాలన తరువాతి దశాబ్దాలలో శూద్ర సంప్రదాయక హోదా అధికంగా సవాలు చేయబడినప్పటికీ అయినప్పటికీ బ్రిటీషు పరిపాలన మొదటి జనాభా గణనను ప్రారంభించడానికి ముందే వివిధ కులాలు ఉన్నత హోదాను పొందాయి. [lower-alpha 1]" ఇరవయ్యో శతాబ్దం మొదటి నాలుగు దశాబ్దాలలో వ్యక్తిగత గౌరవం, సమాజ గుర్తింపు, కుల స్థితి కొరకు కుర్మి, యాదవు, కుష్వాహా రైతుల మధ్య జరిగిన ఆందోళన గరిష్ట స్థాయికి చేరుకుంది."[8]

రైతులు నల్లమందు గసగసాల సాగులో అభిమానం చూపించిన ఫలితంగా వీరు మునుపటి శతాబ్దంలో చాలా వరకు బ్రిటిషు వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 1910 నుండి కాచీలు, కోయిరిలు, తమను కుష్వాహా క్షత్రియులుగా పేర్కొనడం ప్రారంభించారు.[9] ఆ రెండు సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్న ఒక సంస్థకు చెందిన మురాలు (1928 లో) క్షత్రియ వర్ణంగా అధికారిక గుర్తింపు కోరుతూ అభ్యర్ధన చేసారు. అఖిల భారత కుష్వాహా క్షత్రియ మహాసభ సాంప్రదాయకంగా వర్గీకరించబడిన క్షత్రియసమాజాల సామాజిక అభ్యున్నతి కొరకు కృషి చేస్తుంది. ఎం.ఎన్. శ్రీనివాసు ఈ ప్రక్రియను సంస్కృతీకరణ అని పేర్కొన్నాడు.[10] పంతొమ్మిదవ చివర, ఇరవై శతాబ్ధపు కలరాజకీయాలకు ఇది ప్రతీకగా కనిపించింది. [11][12]

ఐ.కె.కె.ఎం. సంస్థ వైష్ణవిజం అనే భావన మీద ఆధారపడి రూపొందించబడింది. క్షత్రియ వాదంలో శారీరక శ్రమ అంతర్లీనంగా ఉన్నప్పటికీ జంధ్యం ధరించే విధానం అనుసరిస్తూ రాముడు, కృష్ణుడి ఆరాధనను ప్రోత్సహించింది. సాగు వృత్తులలో ఉన్న వారిని శూద్ర అని అంతర్గతంగా వర్గీకరించారు. ఈ ఉద్యమం ద్వారా వారు రాముడి వారసులమని పేర్కొన్న ఊహాత్కక పురాణానికి అనుకూలంగా ఉంటూ శివుడి నుండి ఉద్భవించారన్న వారి పూర్వీకుల వాదనలను వదిలివేసారు.[13] 1921 లో కుష్వాహా సంస్కరణను ప్రతిపాదించిన గంగా ప్రసాదు గుప్తా కోయిరి, కచ్చి, మురావు, కఛ్వాహ ప్రజల క్షత్రియ హోదాకు రుజువునిచ్చే పుస్తకాన్ని ప్రచురించాడు.[6][14]ఆయన పునర్నిర్మించిన చరిత్ర ఆధారంగా కుష్వాహా ప్రజల హిందూ వారసత్వ వివరణలు వివాదించబడ్డాయి. పన్నెండవ శతాబ్దంలో కుష్వాహా, ఢిల్లీ సుల్తానేటు ముస్లిం సప్రదాయాల ఏకీకరణ కాలంలో రాజా జైచందు తన సైనిక సామర్థ్యంతో మొఘలులకు సేవలందించారని వాదించారు. ముస్లింల హింస కొనసాగిన తరువాత కుష్వాహా క్షత్రియులుగా వారి గుర్తింపు చెదరగొట్టబడడానికి దారితీసింది. ఫలితంగా జంధ్యధారణ విడిచి దిగువస్థాయిని స్వీకరించి వివిధ స్థానిక జాతులహోదాను స్వీకరించారు.[6] క్షత్రియ హోదాను నిరూపించడానికి గుప్తా చేసిన ప్రయత్నం వివిధ కులాల చరిత్రలను స్థాపించడానికి, ఇతరులు చేసిన ప్రయత్నాలతో కలిసి కుల సంఘాలుగా విస్తరించడానికి దారితీసింది. దీపాంకరు గుప్తా పరిశోధక రచన "పట్టణీకరణ, రాజకీయంగా అక్షరాస్యులైన ఉన్నతవర్గం", "తక్కువ అక్షరాస్యులు" గ్రామస్తులు " మధ్య ఉన్న సంబంధాలను వివరించింది. [15] కొన్ని సంఘాలు ఈ వాదనలకు మద్దతుగా దేవాలయాలను కూడా నిర్మించాయి. ఇందుకు అయోధ్యలో మురాలు చేసినది ఉదాహరణగా ఉంది.[2]

కుర్మి సంస్కర్త దేవి ప్రసాదు సిన్హా చౌదరి ధారావాహికలో బ్రాహ్మణులు, క్షత్రియ రాజపుత్రులు, భూమిహారులుగా కొన్ని ప్రాంతాలలో క్షేత్రాలలో పనిచేసిన రైతులు ఒక సమాజానికి చెందినవారుగా గుర్తించబడ్డారనే వాదనల బలపరుస్తూ చిత్రించబడింది. అలాగే వారు శూద్రులు అనేదానికి హేతుబద్ధమైన ఆధారం లేదని వాదించబడింది.[16]

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

Notes

  1. William Pinch records that, "... a popular concern with status predated the rise of an imperial census apparatus and the colonial obsession with caste. ... [C]laims to personal and community dignity appeared to be part of a longer discourse that did not require European political and administrative structures."[7]

Citations

  1. Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. pp. 12, 91–92. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  2. 2.0 2.1 Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. p. 98. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  3. Wadley, Susan Snow (2004). Raja Nal and the Goddess: The North Indian Epic Dhola in Performance. Indiana University Press. pp. 110–111. ISBN 9780253217240.
  4. Sadasivan, Balaji (2011). The Dancing Girl: A History of Early India. Institute of Southeast Asian Studies. pp. 233–234. ISBN 9789814311670.
  5. Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. p. 81. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  6. 6.0 6.1 6.2 Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. p. 92. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  7. Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. p. 88. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  8. Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. pp. 83–84. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  9. Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. p. 90. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  10. Charsley, S. (1998). "Sanskritization: The Career of an Anthropological Theory". Contributions to Indian Sociology. 32 (2): 527. doi:10.1177/006996679803200216.
  11. Jaffrelot, Christophe (2003). India's silent revolution: the rise of the lower castes in North India (Reprinted ed.). C. Hurst & Co. p. 199. ISBN 978-1-85065-670-8. Archived from the original on 31 డిసెంబరు 2013. Retrieved 6 ఫిబ్రవరి 2012.
  12. Upadhyay, Vijay S.; Pandey, Gaya (1993). History of anthropological thought. Concept Publishing Company. p. 436. ISBN 978-81-7022-492-1. Retrieved 6 ఫిబ్రవరి 2012.
  13. Jassal, Smita Tewari (2001). Daughters of the earth: women and land in Uttar Pradesh. Technical Publications. pp. 51–53. ISBN 978-81-7304-375-8. Archived from the original on 9 అక్టోబరు 2013. Retrieved 6 ఫిబ్రవరి 2012.
  14. Narayan, Badri (2009). Fascinating Hindutva: saffron politics and Dalit mobilisation. SAGE. p. 25. ISBN 978-81-7829-906-8. Retrieved 6 ఫిబ్రవరి 2012.
  15. Gupta, Dipankar (2004). Caste in question: identity or hierarchy?. SAGE. p. 199. ISBN 978-0-7619-3324-3. Retrieved 22 ఫిబ్రవరి 2012.
  16. Pinch, William R. (1996). Peasants and monks in British India. University of California Press. p. 110. ISBN 978-0-520-20061-6. Retrieved 22 ఫిబ్రవరి 2012.

అదనపు అధ్యయనం[మార్చు]

  • Bayley C. (1894) Chiefs and Leading Families In Rajputana
  • Henige, David (2004). Princely states of India;A guide to chronology and rulers
  • Jyoti J. (2001) Royal Jaipur
  • Krishnadatta Kavi, Gopalnarayan Bahura(editor) (1983) Pratapa Prakasa, a contemporary account of life in the court at Jaipur in the late 18th century
  • Khangarot, R.S., and P.S. Nathawat (1990). Jaigarh- The invincible Fort of Amber
  • Topsfield, A. (1994). Indian paintings from Oxford collections
  • Tillotson, G. (2006). Jaipur Nama, Penguin books
"https://te.wikipedia.org/w/index.php?title=కఛ్వాహ&oldid=3828185" నుండి వెలికితీశారు