కజరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కజరీ (Kajari) లేక కజ్రీభారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక శాస్త్రీయ శైలి గీతం. ఇది బీహారు, ఉత్తర ప్రదేశ్, లలో ప్రసిద్ధము. హిందీలో కజ్రా లేక కోల్ అనగా కాటుక అని అర్థం. ఆకాశాన్ని నల్లని మేఘాలు కమ్ముకున్నప్పుడు, ప్రియురాలు, ప్రియుడి విరహవేదనలో ఈ కజరీని ఆలపిస్తుంది. తెలుగు సినిమా మల్లీశ్వరిలో భానుమతి పాడిన ఆకాశవీధిలో... అనే పాట, ఈ నేపథ్యానికి సంబంధించినదే. చైతి, హోరీ, సావనిలు కూడా కజరీ వంటి గీతాలే. వీటిని ఉత్తర ప్రదేశ్, వారణాసి, మిర్జాపూర్, మథుర, అలహాబాదు, భోజ్‌పూర్ లలోని ప్రాంతాలలో పాడుతారు.

కజరీలు పాడేవారిలో ప్రసిద్ధులు

[మార్చు]
కజరీ గాయకుడు చన్నూలాల్ మిశ్రా

పండిట్ చన్నూలాల్ మిశ్రా, శోభా గుర్టు, సిద్దేశ్వరి దేవి, గిరిజా దేవి, రాజన్, సాజన్ మిశ్రా లు.

కజరీలలో రకాలు

[మార్చు]
  • మిర్జాపూర్ కజరీ: మిర్జాపూర్‌లో ప్రతి సంవత్సరం ఈ కజరీ మహోత్సవం నిర్వహించబడుతుంది.
  • ధున్‌మునియా కజరీ: మహిళలు అర్ధచంద్రాకారంలో నిలబడి నాట్యం చేస్తూ, ఈ కజరీని పాడతారు.

వనరులు

[మార్చు]
  • 1. [1] ఉత్తర ప్రదేశ్ సంస్కృతి
  • 2. [2] కజరీ. బీట్ ఆఫ్ ఇండియా డాట్ కామ్
  • 3. [3] కజరీ గీతాలు
"https://te.wikipedia.org/w/index.php?title=కజరీ&oldid=3685739" నుండి వెలికితీశారు