కటిహార్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కటిహార్ జిల్లా
कटिहार जिलाضلع کٹہار
బీహార్ పటంలో కటిహార్ జిల్లా స్థానం
బీహార్ పటంలో కటిహార్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపూర్ణియా
ముఖ్య పట్టణంకటిహార్
మండలాలు17
Government
 • లోకసభ నియోజకవర్గాలుకటిహార్
Area
 • మొత్తం3,056 km2 (1,180 sq mi)
Population
 (2011)
 • మొత్తం30,68,149
 • Density1,000/km2 (2,600/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53.56 %
 • లింగ నిష్పత్తి916
ప్రధాన రహదార్లుNH 31, NH 81
Websiteఅధికారిక జాలస్థలి
కతిహార్ జిల్లాలోని పొలాలు

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో కటిహార్ జిల్లా (హిందీ:) ఒకటి. కటిహార్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లా పూర్ణియా డివిజన్‌లో భాగం.

చరిత్ర[మార్చు]

1973లో పూర్ణియా జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి కటిహార్ జిల్లాను రూపొందించారు.[1] ఆరంభంలో కతియార్ చౌదరీల ఆధిక్యతలో ఉండేది. చౌదరీలు కోసీ ప్రాంతంలో పెద్ద భూస్వాములుగా ఉండేవారు. చౌదరీ కుటుబానికి ఆద్యుడు " ఖాన్ బహద్దూర్ చౌదరి మొహమ్మద్ బక్ష్ " ఆయన ఆధీనంలో 126 వ్యవసాయ కుటుంబాలు ఉండేవి. ఆయన 1936లో మరణించాడు. ఆయనకుటుంబానికి కటిహార్‌లో 15,000 ఎకరాల భూమి, పూర్ణియాలో 8,500 ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుతం ఆయన వారసులు చౌదరి తాజ్ మొహమ్మద్, చౌదరి మొహమ్మద్ అషరఫ్ ఇప్పటికీ భూస్వాములుగా ఉన్నారు. వారి హవేలీని తాజ్ దేహోరీ అంటారు. దేశవిభజనకు ముందు 1905లో కటిహార్ బెంగాల్ భూభాగంలో భాగంగా ఉండేది. విభజన తరువాత కటిహార్ బీహార్ రాష్ట్రంలో భాగం అయింది. బిహార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ సంస్కృతికంగా బెంగాల్‌తో సభంధం అధికంగా ఉంటుంది. జిల్లాలో దుర్గాపూజ ఘనంగా నిర్వహించబడుతుంది. "నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే"కు ఇది ఆరంభస్థానంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

కటిహార్ జిల్లా వైశాల్యం 3057 చ.కి.మీ.[2] ఇది కెనడా దేశంలోని అకిమిష్కి ద్వీపం వౌశాల్యానికి సమానం.[3]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కటిహార్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

రాజకీయం[మార్చు]

కటిహార్ పార్లమెంటరీ నియోజకవర్గం :- తారిక్ అంవర్, నిఖిల్ కుమార్ చౌదరీ, యోనుయిస్ సలిం, ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ (అపజయం). జిల్లా నుండి ప్రజలు స్వతంత్ర సమరంలో విస్తారంగా పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు " అల్హజ్ అఝర్ అలి " ఙాపకార్ధం ఆయన నివసించిన గ్రామానికి ఆయన పేరు నిర్ణయించబడింది.

ఉపవిభాగం[మార్చు]

జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : కటిహార్, బర్సొయి , మనిహరి

  • కటిహార్ సబ్ డివిజన్లో మరో 10 బ్లాక్స్ ఉన్నాయి :- కటిహార్, కొర్హ, ఫల్క, సమెలి, బరారి, కుర్సెల, ప్రంపుర్, హసంగంజ్, దంద్ఖొర , మన్సహి.
  • బర్సొయి సబ్ డివిజన్లో 4 బ్లాక్స్ ఉన్నాయి:  బర్సొయి, కద్వ, అజమ్నగర్ , బలరామ్పూర్.
  • మనిహరి సబ్ డివిజన్లో 2 బ్లాక్స్ ఉంది : మనిహరి , అందబద్
  • హసింగజ్ జిల్లాలో పెద్ద బ్లాకుగా ఉంది. ఇది జమీందారీ పాలనలో ఉంది. ఇది దివంగత జోగేంద్రరాయ్ చౌదరీ ఆధ్వర్యంలో ఉంది. ఇదులో స్కూల్, ఆలయం , మార్కెట్ ప్రాంతాలను పౌల్ చౌదరి కుటుంబం దానంగా ఇచ్చింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,068,149,[5]
ఇది దాదాపు. ఓమన్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 117 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1004 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.23%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 916:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 53.56%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు ముస్లిములు అధికంగా ఉన్నారు.[5]
భాష బెంగాలీ, సుర్జాపురి, బర్సొలి (బెంగాలి స్థానిక భాష)

మూలాలు[మార్చు]

  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Akimiski Island 3,001km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Oman 3,027,959
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]