కట్టా శేఖర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టా శేఖర్ రెడ్డి
జననం5 డిసెంబర్
మడుగులపల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ.
వృత్తిజర్నలిస్ట్
పిల్లలుస్ఫూర్తి
కుటుంబంకట్టా మల్లారెడ్డి ( నాన్న ), జానకమ్మ( అమ్మ )

కట్టా శేఖర్ రెడ్డి జర్నలిస్ట్, రచయిత, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్. కట్టా శేఖర్ రెడ్డి అంతకు ముందు ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త పత్రికల్లో పని చేశాడు. ఆయన మహా టివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా కూడా పని చేశాడు. నమస్తే తెలంగాణ పత్రికలో 2010 లో చేరి, 2014 నుంచి పత్రిక సంపాదకులుగా పని చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కట్టా-మీఠా రచనల ద్వారా ఎన్నో వ్యాసాలను రాశాడు. 10 ఫిబ్రవరి 2020న రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ గా నియమితులయ్యాడు.[1][2]

జననం[మార్చు]

కట్టా శేఖర్‌రెడ్డి నల్లగొండ జిల్లా , మాడుగులపల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో కట్టా మల్లారెడ్డి, జానకమ్మ దంపతులకు 1961 డిసెంబర్‌ 5న జన్మించాడు.

విద్యాభాస్యం[మార్చు]

కట్టా శేఖర్‌రెడ్డి మాడ్గులపల్లిలోనే పదోతరగతి వరకు చదువుకున్నాడు. నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, ఎన్జీ కాలేజీలో డిగ్రీ, నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ కాలేజీలో బీఈడీ పూర్తి చేశాడు. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో ఎంఏ, లెనినిస్ట్‌ విద్యా తాత్వికతపై ఎంఫిల్‌ పూర్తిచేశాడు. 1985లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ హ్యుమానిటీస్‌ కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, సెనేట్‌ సభ్యుడిగా పని చేసాడు.

వృత్తి జీవితం[మార్చు]

1987లో ఉదయం దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా ఆయన జర్నలిస్టుగా ప్రస్థానం మొదలు పెట్టాడు. 1989లో ఆంధ్రజ్యోతి పత్రికలో చేరి పదేండ్లకుపైగా వివిధ హోదాల్లో పని చేసాడు. అనంతరం రీడిఫ్‌.కామ్‌, వార్త పత్రికల్లో పనిచేసాడు. 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వెలుగు ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాడు . 2002 అక్టోబరు 15న ఆంధ్రజ్యోతి పునఃప్రారంభం అయిన తరువాత ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆరేండ్లపాటు పనిచేశాడు. అనంతరం రెండేండ్ల పాటు మహాటీవీలో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 2010లో నమస్తే తెలంగాణ దినపత్రిక లో వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరించాడు. 2014 నుంచి నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కొనసాగుతూ 2020లో స్వచ్చంద పదవి విరమణ చేశాడు.[3] అనంతరం ఆయనను 10 ఫిబ్రవరి 2020న తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. 25 ఫిబ్రవరి 2020 న ఆర్టీఐ కమిషనర్‌గా భాద్యతలు చేపట్టాడు.[4]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (11 February 2020). "ఆర్టీఐ కమిషనర్లుగా ఐదుగురు". www.ntnews.com. Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (11 February 2020). "ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం". www.andhrajyothy.com. Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.
  3. నమస్తే తెలంగాణ (8 September 2019). "కబ్జా రాజకీయాలు". ntnews.com. Archived from the original on 11 September 2019. Retrieved 11 September 2019.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 February 2020). "ఆర్టీఐ కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020.