కట్రా (జమ్మూ కాశ్మీరు)
Katra | |
---|---|
Temple town | |
Coordinates: 32°59′22″N 74°56′0″E / 32.98944°N 74.93333°E | |
Country | India |
Union territory | Jammu and Kashmir |
జిల్లా | Reasi |
Elevation | 875 మీ (2,871 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 9,008 |
Language | |
• అధికార | ఉర్దూ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | JK |
Literacy | 70% |
కట్రా లేదా కట్రా వైష్ణోదేవి అని పిలిచే ఇది ఒక చిన్న పట్టణం. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీరు లోని రియాసి జిల్లా త్రికూట పర్వత ప్రాంతంలో నెలకొని ఉంది ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రం వైష్ణో దేవి ఆలయం ఉంది.ఇది జమ్మూ నగరం నుండి 42 కి.మీ.దూరంలో ఉంది.
భౌగోళికం
[మార్చు]కట్రా 32°59′N 74°57′E / 32.98°N 74.95°E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.[3] ఇది 875 మీటర్లు (2,474 అడుగులు) సగటు ఎత్తులో ఉంది బంగంగా నది ఈ గ్రామం గుండా ప్రవహిస్తుంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం కట్రా పట్టణ జనాభా మొత్తం 9,008,అందులో పురుషులు 5,106 మందికాగా, స్త్రీలు 3,902 మంది ఉన్నారు.జనాభా మొత్తంలో 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలు 1012 మంది ఉన్నారు. పట్టణ జనాభా మొత్తంలో అక్షరాస్యులు 6,841 మంది ఉన్నారు.మొత్తం జనాభాలో అక్షరాస్యత రేటు 75.9% ఉంది.పురుషుల అక్షరాస్యత రేటు 79.4% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 71.4%గా ఉంది.,షెడ్యూలు కులాలకు చెందిన వారు 1925 మంది ఉండగా, షెడ్యూలు తెగలకు చెందన వారు 9 మంది ఉన్నారు.2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కట్రా పట్టణ పరిధిలో1594 నివాస గృహాలు ఉన్నాయి.[1]
పర్యాటక
[మార్చు]వైష్ణో దేవిని సందర్శించే యాత్రికులకు కట్రా పర్యాటక కెేంద్రంగా పనిచేస్తుంది.ఇది పర్యాటక పరిశ్రమనుఅభివృద్ధి చెందిన పట్టణం.ఇది అన్ని రకాల యాత్రికల బడ్జెట్లకు సరిపోయే హోటళ్ళు, అతిథి గృహాలు, రెస్టారెంట్లు, ఢాబాస్, ఫాస్ట్ ఫుడ్ అందించే కేంద్రాలకు నిలయం.పేదలకు " సరైస్" రూపంలో కొన్ని రిజిస్టర్డ్ ట్రస్టులు ఉచిత వసతి కల్పిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ మందిరాన్ని 1986లో సందర్శించిన యాత్రికుల సంఖ్య1.4 మిలియన్లు.అది 2009 నాటికి 8.2 మిలియన్లకు పెరిగింది.గత సంవత్సరాలలో ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి.ప్రధాన ఆకర్షణలలో స్మారక చిహ్నాలు, డ్రైఫ్రూట్స్, ఉన్ని వస్త్రాలు, అల్లిన వస్తువులు, తోలు జాకెట్లు మొదలైనవి కొనడానికి " బజార్ (మార్కెట్) ఉన్నాయి. వైష్ణో దేవి చేరుకోవడానికి, యాత్రికులు ట్రెక్ ప్రారంభించే ముందు కట్రా వద్ద నమోదు చేసుకోవాలి. నమోదు చేయడం ద్వారా, యాత్రికులు 14 మంది ట్రెక్కింగ్‌లో ఉన్నప్పుడు 100,000 రూపాయల వరకు ప్రమాద బీమా పొందుతారు.మరో 2.5 కి.మీ. దూరంలో మరో ట్రెక్ ఉంది.అక్కడ బాబా భైరోనాథ్ ఆలయం ఉంది. వైష్ణో దేవి ఆలయం నుండి యాత్రికులకు ఎలక్ట్రిక్ వాహనాలు, హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వైష్ణో దేవి భవన్ నుండి భైరోన్ బాబా మందిర్ వరకు ప్రారంభించిన కొత్త రోప్‌వే వ్యవస్థ ఉంది.దీని ద్వారా ప్రతి గంటకు 800 మంది ప్రయాణిస్తారు.ఈ పట్టణం చాలా కాలంగా రోడ్లు రాష్ట్ర రహదారుల ద్వారా అనుసంధానించబడి ఉంది. అయితే ఇటీవల దీనిని భారత రైల్వే ద్వారా కూడా అనుసంధానించబడింది.జమ్మూ ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ఉత్తర రైల్వేలోని కట్రా రైల్వే స్టేషన్‌ను మిగతా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో కలుపుతుంది.దీనిని 2014 జులై 14 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీచే ప్రారంభించబడింది.[4]
వైష్ణవ దేవి ఆలయం
[మార్చు]ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Katra". www.censusindia.gov.in. Retrieved 4 November 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 4 ఫిబ్రవరి 2021.
- ↑ "Maps, Weather, and Airports for Katra, India". www.fallingrain.com. Retrieved 7 December 2019.
- ↑ "Modi flags off inaugural train from Katra". The Hindu. 4 July 2014. Retrieved 7 December 2019 – via www.thehindu.com.