కడియాల వెంకటేశ్వరరావు
కడియాల వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | కడియాల వెంకటేశ్వరరావు తెనాలి దగ్గర్లోని కఠెవరం |
నివాస ప్రాంతం | తెనాలి దగ్గర్లోని కఠెవరం |
వృత్తి | ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ |
ప్రసిద్ధి | పురావస్తు పరిశోధకుడు |
కడియాల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతని స్వస్థలం తెనాలి దగ్గర్లోని కఠెవరం. పోల్‌వాల్ట్ జాతీయ చాంపియన్, మాస్టర్ అథ్లెటిక్స్‌లో మూడుసార్లు ప్రపంచ పోటీల్లో పాల్గొన్నాడు. 2001లో హైజంప్‌లో నాలుగో స్థానం (బ్రిస్టన్), 2006లో (ఆస్ట్రియా) హైజంప్‌లో ఐదో స్థానాన్ని పొందిన ఏకైక రాష్ట్ర వెటరన్ అథ్లెట్.
పరిశోధనలు
[మార్చు]శ్రీకాకుళం జిల్లా పాండవుల మెట్ట పై అతి పెద్ద 'మెగాలిత్ డాల్మిన్' ను కనుగొన్నాడు. జైనులు వినియోగించిన అతి పురాతన రాతి పడకలను ఈ కొండలపై ఉన్న గుహల్లో ఉండటాన్ని వెలుగులోకి తెచ్చాడు. శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మండలం దన్నానపేట, పాండవులమెట్ట వద్ద క్రీస్తు పూర్వం 1000-500 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన బృహత్మలాయుగపు అతిపెద్ద సమాధి బయల్పడింది. దీనిని రాష్ట్ర క్రీడా సంస్థ మాజీ అధికారి గా ఉన్న అతను చేపట్టిన అణ్వేషణలో ఈ సమాధి వెలుగులోకొచ్చింది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దది.
తెనాలి దగ్గర్లోని మల్లెపాడు లో బౌద్ధస్థూపం ఉందని రుజువు చేశాడు. కఠెవరానికి చెందిన కనకదండి సోమన్న , సర్ ఆర్థర్ కాటన్‌కన్నా ముందే కృష్ణానదిలో ఆనకట్ట నిర్మించారని వెల్లడించాడు. కారంపూడి దగ్గర్లోని రాక్షసబండ నిలువురాతిశిల సా.శ.1000-500 శతాబ్దాల మధ్య లోహయుగపు నాటిదిగా ఆధారసహితంగా పేర్కొన్నాడు.
గుంటూరు జిల్లా దాచేపల్లి దగ్గరలోని కేశనపల్లి వద్ద నాగులేరు ఒడ్డున రాతిపై చెక్కిన ఆదిమ కాలంనాటి చిత్రాలను కనుగొన్నాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ "Pre-historic rock art site unearthed in Guntur". Archived from the original on 2018-04-18. Retrieved 2018-07-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)