కడ్డీవాయిద్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కడ్డీ వాయిద్యం ఒక సంగీత వాయిద్యం. మిత్తుల అయ్యవార్లనీ, దాసరులనీ పిలువబడేవారు, ఈ కడ్డీ వాయిద్యంలో ప్రవీణులు. ఈ వాయిద్యం వీణ మాదిరిగా ఉంటుంది. వీణ మాదిరే దీనిని కూడా చేతి వ్రేళ్ళతోనే వాయిస్తారు. వీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద భగవన్నామ సంకీర్తనలు వాయిస్తూ వుంటారు.

ఈ వాయిద్యాన్ని ముందు నిలబెట్టుకుని రెండు సన్నని పుల్లలతో జలతరంగ్ వాయిద్యాన్ని వాయించినట్లు వాయిస్తారు. ఈ స్వర మాధుర్యం ఎంతో మధురంగా వుంటుంది. వీరి వృత్తికి ప్రాణప్రదమైనది ఈ వాయిద్యమే. అయితే ఈ వాయిద్యాన్ని అందరూ వాయించలేరు. దీనికి ప్రత్యేకమైన శిక్షణతోనూ, సాధనతోనూ సాధించవలసిందే. అందువల్లనే ఈ వాద్యకాండ్రలో ప్రవీణులు చాల తక్కువ. తెలంగాణాలో ఈ వాయిద్యంలో ప్రసిద్ధులైనవారు కరీంనగర్ జిల్లా మెట్ పల్లి తాలూకాలో ఉన్నారు. ఈ కళా రూపాన్ని శిథిలం కాక ముందే రక్షించు కోవడం అవసరం.

సూచికలు[మార్చు]