కణ వర్ధనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్ధనంలో ఉపతల కణాలు, కెరాటిన్ (ఎరుపు) మరియు DNA (పసుపుపచ్చ)

నియంత్రిత పరిస్థితుల్లో కణాలు పెరిగే సంక్లిష్ట ప్రక్రియను కణ వర్ధనం (సెల్ కల్చర్) అంటారు. ఆచరణలో, "కణ వర్ధనం" అనే పదాన్ని బహుకణ యూకారియోట్‌లు, ముఖ్యంగా జంతు కణాల నుంచి జరిగే కణాల వర్ధనాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. అయితే, మొక్కలు, శిలీంధ్రాలు (ఫంగీ) మరియు వైరస్‌లు, బ్యాక్టీరియా, ప్రోటిస్ట్‌ల వంటి సూక్ష్మజీవుల (మైక్రోబ్‌లు) వర్ధనాలు కూడా ఉన్నాయి. కణజాల వర్ధనం మరియు అవయవ వర్ధనంతో కణ వర్ధనం యొక్క చారిత్రక అభివృద్ధి మరియు పద్ధతులు అంతస్సంబంధం కలిగివున్నాయి.

1900వ దశకం మధ్యకాలంలో జంతు కణ వర్ధనం ఒక సాధారణ ప్రయోగశాల సాంకేతిక పద్ధతిగా అవతరించింది, [1] అయితే అసలు కణజాల మూలం నుంచి వేరుచేసిన జీవ కణ తంతువుల నిర్వహణ పద్ధతిని 19వ శతాబ్దంలోనే కనిపెట్టారు.[2]

చరిత్ర[మార్చు]

19వ శతాబ్దంలో ఇంగ్లీష్ శరీరధర్మ శాస్త్రవేత్త సిడ్నీ రింజెర్ ఒక వివిక్త జంతు గుండె స్పందనలను నిర్వహించేందుకు యోగ్యమైన, సోడియం, పొటాషియం, కాల్షియం మరియు మాగ్నిషియం క్లోరైడ్‌లు కలిగివున్న లవణ ద్రావణాలను కనిపెట్టారు.[1] 1885లో విల్‌హెల్మ్ రౌక్స్ పిండ దశలో ఉన్న కోడి యొక్క అంతస్థ ఫలకంలో ఒక భాగాన్ని వేరు చేశారు, ఆపై దీనిని అనేక రోజులపాటు ఒక వెచ్చని సెలైన్ ద్రావణంలో భద్రపరిచారు, దీంతో కణజాల వర్ధనం యొక్క మూలసూత్రం ఏర్పాటయింది.[3] జాన్స్ హోప్‌కిన్స్ మెడికల్ స్కూల్‌లో మరియు తరువాత యెల్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన రాస్ గ్రాన్‌విల్లే హారిసన్ 1907-1910 మధ్యకాలంలో తన ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను ప్రచురించారు, తద్వారా ఆయన కణజాల వర్ధనం యొక్క పరిశోధనా పద్ధతిని ఏర్పాటు చేశారు.[4]

కణ వర్ధన పద్ధతులు 1940 మరియు 1950వ దశకాల్లో బాగా అభివృద్ధి చెందాయి, వైరాలజీ (వైరస్‌లకు సంబంధించిన శాస్త్రం) లో పరిశోధనలకు మద్దతుగా ఈ పద్ధతులను అభివృద్ధి చేశారు. కణ వర్ధనాల్లో వైరస్‌లకు ప్రాధాన్యత పెరగడంతో టీకాలు (వ్యాక్సిన్‌లు) తయారు చేసేందుకు స్వచ్ఛమైన వైరస్‌లు సృష్టించడం సాధ్యపడింది. సూదితో ఎక్కించగల పోలియో టీకాను జోనాస్ సాల్క్ అభివృద్ధి చేశారు, కణ వర్ధన పద్ధతులను ఉపయోగించి పెద్దఎత్తున తయారు చేసిన మొదటి ఉత్పత్తుల్లో ఇది కూడా ఒకటి. జాన్ ఫ్రాంక్లిన్ ఎండెర్స్, థామస్ హుకిల్ వెల్లెర్ మరియు ఫ్రెడెరిక్ చాప్‌మాన్ రాబిన్స్‌ల యొక్క కణ వర్ధన పరిశోధన ద్వారా ఈ టీకా తయారీ సాధ్యపడింది, కోతి మూత్రపిండ కణ వర్ధనాల్లో వైరస్‌ను పెంచే పద్ధతిని కనిపెట్టినందుకు వీరికి నోబెల్ బహుమతి లభించింది.

క్షీరద కణ వర్ధనంలో భావాలు[మార్చు]

కణాలు వేరుపరచడం (పృథక్కరణం)[మార్చు]

అనేక మార్గాల్లో ఎక్స్ వివో (జీవి వెలుపల కృత్రిమ వాతావరణంలో) వర్ధనం కోసం కణజాలాల నుంచి కణాలను వేరుచేయవచ్చు. కణాలను సులభంగా రక్తం నుంచి శుద్ధి చేయవచ్చు, అయితే తెల్లరక్త కణాలు మాత్రమే వర్ధనంలో పెరుగుదల సామర్థ్యం కలిగివుంటాయి. కొల్లజెనస్, ట్రైప్సిన్ లేదా ప్రోనాస్ వంటి ఎంజైమ్‌లతో ఎంజైమ్ జీర్ణం ద్వారా మృదు కణజాలాలను ఏకకేంద్రక కణాలు విడుదల చేయవచ్చు, ఇది కణేతర మాతృకను విచ్ఛిన్నం చేస్తుంది. ప్రత్యామ్నాయంగా, కణజాల భాగాలను ఉత్పత్తి మాధ్యమంలో ఉంచవచ్చు మరియు ఈ విధంగా పెరిగే కణాలు వర్ధనానికి అందుబాటులో ఉంటాయి. ఈ పద్ధతిని ఎక్స్‌ప్లాంట్ కల్చర్‌గా గుర్తిస్తారు.

ఒక భాగం నుంచి నేరుగా వర్ధనం చేసే కణాలను ప్రాథమిక కణాలు గా గుర్తిస్తారు. ట్యూమర్‌లు (కణితలు) నుంచి సేకరించే కొన్ని కణాలను మినహాయిస్తే, అనేక ప్రాథమిక కణ వర్ధనాలకు పరిమిత జీవితకాలం ఉంటుంది. కొన్ని జనాభా ద్విగుణతలు (రెట్టింపు చేయడం) తరువాత (దీనిని హేఫ్లిక్ పరిమితిగా పిలుస్తారు) కణాలు సునెసన్స్ (వయస్సు పెరగడం) అనే ప్రక్రియకు గురవతాయి, అవి విభజన చెందడం నిలిచిపోతుంది, ఇదిలా ఉంటే వీటికి సాధారణంగా జీవించే శక్తి మాత్రం నిలిచివుంటుంది.

స్థిరపరచబడిన లేదా అమర్త్య కణ తంతువు, టెలోమెరాస్ జన్యువు యొక్క కృత్రిమ సమీకరణం వంటి నియమరహిత ఉత్పరివర్తన లేదా ఉద్దేశపూర్వక రూపాంతరణం ద్వారా నిరవధికంగా తననుతాను పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని పొందుతుంది. కొన్నిరకాల కణాలకు ప్రాతినిధ్యం వహించే అనేక స్థిరీకరించబడిన కణ తంతువులు ఉన్నాయి.

వర్ధనంలో కణాల నిర్వహణ[మార్చు]

కణాలు పొదిగే సాధనంలో తగిన ఉష్ణోగ్రత మరియు వాయు మిశ్రమం (ఎక్కువగా, క్షీరద కణాలకు 37 °C, 5% CO2) వద్ద కణాలు పెరుగుతాయి మరియు నిర్వహించబడతాయి. వర్ధన పరిస్థితులు ప్రతి కణ రకానికి ఎక్కువగా మారుతుంటాయి, మరియు ఒక నిర్దిష్ట కణ రకం కోసం వైవిధ్య పరిస్థితులు భిన్నమైన సమలక్షణాలను (ఫెనోటైప్‌లు) ప్రతిఫలించవచ్చు.

ఉష్ణోగ్రత మరియు వాయు మిశ్రమం కాకుండా, వర్ధన వ్యవస్థల్లో ఎక్కువగా మారుతుండే అంశం ఏమిటంటే పెరుగుదల మాధ్యమం. పెరుగుదల మాధ్యమానికి సూత్రాలు pH, గ్లూకోజ్, సాంద్రత, పెరుగుదల కారకాలు మరియు ఇతర పోషకాల ఉనికి తదితరాలతో మారుతుంటాయి. మాధ్యమ సంపూరకానికి ఉపయోగించే పెరుగుదల కారకాలను తరచుగా కాల్ఫ్ సెరమ్ (సీరం) వంటి జంతు రక్తం నుంచి సేకరిస్తారు. రక్తం-నుంచి సేకరించిన ఈ భాగాలతో ముడిపడిన ఒక సమస్య ఏమిటంటే, వీటి ద్వారా, ముఖ్యంగా బయోటెక్నాలజీ వైద్య అనువర్తనాల్లో, వైరస్‌లు లేదా ప్రియాన్‌లతో వర్ధనం కలుషితమయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనప్పుడు ఈ భాగాల ఉపయోగాన్ని తగ్గించడం లేదా తొలగించడం ద్వారా ప్రస్తుతం కణ వర్ధనాన్ని నిర్వహిస్తున్నారు, అయితే అన్ని వేళలా ఇది సాధ్యపడటం లేదు. ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ వంటి దేశాల నుంచి కనిష్ఠ BSE/TSE నష్ట సంభావ్యత ఉన్న జంతు రక్తాన్ని తీసుకోవడం మరియు సీరం (సెరమ్) నుంచి సేకరించే శుద్ధి చేసిన పోషక సాంద్రతలను మొత్తం జంతు సీరం స్థానంలో కణ వర్ధనానికి ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయ వ్యూహాలు ఉన్నాయి.[5]

ప్లాంటింగ్ డెన్సిటీ (వర్ధన మాధ్యమం యొక్క ప్రతి ఘనపరిమాణానికి ఉన్న కణాల సంఖ్య) కొన్ని కణ రకాల కోసం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, కనిష్ఠ ప్లేటింగ్ డెన్సిటీ గ్రాన్యులోసా కణాలు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి చేసేలా చేస్తుంది, ఇదిలా ఉంటే అధిక ప్లేటింగ్ డెన్సిటీ వాటిని ప్రోజెస్టెరోన్ ఉత్పత్తి చేసే థెకా ల్యూటీన్ కణాలు మాదిరిగా కనిపించేలా చేస్తుంది.[6]

వ్యాక్షేప లేదా సంసంజక వర్ధనాల్లో కణాలు పెరుగుతాయి. కొన్ని కణాలు సహజంగా ఉపరితలానికి జోడించబడకుండా వ్యాపేక్షంలో, అంటే రక్తప్రవాహంలో ఉండే కణాలు మాదిరిగా ఉంటాయి. వ్యాక్షేప వర్ధనాల్లోనూ మనుగడ సాధించగల సామర్థ్యం కలిగివుండే విధంగా మార్పులు చేసిన కణ తంతువులు కూడా ఉన్నాయి, అందువలన అవి సంసంజక వర్ధన పరిస్థితులు వీలు కల్పించే దాని కంటే అధిక సాంద్రతలో కూడా పెరగగలవు. సంసంజక కణాలకు కణజాల వర్ధన ప్లాస్టిక్ లేదా మైక్రోకారియర్ వంటి ఒక ఉపరితలం అవసరమవుతుంది, వీటికి సంసంజక లక్షణాలను పెంచేందుకు మరియు పెరుగుదల మరియు విభజనీకరణకు అవసరమైన ఇతర సంకేతాలను అందించేందుకు కణేతర మాతృక భాగాలతో పూత పూస్తారు. ఘన కణజాలాల నుంచి తీసుకునే అనేక కణాలు సంసంజకంగా ఉంటాయి. సంసంజక వర్ధనం యొక్క మరో రకం ఏమిటంటే ఆర్గనోటైపిక్ కల్చర్, ద్వి-కోణ వర్ధన పాత్రలకు భిన్నంగా దీనిలో ముక్కోణపు పర్యావరణంలో కణాలను పెంచుతారు. ఈ 3డి వర్ధన వ్యవస్థ జీవరసాయనికంగా మరియు శరీరధర్మ శాస్త్రపరంగా ఇన్ వివో (జీవి శరీరం లోపల) కణజాలం మాదిరిగానే ఉంటుంది, అయితే సాంకేతికంగా అనేక కారణాల వలన దీని నిర్వహణ సవాలుతో కూడుకొని ఉంటుంది (ఉదాహరణకు విస్తరణం).

కణ తంతు పరపరాగ-కాలుష్యం[మార్చు]

కణ తంతు పరపరాగ-కాలుష్యం (సెల్ లైన్ క్రాస్-కంటామినేషన్) వర్ధన కణాలతో పనిచేసే సమయంలో శాస్త్రవేత్తలకు ఒక సమస్య కాగలదు. ప్రయోగాల్లో ఉపయోగించే కణాల్లో 15–20% కణాలను మరో కణ తంతువుతో తప్పుగా గుర్తించడం లేదా కాలుషితం చేయబడటం జరుగుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.[7][8][9] కణ తంతు పరపరాగ కాలుష్యానికి సంబంధించిన సమస్యలు NCI-60 శ్రేణి నుంచి తంతుాల్లో గుర్తించబడ్డాయి, ఈ శ్రేణిని తరచుగా మందుల-పరిశీలన అధ్యయనాలకు ఉపయోగిస్తున్నారు.[10][11] అమెరికన్ టైప్ కల్చర్ కలెక్షన్ (ATCC) మరియు జర్మన్ కలెక్షన్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ అండ్ సెల్ కల్చర్స్ (DSMZ) వంటి ప్రధాన కణ తంతు సురక్షిత కేంద్రాలు పరిశోధుకుడి చేత తప్పుగా గుర్తించబడిన కణ తంతు సమర్పణలను పరిశోధకుల నుంచి పొందాయి.[10][12] ఇటువంటి కాలుష్యం కణ వర్ధన తంతువులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన పరిశోధన నాణ్యతకు సమస్యలను సృష్టిస్తుంది, ప్రధాన సురక్షిత కేంద్రాలు ఇప్పుడు అన్ని కణ తంతు సమర్పణలను ధ్రువీకరిస్తున్నాయి.[13] తన యొక్క కణ తంతువులను ధ్రువీకరించేందుకు ATCC షార్ట్ టెండెమ్ రిపీట్ (STR) DNA ఫింగర్‌ప్రింటింగ్‌ను ఉపయోగిస్తుంది.[14]

కణ తంతు పరపరాగ-కాలుష్యం యొక్క సమస్యను పరిష్కరించేందుకు కణ తంతువు యొక్క గుర్తింపును ఏర్పాటు చేసేందుకు ప్రారంభ దశలోనే తమ కణ తంతువులను ధ్రువీకరించేందుకు పరిశోధకులను ప్రోత్సహిస్తున్నారు. కణ తంతు నిల్వలను శీతలపరిచే ముందు, క్రియాశీల వర్ధనం సందర్భంలో ప్రతి రెండు నెలలకు మరియు కణ తంతువులను ఉపయోగించి సృష్టించిన ఏదైనా పరిశోధన సమాచారాన్ని ప్రచురించే ముందు ధ్రువీకరణను పునరావృతం చేస్తున్నారు. కణ తంతువులను గుర్తించేందుకు ఉపయోగించే అనేక పద్ధతుల్లో ఐసోఎంజైమ్ విశ్లేషణ, హ్యూమన్ లింపోసైట్ యాంటీజెన్ (HLA) టైపింగ్ మరియు STR విశ్లేషణ ముఖ్యమైనవి.[14]

ఒక ముఖ్యమైన కణ-తంతు పరపరాగ కాలుష్యం ఏమిటంటే అమర్త్య (మరణంలేని) HeLa కణ తంతువు.

వర్ధన కణాల యొక్క అభిసంధానం[మార్చు]

సాధారణంగా అన్ని కణాలు వర్ధనంలో విభజన చెందుతాయి, అవి సాధారణంగా అందుబాటులో ఉన్న వైశాల్యం లేదా ఘనపరిమాణాన్ని పూరించేందుకు పెరుగుతాయి. అవి అనేక సమస్యలను సృష్టించవచ్చు, అవి:

 • పెరుగుదల మాధ్యమంలో పోషకాల క్షీణత
 • అపోప్టోటిక్/నెక్రోటిక్ (మృత) కణాల వృద్ధి.
 • కణానికి కణానికి మధ్య సంబంధం కణ చక్ర నిర్బంధాన్ని ప్రేరేపించగలదు, ఇది సంపర్క నిరోధం (కాంటాక్ట్ ఇన్‌హాబిటేషన్) లేదా సెనెసెన్స్‌గా తెలిసిన కణాల విభజనను నిలిపివేస్తుంది.
 • కణం-కణం మధ్య సంబంధం కణ విభజనీకరణను ప్రేరేపించగలదు.

మాధ్యమ మార్పులు, నిష్క్రమణ కణాలు మరియు ఖండన కణాలను వర్ధన కణాల్లో నిర్వహించే సాధారణ అభిసంధానాలుగా చెప్పవచ్చు. వీటిని సాధారణంగా వంధ్య సాంకేతిక ప్రక్రియపై ఆధారపడే కణజాల వర్ధన పద్ధతులను ఉపయోగించి నిర్వహిస్తారు. బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు ఇతర కణ తంతువులతో కాలుష్యాన్ని నివారించేందుకు వంధ్య సాంకేతిక ప్రక్రియను ఉపయోగిస్తారు. అభిసంధానాలను ఎక్కువగా కాలుషితకారక సూక్ష్మ-జీవులను నివారించేందుకు ఒక బయోసేఫ్టీ హుడ్ లేదా లామినార్ ఫ్లో క్యాబినెట్‌లో నిర్వహిస్తారు. యాంటీబయాటిక్స్ (సూక్ష్మజీవనాశకం) (ఉదాహరణకు పెన్సిలిన్ మరియు స్ట్రెప్టోమైసిన్) మరియు యాంటీఫంగల్స్ (శిలీంధ్రనాశిని) (ఉదాహరణకు యాంఫోటెరిసిన్ B) లను కూడా పెరుగుదల మాధ్యమానికి జోడిస్తారు.

అన్ని కణాలు జీవక్రియా ప్రక్రియల్లో పాల్గొనడంతో, ఆమ్లం ఉత్పత్తి అవుతుంది మరియు pH క్షీణిస్తుంది. పోషకాల క్షీణతను కొలిచేందుకు, తరచుగా ఒక pH సూచికను మాధ్యమానికి జోడిస్తారు.

మాధ్యమ మార్పులు[మార్చు]

సంసంజక వర్ధనాల సందర్భంలో, మాధ్యమాన్ని నేరుగా నీరు తీసివేయడం మరియు మార్చడం ద్వారా తొలగించవచ్చు.

నిష్క్రమణ కణాలు[మార్చు]

నిష్క్రమణ (పాసింగ్) (కణాల ఉపవర్ధనం లేదా కణాల విభజనగా కూడా దీనిని గుర్తిస్తారు) ప్రక్రియ కొద్ది సంఖ్యలో కణాలను కొత్త పాత్రలోకి బదిలీ చేయడంతో ముడిపడివుంటుంది. సుదీర్ఘ అధిక కణ సాంద్రతకు సంబంధించిన సెనెసెన్స్ (వయస్సు పెరగడం) తప్పిపోతుంది కాబట్టి, కణాలు తంతువుతప్పకుండా విభజన చెందుతున్నట్లయితే, సుదీర్ఘకాలంపాటు వాటిని వర్ధనం చేయవచ్చు. ఒక పెద్ద తాజా మాధ్యమ పరిమాణంలో కొన్ని కరిగిన కణాలు గల వర్ధనం యొక్క కొద్ది పరిమాణంతో వ్యాక్షేప వర్ధనాలను సులభంగా నిష్క్రమింపజేయవచ్చు. సంసంజక వర్ధనాలకు, కణాలను మొదట విడదీయాల్సిన అవసరం ఉంది; దీనిని సాధారణంగా ట్రైప్సిన్-EDTA మిశ్రమంతో చేస్తారు, అయితే ప్రస్తుతం దీని కోసం ఇతర ఎంజైమ్ మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఒక కొత్త వర్ధనాన్ని వేగవంతం చేసేందుకు కొద్ది సంఖ్యలో విభజించబడిన కణాలను ఉపయోగించవచ్చు.

ట్రాన్స్‌పెక్షన్ మరియు ట్రాన్స్‌డక్షన్[మార్చు]

ట్రాన్స్‌ఫెక్షన్ ద్వారా అన్య DNAను ప్రవేశపెట్టడాన్ని కణాలను అభిసంధానం చేయడానికి మరో సాధారణ పద్ధతిగా చెప్పవచ్చు. దీనిని తరచుగా కణాలు ఒక ప్రోటీన్‌ను వ్యక్తపరిచేలా చేసేందుకు నిర్వహిస్తారు. ఇటీవల RNAi యొక్క ట్రాన్స్‌ఫెక్షన్ నిర్మాణాలు ఒక నిర్దిష్ట జన్యువు/ప్రోటీన్ యొక్క సమీకరణాన్ని నిరోధించేందుకు యోగ్యమైన పద్ధతిగా నిరూపించబడ్డాయి. DNAను వైరస్‌లను ఉపయోగించడం ద్వారా కూడా కణాల్లోకి చేర్చవచ్చు, దీనికి ట్రాన్స్‌డక్షన్, ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. పరాన్నజీవుల కారకాలు మాదిరిగా వైరస్‌లు DNAను కణాల్లోకి ప్రవేశపెట్టేందుకు బాగా అనుకూలంగా ఉంటాయి, వాటి పునరుత్పత్తి ప్రక్రియ ఇది ఒక సాధారణమైన భాగం.

స్థిరీకరించబడిన మానవ కణ తంతువులు[మార్చు]

ప్రారంభ మానవ కణ తంతువుల్లో ఒకటి, హెన్రియెట్టా లాక్స్ నుంచి సేకరించారు, హెన్రియెట్టా లాక్స్ క్యాన్సర్‌తో మరణించారు, వర్ధన HeLa కణాలు ఇక్కడ చూపించబడ్డాయి, హోయెస్ట్‌తో ఉన్న కేంద్రకాలు బులుగు రంగులో మారి ఉన్నాయి.

మానవులకు సంబంధించిన కణ తంతువులు జీవ నైతిక విలువల్లో కొంతవరకు వివాదాస్పదంగా ఉన్నాయి, అవి వాటి మాతృ జీవి కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది మరియు తరువాతి కణాలు లాభసాటి వైద్య చికిత్సల అన్వేషణలో ఉపయోగపడతాయి. ఈ విభాగంలో ఒక నిర్ధారణ కోసం, కాలిఫోర్నియా సుప్రీం కోర్టు మూర్ మరియు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అధికారుల కేసులో సంపూర్ణ అంగీకారంతో తమ అవయవాల నుంచి తీసుకున్న కణ తంతువులపై మానవ రోగులకు ఎటువంటి ఆస్తి హక్కులు ఉండవని తీర్పు చెప్పింది.[15]

హైబ్రిడోమాస్ యొక్క సృష్టి[మార్చు]

ఒక అమర్త్య కణ తంతువుతో సాధారణ కణాలను కలపడం సాధ్యపడుతుంది. ఈ పద్ధతిని మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక వ్యాధి నిరోధకత కలిగించిన జంతువు యొక్క స్ప్లీన్ (లేదా రక్తం) నుంచి వేరుచేసిన లింఫోసైట్‌లను ఒక అమర్త్య మైలోమా కణ తంతువు (B కణ వారసత్వం) తో చేర్చడం ద్వారా హైబ్రిడోమాను సృష్టించవచ్చు, దీనికి ప్రాథమిక లింఫోసైట్ యొక్క వ్యాధినిరోధక లక్షణం మరియు మైలోమా యొక్క అమరత్వం ఉంటుంది. ప్రత్యేక పెరుగుదల మాధ్యమం (HA లేదా HAT) కలపని మైలోమా కణాలకు వ్యతిరేకమైన ఎంపికకు ఉపయోగిస్తారు; ప్రాథమిక లింఫోసైట్‌లు వర్ధనంలో త్వరగా మరణిస్తాయి మరియు కలిసిన కణాలు మాత్రమే బతికి ఉంటాయి. అవసరమైన వ్యాధినిరోధకం తయారీ కోసం వీటిని పరిశీలిస్తారు, సాధారణంగా ప్రారంభించే వర్గాల్లో మరియు ఆపై ఒకసారి క్లోనింగ్ తరువాత వీటిని పరిశీలించడం జరుగుతుంది.

==కణ వర్ధనం యొక్క అనువర్తనాలు== వైరస్ సంబంధ టీకాలు మరియు ఇతర బయోటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి జంతు కణ తంతువుల యొక్క సామూహిక వర్ధనం ప్రధాన ఆధారంగా ఉంది [16], బయోటెక్నాలజీ ఉత్పత్తులకు అడ్జువాంట్స్ ఒక ఉదాహరణ.[17]

క్షీరదేతర కణాల వర్ధనం[మార్చు]

మొక్కల కణ వర్ధన పద్ధతులు[మార్చు]

మొక్కల కణ వర్ధనాలు ఎక్కువగా ద్రవ మాధ్యమంలో కణ వ్యాక్షేప వర్ధనాలుగా లేదా ఘన మాధ్యమంలో కల్లస్ కల్చర్‌లుగా పెరుగుతాయి. విభజనీకరణ చెందని మొక్క కణాల వర్ధనం మరియు కాల్లీకి మొక్కలు పెరుగుదలకు అవసరమయ్యే హార్మోన్‌లు ఆక్సిన్ మరియు సైటోకినిన్‌లలో సరైన సంతులనం అవసరమవుతుంది.

బ్యాక్టీరియా మరియు ఈస్ట్ (మధుశిలీంధ్రం) వర్ధన పద్ధతులు[మార్చు]

బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కోసం, కొద్ది పరిమాణాల్లో కణాలను సాధారణంగా ఒక ఘన మద్దతు పదార్థంపై పెంచుతారు, ఈ పదార్థంపై పోషకాలు ఉంటాయి, సాధారణంగా దీనికి ఒక ఏగర్ వంటి జెల్‌ను ఉపయోగిస్తారు, భారీ-స్థాయి వర్ధనాలను ఒక పోషక రసంలో ఉన్న కణాలతో నిర్వహిస్తారు.

వైరస్ వర్ధన పద్ధతులు[మార్చు]

వైరస్‌ల యొక్క వర్ధనానికి పెరుగుదల మరియు వైరస్ ప్రతిరూపకల్పనకు ఆతిథేయులుగా ఉపయోగపడే క్షీరద, మొక్కల, శిలీంధ్ర లేదా బ్యాక్టీరియా మూలాలు గల కణాల వర్ధనాలు అవసరం అవతాయి. మొత్తం అటవీ రకం వైరస్‌లు, రీకాంబినెంట్ వైరస్‌లు లేదా వైరస్ ఉత్పత్తులను సరైన పరిస్థితుల్లో వాటి సహజ అతిథేయులకు బదులుగా ఇతర కణ రకాల్లో సృష్టిస్తారు. వైరస్ యొక్క జాతుల ఆధారంగా వైరస్ ప్రతిరూపకల్పన అతిథేయ కణం లైసిస్ మరియు ఒక వైరస్ ఫలకం సృష్టిలో ప్రతిఫలిస్తుంది.

సాధారణ కణ తంతువులు[మార్చు]

మానవ కణ తంతువులు
 • నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క 60 క్యాన్సర్ కణ తంతువులు
 • ESTDAB డేటాబేస్ http://www.ebi.ac.uk/ipd/estdab/directory.html
 • DU145 (ప్రొస్టేట్ క్యాన్సర్)
 • Lncap (ప్రొస్టేట్ క్యాన్సర్)
 • MCF-7 (రొమ్ము క్యాన్సర్)
 • MDA-MB-438 (రొమ్ము క్యాన్సర్)
 • PC3 (ప్రొస్టేట్ క్యాన్సర్)
 • T47D (రొమ్ము క్యాన్సర్)
 • THP-1 (వాస్తవ మైలోయిడ్ ల్యుకేమియా)
 • U87 (గ్లియోబ్లాస్టోమా)
 • SHSY5Y, మైలోమా నుంచి క్లోనింగ్ చేసిన హ్యూమన్ న్యూరోబ్లాస్టోమా సెల్స్
 • Saos-2 కణాలు (ఎముక క్యాన్సర్)
ప్రాగ్వానర (కోతిజాతి జంతువులన్నింటినీ కలిపి సూచించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు) కణ తంతువులు
 • వెరో (ఆఫ్రికా పచ్చ కోతి చ్లోరోసెబస్ కిడ్నీ ఎపిథీలియల్ సెల్ లైన్ ఇన్షియేటెట్ 1962)
ఎలుక కణిత కణ తంతువులు
 • GH3 (పిట్యూటరీ కణిత)
 • PC12 (ఫెయోక్రోమోసైటోమా)
చిట్టెలుక కణ తంతువులు
 • MC3T3 (ఎంబ్రయోనిక్ కాల్వారియాల్)
మొక్క కణ తంతువులు
 • పొగాకు BY-2 కణాలు (కణ వ్యాక్షేప వర్ధనంగా ఉంచబడిన, ఇవి మొక్క కణ నమూనా వ్యవస్థగా పరిగణించబడుతున్నాయి)
ఇతర జీవుల కణ తంతువులు
 • జీబ్రాఫిష్ ZF4 మరియు AB9 కణాలు.
 • మేడిన్-డార్బీ కానైన్ కిడ్నీ (MDCK) ఎపిథీలియల్ కణ తంతువు
 • జెనోపస్ A6 కిడ్నీ ఎపిథీలియల్ కణాలు.

కణ తంతువుల జాబితా[మార్చు]

అర్థం జీవి మూల కణజాలం స్వరూపశాస్త్రం లింకు
293-T మానవ మూత్రపిండం (ఎంబ్రయోనిక్) HEK 293 ECACC యొక్క ఉత్పన్నం
3T3 కణాలు "3-రోజుల బదిలీ, ఐనోకులమ్ 3 x 105 కణాలు" చిట్టెలుక ఎంబ్రయోనిక్ ఫైబ్రిబ్లాస్ట్ దీనిని NIH 3T3 ECACCగా కూడా గుర్తిస్తారు
721 మానవ పుట్టకరుపు
9L ఎలుక గ్లియోబ్లాస్టోమా
A2780 మానవ గర్భాశయం గర్భాశయ క్యాన్సర్ ECACC
A2780ADR మానవ గర్భాశయం అడ్రియామైసిన్-నిరోధక ఉత్పన్నం ECACC
A2780cis మానవ గర్భాశయం సిస్‌ప్లాటిన్-నిరోధక ఉత్పన్నం ECACC
A172 మానవ గ్లియోబ్లాస్టోమా ప్రాణాంతక గ్లియోమా ECACC
A20 చుంచెలుక B లింఫోమా B లింఫోసైట్
A253 మానవ తల మరియు మెడ క్యాన్సర్ సబ్‌మండిబ్యులార్ డక్ట్
A431 మానవ చర్మ ఉపతలం పొలుసుల క్యాన్సర్ ECACCసెల్ లైన్ డేటా బేస్
A-549 మానవ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉపతలం DSMZECACC
ALC చుంచెలుక ఎముక మజ్జ స్ట్రోమా PubMed
B16 చుంచెలుక పుట్టకరుపు ECCAC
B35 ఎలుక న్యూరోబ్లాస్టోమా ATCC
BCP-1 కణాలు మానవ PBMC HIV+ లింఫోమా ATCC
BEAS-2B బ్రోన్చియాల్ ఎపిథీలియం + అడెనోవైరస్ 12-SV40 వైరస్ హైబ్రిడ్ (Ad12SV40) మానవ ఊపిరితిత్తులు ఉపతల ATCC
bEnd.3 మెదడు లోపలి పొర చిట్టెలుక మెదడు / వెన్నెపాము లోపలి పొర ATCC
BHK-21 "చిన్న చిట్టెలుక మూత్రపిండ ఫైబ్రోబ్లాస్ట్ కణాలు" హామ్‌స్టెర్ (చిట్టెలుక) మూత్రపిండం ఫైబ్రోబ్లాస్ట్ ECACCఒలింపస్
BR 293 మానవ రొమ్ము రొమ్ము క్యాన్సర్
BxPC3 పాన్‌క్రియేటిక్ కార్సినోమా లైన్ 3 యొక్క బయోప్సీ జెనోగ్రాఫ్ మానవ పాన్‌క్రియేటిక్ అడెనోకార్సినోమా ఉపతల ATCC
C3H-10T1/2 చిట్టెలుక ఎంబ్రయోనిక్ మెసెన్‌చైమాల్ సెల్ లైన్ ECACC
C6/36 ఆసియా టైగర్ దోమ లార్వా కణజాలం ECACC
Cal-27 మానవ నాలుక పొలుసు కణ క్యాన్సర్
CHO చైనీయుల చిట్టెలుక గర్భాశయం హామ్‌స్టెర్ (ఒక రకమైన చిట్టెలుక) గర్భాశయం ఉపతలం ECACCICLC
COR-L23 మానవ ఊపిరితిత్తులు ECACC
COR-L23/CPR మానవ ఊపిరితిత్తులు ECACC
COR-L23/5010 మానవ ఊపిరితిత్తులు ECACC
COR-L23/R23 మానవ ఊపిరితిత్తులు ఉపతల ECACC
COS-7 కాస్సోపిథికస్ ఎథియోప్స్, ఆరిజన్-డిఫెక్టివ్ SV-40 ఏప్ - కార్సోపిథికస్ ఎథియోప్స్ (క్లోరోసెబస్) మూత్రపిండం ఫైబ్రోబ్లాస్ట్ ECACCATCC
COV-434 మానవ గర్భాశయం మెటాస్టాటిక్ గ్రాన్యులోసా సెల్ కార్సినోమా [2]ECACC
CML T1 క్రోనిక్ మైలోడ్ ల్యుకేమియా T-లింఫోసైట్ 1 మానవ CML ఎక్యూట్ ఫేజ్ T సెల్ ల్యుకేమియా రక్తం
CMT కానైన్ మమ్మరీ ట్యూమర్ శునకం క్షీర గ్రంథి ఉపతలం
CT26 చుంచెలుక కొలరెక్టాల్ కార్సినోమా కొలోన్
D17 కానైన్ ఓస్టెయోసార్సోమా ECACC
DH82 కానైన్ హిస్టియోసైటోసిస్ మోనోసైట్/మాక్రోఫేజ్ ECACCJ Vir Meth
DU145 మానవ ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివ్ కార్సినోమా ప్రొస్టేట్
DuCaP ప్రొస్టేట్ డ్యూరా మేటెర్ క్యాన్సర్ మానవ మేటాస్టాటిక్ ప్రొస్టేట్ క్యాన్సర్ ఉపతల PubMed
EL4 చిట్టెలుక T సెల్ ల్యుకేమియా ECACC
EM2 మానవ CML బ్లాస్ట్ క్రైసిస్ Ph+ CML లైన్ సెల్ లైన్ డేటా బేస్
EM3 మానవ CML బ్లాస్ట్ క్రైసిస్ Ph+ CML లైన్ సెల్ లైన్ డేటా బేస్
EMT6/AR1 చిట్టెలుక రొమ్ము ఉపతలం-మాదిరి ECACC
EMT6/AR10.0 చిట్టెలుక రొమ్ము ఉపతలం-మాదిరి ECACC
FM3 మానవ మెటాస్టాటిక్ లింఫ్ నోడ్ పుట్టకురుపు
H1299 మానవ ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల క్యాన్సర్
H69 మానవ ఊపిరితిత్తులు ECACC
HB54 హైబ్రిడోమా హైబ్రిడోమా సెక్రెటెస్ L243 mAb (HLA-DRపై) హ్యూమన్ ఇమ్యునాలజీ
HB55 హైబ్రిడోమా హైబ్రిడోమా సెక్రెటెస్ MA2.1 mAb (HLA-A2 మరియు HLA-B17పై) జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీ
HCA2 మానవ ఫైబ్రోబ్లాస్ట్ జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీ
HEK-293 హ్యూమన్ ఎంబ్రయోనిక్ కిడ్నీ మానవ కిడ్నీ (ఎంబ్రయోనిక్) ఉపతలం ATCC
HeLa హెన్రియెట్టా లాక్స్ మానవ గర్భాశయ క్యాన్సర్ ఉపతలం DSMZECACC
Hepa1c1c7 క్లోన్ 1 హెపాటోమా లైన్ 1 యొక్క క్లోన్ 7 చిట్టెలుక హెపాటోమా ఉపతల ECACCATCC
HL-60 హ్యూమన్ ల్యుకేమియా మానవ మైయెలోబ్లాస్ట్ రక్తకణాలు ECACCDSMZ
HMEC మానవ క్షీర గ్రంథి ఉపతల కణం మానవ ఉపతలం ECACC
HT-29 మానవ కోలాన్ ఉపతలం అడెనోకార్సినోమా ECACCసెల్ లైన్ డేటా బేస్
జుర్కాత్ మానవ T-సెల్-ల్యుకేమియా తెల్ల రక్త కణాలు ECACCDSMZ
JY కణాలు మానవ లింఫోబ్లాస్టోయిడ్ EBV అమర్త్య B కణం
K562 కణాలు మానవ లింఫోబ్లాస్టోయిడ్ CML బ్లాస్ట్ క్రైసిస్ ECACC
Ku812 మానవ లింఫోబ్లాస్టోయిడ్ ఎరైథ్రోల్యుకేమియా ECACCLGCస్టాండర్డ్స్
KCL22 మానవ లింఫోబ్లాస్టోయిడ్ CML
KG1 మానవ లింఫోబ్లాస్టోయిడ్ AML
KYO1 క్యోటో 1 మానవ లింఫోబ్లాస్టోయిడ్ CML DSMZ
LNCap ప్రొస్టేట్ లింఫ్ నోడ్ క్యాన్సర్ మానవ ప్రోస్టాటిక్ అడెనోకార్సినోమా ఉపతల ECACCATCC
Ma-Mel 1, 2, 3....48 మానవ పుట్టకురుపు కణ తంతువుల పరిధి
MC-38 చిట్టెలుక అడెనోక్యార్సినోమా
MCF-7 మిచిగాన్ క్యాన్సర్ ఫౌండేషన్-7 మానవ క్షీర గ్రంథి ఇన్వాసివ్ బ్రెస్ట్ డ్యుక్టాల్ కార్సినోమా ER+, PR+
MCF-10A మిచిగాన్ క్యాన్సర్ ఫౌండేషన్ మానవ క్షీర గ్రంథి ఉపతలం ATCC
MDA-MB-231 M.D. ఆండర్సన్ - మెటాస్టాటిక్ బ్రెస్ట్ మానవ రొమ్ము క్యాన్సర్ ECACC
MDA-MB-468 M.D. ఆండర్సన్ - మెటాస్టాటిక్ బ్రెస్ట్ మానవ రొమ్ము క్యాన్సర్ ECACC
MDA-MB-435 M.D. ఆండర్సన్ - మెటాస్టాటిక్ బ్రెస్ట్ మానవ రొమ్ము పుట్టకురుపు లేదా క్యాన్సర్ (వివాదాస్పదం) కేంబ్రిడ్జ్ పాథోలజీ ECACC
MDCK II మేడిన్ డెర్బీ కానైన్ కిడ్నీ శునకం మూత్రపిండం ఉపతలం ECACC ATCC
MDCK II మేడిన్ డెర్బీ కానైన్ కిడ్నీ శునకం మూత్రపిండం ఉపతలం [3] ATCC
MOR/0.2R మానవ ఊపిరితిత్తులు ECACC
MONO-MAC 6 మానవ WBC మైయెలాయిడ్ మెటాప్లాసిక్ AML సెల్ లైన్ డేటా బేస్
MTD-1A చిట్టెలుక ఉపతలం
మైఎండ్ మైయోకార్డియల్ ఎండోథీలియల్ చిట్టెలుక ఎండోథీలియం
NCI-H69/CPR మానవ ఊపిరితిత్తులు ECACC
NCI-H69/LX10 మానవ ఊపిరితిత్తులు ECACC
NCI-H69/LX20 మానవ ఊపిరితిత్తులు ECACC
NCI-H69/LX4 మానవ ఊపిరితిత్తులు ECACC
NIH-3T3 NIH, 3-డే ట్రాన్స్‌ఫర్, ఐనోకులమ్ 3 x 105 కణాలు చిట్టెలుక ఎంబ్రయో ఫైబ్రోబ్లాస్ట్ ECACCATCC
NALM-1 పెరిఫెరాల్ బ్లడ్ బ్లాస్ట్-క్రైసిస్ CML క్యాన్సర్ జెనెటిక్స్ అండ్ సైటోజెనెటిక్స్
NW-145 పుట్టకరుపు ESTDAB
OPCN / OPCT కణ తంతువులు Onyvax [4] ప్రొస్టేట్ క్యాన్సర్.... ప్రొస్టేట్ కణిత తంతువుల పరిధి ఆస్టెరాండ్
పీర్ మానవ T సెల్ ల్యుకేమియా DSMZ
PNT-1A / PNT 2 ప్రొస్టేట్ కణిత తంతువులు ECACC
RenCa నేత్రసంబంధ క్యాన్సర్ చిట్టెలుక నేత్రసంబంధ క్యాన్సర్
RIN-5F చిట్టెలుక పాన్‌క్రెయాస్
RMA/RMAS చిట్టెలుక T కణ కణిత
Saos-2 కణాలు మానవ ఆస్టెయోసార్సోమా ECACC
Sf-9 స్పోడోప్టెరా ఫ్రుగిపెర్డా ఇన్‌సెక్ట్ - స్పోడోప్టెరా ఫ్రుగిపెర్డా (మోత్) గర్భాశయం DSMZECACC
SkBr3 మానవ రొమ్ము క్యాన్సర్
T2 మానవ T సెల్ ల్యుకేమియా/B సెల్ లైన్ హైబ్రిడోమా DSMZ
T-47D మానవ క్షీర గ్రంథి డక్టాల్ కార్సినోమా
T84 మానవ కొలారెక్టాల్ కార్సినోమా / లంగ్‌మెటాస్టాసిస్ ఉపతలం ECACCATCC
THP1 కణ తంతువు మానవ మోనోసైట్ AML ECACC
U373 మానవ గ్లియోబ్లాస్టోమా-ఆస్ట్రోసైటోమా ఉపతలం
U87 మానవ గ్లియోబ్లాస్టోమా-ఆస్ట్రోసైటోమా ఉపతలం-మాదిరి Abcam
U937 మానవ ల్యుకేమిక్ మోనోసైటిక్ లింఫోమా ECACC
VCaP వెన్నుపూస ప్రొస్టేట్ క్యాన్సర్ మానవ మెటాస్టాటిక్ ప్రొస్టేట్ క్యాన్సర్ ఉపతల ECACC ATCC
వెరో కణాలు 'వెరా రెనో' ('గ్రీన్ కిడ్నీ') / 'వెరో' ('ట్రూత్') ఆఫ్రికన్ గ్రీన్ మంకీ (ఆఫ్రికా పచ్చ కోతి) మూత్రపిండ ఉపతలం ECACC
WM39 మానవ చర్మం ప్రాథమిక పుట్టకురుపు
WT-49 మానవ లింఫోబ్లాస్టోయిడ్
X63 చిట్టెలుక పుట్టకరుపు
YAC-1 చిట్టెలుక శోషరసపు కణుపు సెల్ లైన్ డేటా బేస్ ECACC
YAR మానవ B-కణం EBV ట్రాన్స్‌ఫ్రేమ్డ్ [5] హ్యూమన్ ఇమ్యునాలజీ

గమనిక: అందుబాటులో ఉన్న కణ తంతువుల నమూనాలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి, ఇక్కడ సమగ్ర వివరాలు లేవు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • జీవ అమరత్వం
 • కణ వర్ధన పరీక్షలు
 • ఎలక్ట్రిక్ సెల్-సబ్‌స్టెన్స్ ఇంపెడెన్స్ సెన్సింగ్
 • కాలుష్య కణ తంతువుల జాబితా
 • అవయవ వర్ధనం
 • మొక్క కణజాల వర్ధనం
 • కణజాల వర్ధనం

సూచనలు మరియు గమనికలు[మార్చు]

 1. ""Cell Culture"". Retrieved 2006-04-19.
 2. ""Some landmarks in the development of tissue and cell culture."". Retrieved 2006-04-19.
 3. ""Animals and alternatives in testing."". Retrieved 2006-04-19.
 4. షిఫ్, జుడిత్ ఎన్. ""An unsung hero of medical research."". Retrieved 2006-04-19.""An unsung hero of medical research."". Retrieved 2006-04-19. యాల్ అల్యూమ్నీ మేగజైన్ , ఫిబ్రవరి 2002.
 5. "LipiMAX purified lipoprotein solution from bovine serum". Selborne Biological Services. 2006. Retrieved 2010-02-02.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 8. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 9. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 10. 10.0 10.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 12. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 13. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 14. 14.0 14.1 డున్హామ్, J.H. మరియు గుత్‌మిల్లెర్, పి. (2008) డూయింగ్ గుడ్ సైన్స్: అథ్నిటికేటింగ్ సెల్ లైన్ ఐడెంటిటీ. సెల్ నోట్స్ 22 , 15–17.
 15. Ceb.com
 16. | రచయితలు = గావో డబ్ల్యూ, సోలోఫ్ ఏసీ, లు ఎక్స్, మోంటెకాల్వో ఎ, గుయెన్ డీసీ, మత్సోకా వై, రాబిన్స్ పీడీ, స్వైన్ డీఈ, డోనిస్ ఆర్వో, కాట్జ్ జేఎం, బ్యారాట్-బోయెస్ ఎస్ఎం, గ్యాంబోట్టో ఎ. | సంవత్సరం = 2006 | నెల = ఫిబ్రవరి | శీర్షిక = ప్రొటెక్షన్ ఆఫ్ మైస్ అండ్ పౌల్ట్రీ ఫ్రమ్ లీథల్ H5N1 ఏవియన్ ఇన్‌ఫ్యూయెంజా వైరస్ త్రూ ఎడెనోవైరస్-బేస్డ్ ఇమ్యునైజేషన్ | జర్నల్ = జర్నల్ ఆఫ్ వైరాలజీ | సంపుటి = 80 | సంచిక = 4 | పేజీలు = 1959–1964 | ప్రచురణకర్త = అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ | ప్రదేశం = అమెరికా సంయుక్త రాష్ట్రాలు | issn = 0022-538X | doi = 10.1128/JVI.80.4.1959-1964.2006 | url = http://jvi.asm.org/cgi/content/abstract/80/4/1959 | accessdate = 2010-01-31 }}
 17. "NIAID Taps Chiron to Develop Vaccine Against H9N2 Avian Influenza". National Institute of Allergy and Infectious Diseases (NIAID). 2004-08-17. Retrieved 2010-01-31.
 • Hpacultures.org.uk, హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కల్చర్ కలెక్షన్స్ (ECACC)
 • మ్యాక్‌లియోడ్, R. A. F. మరియు ఇతరులు (1999) : వైడ్‌స్ప్రెడ్ ఇంట్రాస్పీసెస్ క్రాస్-కాంటామినేషన్ ఆఫ్ హ్యూమన్ ట్యూమర్ సెల్ లైన్స్. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ 83 :555–563.
 • మాస్టర్స్, జాన్ ఆర్. (2002) : HeLa సెల్స్ 50 ఇయర్స్ ఆన్: ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ. నేచర్ రివ్యూస్ క్యాన్సర్ 2 :315-319.

బాహ్య లింకులు[మార్చు]

ఎండోటాక్సిన్ ఫ్రీ వాటర్ ఫర్ సెల్ కల్చర్స్

"https://te.wikipedia.org/w/index.php?title=కణ_వర్ధనం&oldid=2422563" నుండి వెలికితీశారు