కతిహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Katihar జిల్లా

कटिहार जिलाضلع کٹہار
Bihar లో Katihar జిల్లా స్థానము
Bihar లో Katihar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
పరిపాలన విభాగముPurnia
ముఖ్య పట్టణంKatihar
మండలాలు17
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKatihar
 • శాసనసభ నియోజకవర్గాలుKatihar, Kadwa, Balrampur, Pranpur, Manihari, Barari, Korha
విస్తీర్ణం
 • మొత్తం3,056 కి.మీ2 (1,180 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం30,68,149
 • సాంద్రత1,000/కి.మీ2 (2,600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత53.56 per cent
 • లింగ నిష్పత్తి916
ప్రధాన రహదార్లుNH 31, NH 81
జాలస్థలిఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో కతిహార్ జిల్లా (హిందీ:) ఒకటి. కతిహార్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా పుర్నియా డివిషన్‌లో భాగంగా ఉంది.

చరిత్ర[మార్చు]

1973లో పుర్నియా జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి కతిహార్ జిల్లా రూపొందించబడింది.[1] ఆరంభంలో కతియార్ చౌదరీల ఆధిక్యతలో ఉండేది. చౌదరీలు కోసీ ప్రాంతంలో పెద్ద భూస్వాములుగా ఉండేవారు. చౌదరీ కుటుబానికి ఆద్యుడు " ఖాన్ బహద్దూర్ చౌదరి మొహమ్మద్ బక్ష్ " ఆయన ఆధీనంలో 126 వ్యవసాయ కుటుంబాలు ఉండేవి. ఆయన 1936లో మరణించాడు. ఆయనకుటుంబానికి కతిహార్‌లో 15,000 ఎకరాల భూమి మరియు పూర్నియాలో 8,500 ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుతం ఆయన వారసులు చౌదరి తాజ్ మొహమ్మద్ మరియు చౌదరి మొహమ్మద్ అషరఫ్ ఇప్పటికీ భూస్వాములుగా ఉన్నారు. వారి హవేలీని తాజ్ దెహోరీ అంటారు. దేశవిభజనకు ముందు 1905లో కతిహార్ బెంగాల్ భూభాగంలో భాగంగా ఉండేది. విభజన తరువాత కతిహార్ బీహార్ రాష్ట్రంలో భాగం అయింది. బిహార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ సంస్కృతికంగా బెంగాల్‌తో సభంధం అధికంగా ఉంటుంది. జిల్లాలో దుర్గాపూజ ఘనంగా నిర్వహించబడుతుంది. "నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే"కు ఇది ఆరంభస్థానంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

కతిహార్ జిల్లా వైశాల్యం 3057 చ.కి.మీ.[2] ఇది కెనడా దేశంలోని అకిమిష్కి ద్వీపం వౌశాల్యానికి సమానం.[3]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కతిహార్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

రాజకీయం[మార్చు]

కతిహార్ పార్లమెంటరీ నియోజకవర్గం :- తారిక్ అంవర్, నిఖిల్ కుమార్ చౌదరీ, యోనుయిస్ సలిం, ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ (అపజయం). జిల్లా నుండి ప్రజలు స్వతంత్ర సమరంలో విస్తారంగా పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు " అల్హజ్ అఝర్ అలి " ఙాపకార్ధం ఆయన నివసించిన గ్రామానికి ఆయన పేరు నిర్ణయించబడింది.

ఉపవిభాగం[మార్చు]

జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : కతిహార్, బర్సొయి మరియు మనిహరి

  • కతిహార్ సబ్ డివిజన్లో మరో 10 బ్లాక్స్ ఉన్నాయి :- కతిహార్, కొర్హ, ఫల్క, సమెలి, బరారి, కుర్సెల, ప్రంపుర్, హసంగంజ్, దంద్ఖొర మరియు మన్సహి.
  • బర్సొయి సబ్ డివిజన్లో 4 బ్లాక్స్ ఉన్నాయి:  బర్సొయి, కద్వ, అజమ్నగర్ మరియు బలరామ్పూర్.
  • మనిహరి సబ్ డివిజన్లో 2 బ్లాక్స్ ఉంది : మనిహరి మరియు అందబద్
  • హసింగజ్ జిల్లాలో పెద్ద బ్లాకుగా ఉంది. ఇది జమీందారీ పాలనలో ఉంది. ఇది దివంగత జోగేంద్రరాయ్ చౌదరీ ఆధ్వర్యంలో ఉంది. ఇదులో స్కూల్, ఆలయం మరియు మార్కెట్ ప్రాంతాలను పౌల్ చౌదరి కుటుంబం దానంగా ఇచ్చింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,068,149,[5]
ఇది దాదాపు. ఓమన్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 117 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1004 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.23%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 916:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 53.56%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు ముస్లిములు అధికంగా ఉన్నారు.[5]
భాష బెంగాలీ, సుర్జాపురి, బర్సొలి (బెంగాలి స్థానిక భాష)

మూలాలు[మార్చు]

  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: Extra text: authors list (link)
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Akimiski Island 3,001km2 horizontal tab character in |quote= at position 16 (help)
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Oman 3,027,959 line feed character in |quote= at position 5 (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Iowa 3,046,355 line feed character in |quote= at position 5 (help)

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కతిహార్&oldid=2032178" నుండి వెలికితీశారు