కత్తి కార్తీక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కత్తి కార్తీక
Kathi Karthika.jpg
జననం (1981-01-04) 4 జనవరి 1981 (వయస్సు 40)
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత,నటి, నిర్మాత, ఆర్కిటెక్
క్రియాశీల సంవత్సరాలు2012-ప్రస్తుతం
పిల్లలుధృవ్
తల్లిదండ్రులు
  • భైరగౌని రామ్మోహన్ గౌడ్ (తండ్రి)
  • రవిజ్యోతి (తల్లి)

కత్తి కార్తీక ( భైరగౌని కార్తీక) తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, రేడియో జాకీ, ఆర్కిటెక్. కార్తీక వి6 ఛానల్ లో "దిల్ సే కార్తీక" కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందింది. 'బిగ్ బాస్ తెలుగు' రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.[1][2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కార్తీక హైదరాబాదులోనే పుట్టింది పెరిగింది. పదవ తరగతి వరకు సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ ఉన్నత విద్యను చదివిన కార్తీక, లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసింది. అటుతరువాత లండన్ లోనే ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది.........అమ్మా కార్తీక నీ దైర్యం,తెగువ ఈ నాడు మహిళల్లో వుంటే మహిళలు మేలుకోవాలి తమను తాము ఏలుకోవాలి సురక్షితంగా వుండాలన్న ఆలోచన వుంటే దుబ్బాక లో మహిళా ఓట్లు కేవలం మహిళలకే అన్న దృడ సంకల్పం వస్తే నీ గెలుపు సు సాధ్యం ,అలాగే నీ కమ్యూనిటీ ఓటు ఎల్లమ్మ సాక్షిగా పాపన్న పౌరుషం వారసత్వం నిజమే అని అనుకుంటే కుల గౌరవమే మా అందరి గౌరవం అని తలిస్తే కుల ద్రోహానికి పాల్పడక పోతే నీ విజయం నల్లేరు మీద నడకే.గౌడ ఐక్యత చాటాలని,గౌడ ఆడబిడ్డ గా నిన్ను గెలిపించుకునే మంచి మనస్సు గౌడ కల్పవృక్ష సంతత్కి కలగాలని ఆశిస్తూ నా మద్దతు మీకే కాదు మా గౌడ సమాజం కే వుంటుంది అనీ ..

వృత్తి జీవితం[మార్చు]

కార్తీక తొలుత రేడియో జాకీ గా పని చేసింది, తరువాత వి6 ఛానల్ లో వ్యాఖ్యాతగా చేరి మంచి పేరు సంపాదించుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.[4][5][6] మైక్ టీవిలో చేరి ముచ్చట విత్ కార్తీక అనే కార్యక్రమం చేసింది. 2017లో హైదరాబాదులోని బంజారా హిల్స్ లో బి స్టూడియోస్ పేరుతో సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోను ప్రారంభించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక టివి ఛానల్ లో చేరి తనదైన శైలిలో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసింది. 2019లో టీమ్ టీవి పేరిట యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది.

టీవి రంగం[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానల్ ఫలితాలు
2013-14 వీకెండ్ విత్ కార్తీక వ్యాఖ్యాత
2013-15 కత్తి కార్తీక ఎక్సక్లూసివ్ వ్యాఖ్యాత వి6 న్యూస్
2017 బిగ్ బాస్ 1 పోటిదారులు స్టార్ మా 9వ స్థానం - 42వ రోజు ఎలిమినేట్ అయ్యింది
2018 ముచ్చట విత్ కత్తి కార్తీక వ్యాఖ్యాత మైక్ టీవి

మూలాలు[మార్చు]

  1. "Bigg Boss Telugu: Jr NTR's TV show begins today, here is the list of celebrities who may enter the house". The Indian EXPRESS. Retrieved 2017-07-17. CS1 maint: discouraged parameter (link)
  2. https://www.firstpost.com/entertainment/bigg-boss-telugu-kathi-karthika-leaves-house-in-double-elimination-dhanraj-delighted-to-be-out-3981987.html
  3. ఆంధ్రజ్యోతి, సినిమా కబుర్లు (30 August 2017). "తారక్ అన్నకు ముఖం మీదే చెప్పేశా: కత్తి కార్తీక". www.andhrajyothy.com. Archived from the original on 12 సెప్టెంబర్ 2019. Retrieved 12 September 2019. CS1 maint: discouraged parameter (link)
  4. https://telanganatoday.com/melange-nature-tradition
  5. https://telanganatoday.com/bathukamma-songs-rule-roost-internet
  6. https://timesofindia.indiatimes.com/tv/news/telugu/madhu-priya-kathi-karthika-and-eight-other-contestants-to-share-all-about-their-life-on-lakshmi-manchus-new-show-maharani-today/articleshow/62581726.cms