Jump to content

కథువా జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 32°35′N 75°30′E / 32.583°N 75.500°E / 32.583; 75.500
వికీపీడియా నుండి
కథువా
జిల్లా
కతువా తూర్పున పర్వత ప్రాంతాలు
కతువా తూర్పున పర్వత ప్రాంతాలు
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా స్థానం
Coordinates (కథువా): 32°35′N 75°30′E / 32.583°N 75.500°E / 32.583; 75.500
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
ముఖ్య పట్టణంజమ్మూ
ప్రధాన కార్యాలయంకథువా
తహసీల్సుబాణి, భాషోలి, బిల్వార్, హరినగర్, కథువా, నగ్రీ పారోల్ , మార్హీన్, డింగా అమ్బ్, మహన్పూర్, లోహై మల్హార్, రామ్‌కోట్.
Government
 • జిల్లా మెజిస్ట్రెట్OP Bhagat
 •  లోక్‌సభ నియోజకవర్గాలుదోడా, ఉధంపూర్, కథువా
 • శాసనసభ నియోజకవర్గాలుకథువా పట్టణ, బసోలీ, బిల్వార్, బణి, హరినగర్
విస్తీర్ణం
 • మొత్తం2,651 కి.మీ2 (1,024 చ. మై)
జనాభా
 • మొత్తం6,16,435
 • జనసాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
 • Urban
14.6%
జనాభా
 • అక్షరాస్యత73.09%
 • లింగ నిష్పత్తి890
Time zoneUTC+05:30
Vehicle registrationJK-08
జాతీయ రహదారులుఎన్ఎచ్ 44 (పఠాన్ కోట్ -జమ్మూ), భదర్వా-బసోలి హైవే, బోర్డర్ రోడ్ (కథువా-బిష్నా)
సగటు వార్షిక అవపాతం921 సె.మీ (Annual-Billawar) mm
Websitehttps://kathua.nic.in/

జమ్మూ కాశ్మీరు రాష్ట్ర 20 జిల్లాలలో కథువా జిల్లా ఒకటి. జిల్లా తూర్పు సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, పడమర సరిహద్దులో పాకిస్థాన్ దేశ సరిహద్దులు, ఉత్తర సరిహద్దులో ఉధంపూర్, దోడా జిల్లాలు, దక్షిణ సరిహద్దులో పంజాబ్ రాష్ట్రం, ఈశాన్య సతిహద్దులో జమ్మూ జిల్లా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

కథువా ప్రాంతం గురించి లిఖితపూర్వక ఆధారాలు లేవు. 2,000 సంవత్సరాల పూర్వం అందోత్రా వంశానికి చెందిన జోద్‌సింగ్ హస్తినాపురం నుండి ఈ ప్రాంతానికి వసల వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆయన ఇక్కడ తన ముగ్గురు కుమారులైన తేజు, కిండల్, బిజు తమ పేరుమీదుగా తేజ్వాల్, మంజలి, బిజ్వాల్ గ్రామాలను స్థాపించారు. ఈ గ్రామాల పేత్లతో ప్రస్తుతం అందోత్రా ఉప శాఖలుగా తేజ్వాలియా, బిజ్వాలియా, ఖాంవాలియా రాజపుత్ర వంశాలు ఆవిర్భవించాయి. ఈ మూడు గ్రామాలను కలిపి కతై అని పిలువబడ్డాయి. అవే కాలక్రమేణా కథువాగా మారింది.

గ్రీకుల వర్ణన

[మార్చు]

గ్రీక్ చరిత్రకారుల కొన్ని వర్ణనలు పురాతన జమ్మూ పర్వతాల గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాయి. అందులో అలెగ్జాండర్ భారతదేశం మీద దండేత్తిన సమయంలో ఈ ప్రాంతంలో శక్తివంతమైన అభిసారా (ప్రస్తుత పూంచ్) కథైయో రాజ్యాలు ఉన్నాయన్న ప్రస్తావన ఉంది. ఆసమయంలో స్ట్రాబో వర్ణిచిన కథైయో శక్తివంతమైన స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఇది పర్వతపాదాలలో రావీనదీ తీరంలో విస్తరించి ఉంది. కథైయో భూవర్ణన ప్రస్తుత కథువా ప్రాంతానికి సరిపోతుంది. స్ట్రాబో ఈ ప్రాతపు వీరులు ధైర్యసాహసాలు కలవారని గ్రీకు వీదులతో వారు వీరోచితంగా పోరాడారని వారిని జయించడానికి వారు చాలా శ్రమపడ్డారని వర్ణించాడు.

సందర్శించిన వారు

[మార్చు]

కథువాను పాండవులు సందర్శిచారని విశ్వసిస్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి జాంబవంతుని కలిసాడని కథనాలు వర్ణిస్తున్నాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ జాంబవంతునితో యుద్ధంచేసి శమంతకమణిని ( ప్రస్తుత కోహినూర్ వజ్రం) తిరిగి పొందాడని పురాణ కథనాలు వివరిస్తున్నయి.

సరిహద్దులు

[మార్చు]

పాకిస్థాన్ దేశానికిది సమీపంలో ఉన్నందున స్వతంత్రం వచ్చిన నాటి నుండి కథువా జిల్లాలో భారతీయ సైన్యాలు తురిగుతూ ఉండడం కనిపిస్తుంది. ఇక్కడ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో భారతీయ సైన్యాలు ఇక్కడ దీర్ఘకాలం బసచేసాయి. వీరిలో కొందరు " లష్కర్ - ఇ - తైబ " ఉద్యమ కారులు కూడా ఉన్నారు. పాకిస్థాన్ నుండి భారతభూమిలో చొరబాటు ఇక్కడి సమస్యలలో ఒకటి.[1]

ఉగ్రవాదుల దాడులు

[మార్చు]

1980లో ఈ ప్రాంతంలో పలు ఉగ్రవాదదాడులు జరుగాయి. 2002 మార్చి కథువాలోని ఒక ఆలయంలో 10 మంది ఉగ్రవాదుక దాడిలో దుర్మరణానికి గురైయ్యారు, మే మాసంలో బసు మీద జరిగిన దాడి, సైనిక నివాసాల మీద జరిగిన దాడిలో 32 మంది మరణించారు. జూలై 20న క్వాసిం నగర్ వద్ద జరిగిన దాడిలో 29 మంది మతణించారు, సెప్టెంబరు 12 హరానగర్ మోర్త్ వద్ద బస్ మీద జరిగిన దాడిలో 12 మంది మరణించారు.[2] 2003లో కథువా జిల్లా ఆసుపత్రి ముందు చి.ఆర్.పి.ఎఫ్ క్యాంప్ మీద జరిగిన దాడిలో 2 మంది మరణించారు. 2008 దాడి .[3] 2013లో ఉగ్రవాదులు పోలీస్ స్టేషను, పౌరులు, చంబా సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసారు.[3][3][4]

బసొహిల్ పెయింటింగ్స్

[మార్చు]

బాసోహిల్ ఇది కథువా జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడి పెయింట్ంగ్స్ ఈ ప్రాంతమంతా గుర్తిపుపొందాయి. వివిధ రకాలైన నైపుణ్యంతో తయారయ్యే ఈ చిత్రాలు అసమానమైన ప్రత్యేకత కలిగి ఉన్నాయి. కళాత్మకమైన వ్యూహాత్మకమైన ఈ పెయింటిగులు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇవి 18-19 శతాబ్దంలో హిమాలయ పాదపర్వతాలు, జమ్మూ, పంజాబీ శైలిని ప్రబింబించే ఈ చిత్రాల రూపకల్పనకు ప్రైమరీ వర్ణాలను ఉపయోగిస్తున్నారు. ఈ శైలి చిత్రాలు ముందు బసోహ్లిలో ప్రారంభం అయ్యాయి. తరువాత ఈ చిత్రాల శైలి మాన్‌కోట్, నూరుర్, కులు, మండి, సుకేత్, బిలాస్‌పుర్, నలగర్, చంబా, గులర్, కాంగ్రా వంటి హిల్ ప్రదేశాలలో వ్యాపించాయి. 1921లో " ఆకియాలజీ సర్వే ఆఫ్ ఇండియా " వార్షిక నివేదికలో బసొహ్లి పెయింటింగుల గురించి ప్రస్తావన మొదటిసారిగా వెలువడింది.

పాలన

[మార్చు]

కథువా జిల్లా 8 బ్లాకులుగా విభజించబడింది: బిలావర్, బంషోలి, బని, దుగ్గన్, లోహి మల్హర్, కథువా, బర్నోటి, హరినగర్ .[5] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.

  • కథువా జిల్లా 5 తెహ్సిల్స్‌గా విభజించబడింది:
  • కథువా తెహ్సిల్
  • హరినగర్ తెహ్సిల్
  • బిల్లావర్ తెహ్సిల్
  • బసోహ్లి తెహ్సిల్
  • బని తెహ్సిల్

రాజకీయాలు

[మార్చు]

కథువా జిల్లాలో 5 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: బని, బసోహ్లి, కథువా, బిలావర్, హరినగర్.[6]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 615,711, [7]
ఇది దాదాపు. సోలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 521వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 232 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.38%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 877:1000 [7]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 73.5%.[7]
జాతియ సరాసరి (72%) కంటే. స్వల్పంగా అధికం

కథువా జిల్లా భూభాగం వైవిధ్యం కలిగి ఉంది. పంజాబ్, జమ్మూ కాశ్మీరు సరిహద్దులో సుసంపన్నమైన వ్యవసాయభూములు ఉన్నాయి. కథువా జిల్లాలో ప్రధానభాష దోగ్రి. జిల్లా తూర్పు భూభాగంలో ఉన్న పర్వత ప్రాంతాలలో పహారీ భాష వాడుకలో ఉంది. విద్యావిధానంలో ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాష వాడుకలో ఉంది. ముస్లిములు అధికంగా ఉన్న జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో కథువా జిల్లాలో మాత్రం జమ్మూ జిల్లాలో వలె అధికంగా హిదువులు 91%, ముస్లిములు 7%, 2% ఉన్నారు. పరిసర ప్రాంతాలలో ఉన్న ఉద్రిక్తతల కారణంగా కథువాలో ఒక దశాబ్ధకాలం ఉద్రిక్తతలు కొనసాగాయి. పంజాబ్ రాష్ట్రంలో తలెత్తిన ఖలిస్తాన్ ఉద్యమం 1990 వరకు కొనసాగింది. ఇది జిల్లా దక్షిణ భూభాగంలో ప్రభావం చూపింది. 1880లో కాశ్మీరు ఆరంభమైన ఉద్రిక్తతలు జిల్లా ఉత్తర భూభాగంలో కొంత ప్రభావం చూపింది.

మూలాలు

[మార్చు]
  1. Kak. M. L. (29 August 2001). "Kathua next target of ultras ISI shifts officer to Sialkot Sector". The Tribune. Chandigarh, India. Archived from the original on 18 జనవరి 2002. Retrieved 7 జనవరి 2020.
  2. Sharma, S. P. (1 October 2002). "Attack shows chinks in police set-up". The Tribune. Chandigarh, India. Archived from the original on 21 December 2002.
  3. 3.0 3.1 3.2 Singh, Ajit Kumar (2013). "J&K: Escalating Failures". South Asia Intelligence Review: Weekly Assessments & Briefings. 12 (13). Archived from the original on 8 జనవరి 2014. Retrieved 30 జూన్ 2014.
  4. Hassan, Ishfaq ul (26 September 2013). "All three ultras in J&K terror attack killed, search operations over". DNA (Diligent Media Corporation). Archived from the original on 8 January 2014.
  5. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  6. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741

సరిహద్ధులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]