కదిర్ రానా
| కదిర్ రానా | |||
| |||
| పదవీ కాలం 2009-2014 | |||
| ముందు | చౌదరి మన్వర్ హసన్ | ||
|---|---|---|---|
| తరువాత | సంజీవ్ బల్యాన్ | ||
| నియోజకవర్గం | ముజఫర్‌నగర్ | ||
| పదవీ కాలం 2007-2009 | |||
| ముందు | రాజ్‌పాల్ సింగ్ సైని | ||
| తరువాత | మిథిలేష్ పాల్ | ||
| నియోజకవర్గం | మోర్నా | ||
| పదవీ కాలం 1998-2004 | |||
| నియోజకవర్గం | సహారన్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1961 November 9 సుజ్రు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | (2021[1]-ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2004-2006)
రాష్ట్రీయ లోక్‌దళ్ (2006-2008) బహుజన్ సమాజ్ పార్టీ (2008-2021) | ||
| జీవిత భాగస్వామి | సయదా బేగం | ||
| సంతానం | 6 | ||
| మూలం | [1] | ||
కదిర్ రానా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కదిర్ రానా సమాజ్‌వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో సహారన్‌పూర్ స్థానం నుండి ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2007 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మోర్నా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కదిర్ రానా 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌ఎల్‌డి అభ్యర్థి అనురాధ చౌదరిపై 20,598 ఓట్ల మెజారిటీతో గేలిక్ తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజీవ్ బల్యాన్ చేతిలో 4,01,150 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
వివాదాలు
[మార్చు]కదిర్ రానా 2013 ముజఫర్ నగర్ మత అల్లర్ల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిని స్వచ్ఛందంగా గాయపరచడం, దోపిడీ, హత్యాయత్నం, ఇళ్లను ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా పేలుడు పదార్థాలను ఉపయోగించడం, హత్య, అల్లర్లు, మారణాయుధాలతో అల్లర్లు చేయడం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం, అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టే ద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు ఐపిసిలోని వివిధ తీవ్రమైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసుల్లో నమోదయ్యాయి.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Former BSP MP Kadir Rana Joins Samajwadi Party Ahead Of UP Assembly Polls" (in ఇంగ్లీష్). NDTV. 17 October 2021. Archived from the original on 30 November 2022. Retrieved 12 June 2025.
- ↑ "Kadir Rana Lok Sabha Profile". Lok Sabha. Archived from the original on 9 August 2016. Retrieved 20 June 2016.
- ↑ "Lok Sabha Elections 2019: How political families of west UP have charted their course". Hindustan Times. 1 April 2019. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.
- ↑ "Riot-accused BSP MP to face wife in Muzaffarnagar seat". Deccan Herald. 19 March 2014. Retrieved 20 June 2016.
- ↑ "Muzaffarnagar riots: 10 Muslim leaders chargesheeted by SIT". The Economic Times. 8 March 2014. Archived from the original on 9 March 2014. Retrieved 20 June 2016.
- ↑ "Muzaffarnagar riots: BSP MP surrenders, sent to 14-day judicial custody". Livemint. 17 December 2013. Retrieved 20 June 2016.