కదిలే రాళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేస్ ట్రాక్ ప్లయలో కదిలే బండ.

జరిగే రాళ్లు లేదా కదిలే రాళ్లు (Sailing Stones) ఒక భూవిజ్ఞాన శాస్త్ర సంబంధి దృగ్విషయంగా చెబుతున్నారు. అంటే మనుషులు లేదా జంతువుల ప్రమేయం లేకుండా ఒక నిరంతరాయ లోయ నేల వెంబడి సుదూర మార్గాల్లో రాళ్లు కదలడం. ఇలాంటి కదిలే రాళ్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ప్రయాణ గాడుల యొక్క సంఖ్య మరియు దూరాన్ని గుర్తించిన రేస్‌ట్రాక్ ప్లేయా, డెత్ వ్యాలీ చుట్టుపక్కల ఉన్న అసంఖ్యాక ప్రదేశాల్లో నమోదు చేయడం మరియు వాటిపై అధ్యయనం చేయడం జరిగింది. అయితే వాటి గమనం వెనుక గల శక్తి మాత్రం అవగతం కాలేదు. అందువల్ల వాటిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

రేస్‌ట్రాక్ రాళ్లు ప్రతి రెండు లేదా మూడేళ్లకు మాత్రమే కదులుతాయి. అనేక మార్గాలు (గాడి వంటి చారలు) మూడు లేదా నాలుగేళ్ల కాలంలో స్పష్టంగా గోచరిస్తాయి. దిగువ భాగం గరుకుగా ఉండే రాళ్లు నిటారైన పొడవాటి మార్గాలను ఏర్పరుస్తాయి. అదే దిగువ నునుపుగా ఉండే రాళ్లు ఊరికే పరిభ్రమిస్తుంటాయి. రాళ్లు కొన్నిసార్లు తిరగబడి, భూమిపై మరో అంచుతో నిలబడుతాయి. తద్వారా రాతి యొక్క గమనంలో ఒక భిన్నమైన మార్గం ఏర్పడుతుంది.

గతి మరియు పొడవు పరంగా జరిగే (జారే) రాళ్ల జాడలు అస్థిరంగా ఉంటాయి. ఒక దాని వెంట ప్రయాణించే కొన్ని రాళ్లు సమాంతరంగా కదలడం ప్రారంభిస్తాయి. అయితే వాటిలో ఒకటి ఆకస్మికంగా దాని గతిని ఎడమ, కుడి లేదా చివరకు అది వచ్చిన దిశకే వెనుకకు మరలొచ్చు. దూరం కూడా మారుతుంది. అందుకు కారణం ఒకే పరిమాణం మరియు ఆకారం ఉన్న రెండు రాళ్లు ఏకరీతిగా ప్రయాణించగలగడం. అందువల్ల వాటిలో ఒకటి దాని మార్గంలో ముందుగా పగలడం లేదా ఆగిపోవడం జరగొచ్చు.

వర్ణన[మార్చు]

ట్రాక్ లు ఒక్కోసారి అనేక పరిమాణాల్లో ఉంటాయి

పలు సందేహాస్పద జారే (పాకే) రాళ్లు సింకు (జలదారి) యొక్క దక్షిణ కొనపై ముదురు డోలమైట్‌తో ఏర్పడిన ఒక 850 అడుగుల (260 m) ఎత్తైన కొండభాగం నుంచి పుట్టినట్లు భావించబడుతోంది. అయితే వాటిలో కొన్ని రాళ్లు సమీప వాలుల (వాటిలో అత్యధిక రాళ్లు లేత గోధుమ రంగుతో భూస్ఫటికం మాదిరిగా కన్పించే అగ్నిశిలగా ఉంటాయి) నుంచి పుట్టిన ఆగంతుక అగ్నిశిలలుగా చెప్పబడుతున్నాయి. రాతి జాడలు తరచూ వేలాది అడుగుల దూరం, కొన్ని అంగుళాల నుంచి 12 అంగుళాల (8 నుంచి 30 cm) వెడల్పు ఉంటాయి. అయితే సాధారణంగా వాటి లోతు మాత్రం ఒక అంగుళం (2.54 cm) కంటే తక్కువగా ఉంటుంది.

రాళ్ల గమనానికి విశిష్ట పరిస్థితుల సమతుల్యత అవసరమవుతుందని భావించబడుతోంది: అవి

  • ఇప్పటివరకు వరదలకు గురికాని ఒక సంతృప్త (గరిష్ఠ) ఉపరితలం
  • ఒక మందపాటి బంకమట్టి పొర
  • శక్తిని కలిగించే చాలా బలమైన గాలితెరలు మరియు
  • రాళ్ల గమనం నిరంతరాయంగా కొనసాగేలా బలమైన స్థిర పవనం

పరిశోధనా చరిత్ర[మార్చు]

రేస్ ట్రాక్ ప్లయలో రెండు బండలు.

భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు జిమ్ మెక్‌అల్లిస్టర్ మరియు అలెన్ ఆగ్‌న్యూ 1946లో ఒక ప్రాంతం యొక్క రాతిమట్టం మరియు రాతి జాడలను గుర్తించారు. తర్వాత నేషనల్ పార్క్ సర్వీస్‌కి చెందిన ప్రకృతిప్రియులు అత్యంత సమగ్ర వర్ణనలను రాశారు. అలాగే లైఫ్ సంచిక రేస్‌ట్రాక్‌కు సంబంధించిన ఒక జత ఛాయాచిత్రాలను ముద్రించింది. అదే సమయంలోనే రాళ్లు ఎలా కదులుతున్నాయనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. వివిధ కొన్నిసార్లు విలక్షణమైన సాధ్యపర వివరణలు కొన్నేళ్లుగా ఆవిష్కృతమయ్యాయి. వాటిలో అతీంద్రియమైనవి మొదలుకుని అత్యంత క్లిష్టమైనవి వరకు ఉండటం గమనార్హం. అయితే మట్టి తడిగా ఉన్నప్పుడు బలమైన గాలులు వీచడం రాళ్ల కదలికకు కొంత వరకు పాక్షికంగా కారణమై ఉండొచ్చని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 1955లో ఇదే అంశంపై ఒక రచనను ముద్రించిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త జార్జ్ M. స్టాన్లీ వంటి కొంతమంది పరిశోధకులు మానవుడి మాదిరిగా బరువుండే కొన్ని రాళ్లు ఒక ప్రాంతంలోని గాలికి చలించేటంత తేలికగా లేవని అభిప్రాయపడ్డారు. రాళ్ల చుట్టూ ఉండే మంచు పలకలు గాలిని పట్టుకోవడంలో లేదా మంచు పొరల్లో కదిలే విధంగా సాయపడి ఉండొచ్చని వారు చెప్పుకొచ్చారు.

బాబ్ షార్ప్ మరియు వైట్ కేరీలు మే, 1972లో ఒక రేస్‌ట్రాక్ రాతి కదలిక పర్యవేక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎట్టకేలకు తాజా చారలు ఉన్న ముప్పై రాళ్లు గుర్తించబడ్డాయి. అలాగే వాటి లొకేషన్లను గుర్తించడానికి గుంజలను ఉపయోగించారు. ప్రతి రాతికి ఒక పేరును ఇవ్వడం మరియు రాతి స్థితిలో మార్పులను ఏడేళ్ల కాలంలో నమోదు చేశారు. ఎంపికచేసిన రాళ్లను సేకరించడం ద్వారా షార్ప్ మరియు కేరీ ఇద్దరూ కూడా మంచు పొర పరికల్పనను పరీక్షించారు. ఒక దొడ్డిని 5.5 అడుగుల (1.7 m) వ్యాసం, 3 అంగుళాల (7.5 cm) వెడల్పు, 1 పౌండ్ (0.5 kg) బరువు గల మార్గం-తయారీ రాయి చుట్టూ ప్రత్యేకంగా ఏడు ఉక్కు కమ్మీ భాగాలతో 25 నుంచి 30 అంగుళాల (64 to 76 cm) తో తయారు చేశారు. రాళ్ల చుట్టూ ఉన్న ఏదైనా ఒక మంచు పలక గాలిని పట్టుకునే ఉపరితల ప్రాంతాన్ని పెంచడం లేదా రాళ్లను మంచు పొరల వెంట లాక్కెళ్లడం ద్వారా అవి కదిలేలా సాయపడటం చేస్తే, అప్పుడు ఉక్కు కమ్మీ వాటి గమనాన్ని కనీసం నెమ్మది చేయడం లేదా గతి తప్పించడం చేయాలి. అలాంటిది సంభవించడం కన్పించకపోగా, రాయి ఉక్కు కమ్మీ నుంచి ఏదో కొద్దిగా తప్పుకుంది. తొలి శీతాకాలంలో అది దొడ్డికి వాయివ్య దిశగా 28 అడుగులు (8.5 m) కదిలింది. అదే సమయంలో దొడ్డిలో ఉంచిన రెండు అత్యంత బరువైన రాళ్లలో ఒకటి మొదటగా ఐదేళ్ల తర్వాత అదే దిశలో కదిలింది. అయితే దాని సహచర రాయి అధ్యయన కాలంలో అసలు కదలనే లేదు. రాతి కదలికలో మంచు గనుక పాత్ర పోషిస్తే, అప్పుడు రాళ్ల చుట్టూ ఉండే మంచు మాలికలు తప్పక చిన్నవిగా ఉండాలని ఇది సూచించింది.

క్రింద కదిలే బండల మార్గం యొక్క మిల్కీ వే దృశ్యం. కుడి వైపు వున్నా బండను గమనించుము.

మొదటి ఇరవై ఐదు రాళ్లలోని పది తొలి శీతాకాలంలో కదిలాయి. వాటిలో మేరీ అన్ (రాయి A) గరిష్ఠంగా 212 అడుగులు (64.5 m) కదిలింది. తదుపరి ఆరు పర్యవేక్షక శీతాకాలాల్లోని రెండింటిలోనూ పలు రాళ్లు కదలడం గుర్తించబడింది. అయితే వేసవిలో రాళ్లు కదిలినట్లు ధ్రువీకరించబడలేదు. అదే విధంగా కొన్ని శీతాకాలాల్లో కొన్ని రాళ్లు మాత్రమే కదిలాయి. చివర్లో అన్నీ అయితే పర్యవేక్షించిన ముప్పై రాళ్లలో రెండు ఏడేళ్ల అధ్యయన కాలంలో కదిలాయి. 2.5 అంగుళాల (6.5 cm) వ్యాసం కలిగిన నాన్సీ (రాయి H) అత్యల్పంగా పర్యవేక్షించబడిన రాయి. ఇది కూడా దీర్ఘతమ సంచిత దూరం, 860 అడుగులు (262 m) కదిలింది. అత్యధిక ఏకైక శీతాకాల గమనంగా, 659 అడుగులు (201 m) నమోదైంది. కదిలిన అతిపెద్ద రాయి యొక్క బరువు 80 పౌండ్లు (36 kg).

కరెన్ (రాయి J) అనేది ఒక 29/19/20 అంగుళాల (74/48/51 cm) డోలమైట్ బండ. దీని బరువు సుమారు 700 పౌండ్లు (సుమారు 320 kg) అని అంచనా. బహుశా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేకుండా కరెన్ పర్యవేక్షణ సమయంలో కదలలేదు. ఈ రాయి తడి సింకుపై అది ప్రాథమికంగా పడటం ద్వారా పొందిన వేగగతితో 570 నిటారైన మరియు పాత మార్గాన్ని ఏర్పరిచి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ, కరెన్ మే, 1994 ముందు ఓ సమయంలో కనిపించకుండా పోయింది. సంభవనీయంగా 1992 నుంచి 1993 మధ్య కాలంలోని అసాధారణమైన తడి శీతాకాలంలో అది జరిగి ఉండొచ్చు. కృత్రిమ భావాల తిరస్కృతి ద్వారా సింకుకు అనుబంధ నష్టం లేమి వల్ల బహుశా అలా జరిగి ఉండొచ్చని భావించారు. కరెన్‌ రాయిని 1994లో సింకుకు అర మైలు (800 m) దూరంలో గుర్తించడం జరిగింది. శాన్ జోస్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త పౌలా మెస్సినా 1996లో కరెన్‌‍ను తిరిగి గుర్తించారు.[1]

1995లో చేపట్టిన కొనసాగింపు అధ్యయనానికి హంప్షైర్ కళాశాలకు చెందిన ఆరుగురు పరిశోధన విద్యార్థులు మరియు మస్సాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జాన్ రీడ్ నేతృత్వం వహించారు. వారు 1980ల ఆఖర్లో మరియు 1992-1993 శీతాకాలంలో కదిలిన రాళ్ల యొక్క అత్యంత అనురూప మార్గాలను గుర్తించారు. కనీసం కొన్ని రాళ్లు నిస్సందేహంగా మంచు పొరల్లో సుమారు అర మైలు (800 m) విస్తీర్ణం వరకు కదిలినట్లు నిరూపితమైంది. భౌతికపరమైన ఆధారంగా చారల ప్రాంతాల యొక్క మార్గాలు కన్పించాయి. అవి పలచని మంచు పలకల గమనం ద్వారా మాత్రమే ఏర్పడి ఉండొచ్చని భావించారు. కాబట్టి గాలి ఒక్కటే అదే విధంగా మంచు పొరలతో కలిసి ఛోదక శక్తులుగా పనిచేయవు.

స్ ట్రాక్ ప్లయలో ఇంకో కదిలే బండ.

1995లో ఈ దృగ్విషయంపై అధ్యయనం చేపట్టిన భౌతిక శాస్త్రవేత్తలు సింకు ఉపరితలాలపై వీచిన గాలులు సంగ్రహించబడటం మరియు తీవ్రమై ఉంటాయని గుర్తించారు. ఈ ఉపరితలాలపై ఉండే సరిహద్దు పొరలు (భూ పగుళ్ల కారణంగా గాలులు నెమ్మదిగా వీచే భూమిపై ఉండే ప్రాంతం) సాధ్యమైనంత తక్కువగా 2 అంగుళాలు (5 cm) ఉండొచ్చని కూడా వారు గుర్తించారు. అంటే కొన్ని అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న రాళ్లు చుట్టూ వ్యాపించిన గాలులు మరియు వాటి తెరల యొక్క సంపూర్ణ బలాన్ని పొందుతాయని అర్థం. శీతాకాల తుఫాన్లలో ఇది 90 mph (145 km/h) వరకు చేరుకుంటుంది. అలాంటి గాలితెరలు బలాన్ని కలిగిస్తాయి. తద్వారా గతివేగం మరియు స్థిరమైన గాలులు రాళ్లు కదిలే విధంగా చేస్తాయి. సంభవనీయంగా సాధ్యమైనంత మితమైన వేగం (ఒక రాయి కదలడం ప్రారంభించడానికి అవసరమైన బలంలో సగం మాత్రమే) దానిని గమనంలో ఉంచడానికి అవసరమవుతుంది.

గాలి మరియు మంచు రెండూ ఈ మర్మమైన జరిగే రాళ్లకు ముఖ్యమైన దృగ్విషయంగా చెప్పబడుతాయి. డాన్ J.ఈస్టర్‌బ్రూక్ యొక్క "సర్ఫేస్ ప్రాసెసస్ అండ్ ల్యాండ్‌ఫామ్స్"లో గుర్తించినట్లుగా, కొన్ని రాతి మా్ర్గాల మధ్య సమాంతర మార్గాలు లేనందున ఇది మంచు విచ్ఛిన్నత కారణంగా సంభవించవచ్చు. ఫలితంగా అవి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తాయి. మంచు చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయినప్పటికీ, రాళ్లు కదలడానికి ఇప్పటికీ అది అవసరమే.

సూచనలు[మార్చు]

  • మెస్సిన, P., 1998, ది స్లైడింగ్ రాక్స్ అఫ్ రేస్ ట్రాక్ ప్లయ, డెత్ వాలి నేషనల్ పార్క్, కాలిఫోర్నియా: ఫిజికల్ అండ్ స్పేషియల్ ఇంఫ్లుఎంసేస్ ఆన్ సర్ఫేస్ ప్రాసెస్ . డాక్టోరల్ డిస్సర్టేషన్ ప్రచురణ, భూమి మరియు పరియావరణ విభాగ శాస్రం, న్యూ యార్క్ సిటి విశ్వవిద్యాలయం, న్యూ యార్క్. యునివర్సిటీ మైక్రోఫిల్మ్స్, ఇన్కోపరేటెడ్, 1998.
  • మెస్సిన, P., స్టోఫ్ఫర్, P., మరియు క్లార్క్, K. C. మాపింగ్ డెత్ వాలిస్ వాన్దరింగ్ రాక్స్. GPS వరల్డ్ ఏప్రిల్, 1997: పే. 34-44
  • షార్ప్, R.P., మరియు A.F. గ్లేజియర్, 1997, జియోలజి అండర్ఫుట్ ఇన్ డెత్ వాలి అండ్ ఓవెన్స్ వాలి . మౌంటైన్ ప్రెస్ పుబ్లిషింగ్ కంపెనీ, మిస్సౌల. ISBN 0-517-05934-7.
  • స్టాన్లే, G. M., 1955, ఆరిజిన్ అఫ్ ప్లయ స్టన్ ట్రాక్స్, రేస్ ట్రాక్ ప్లయ, ఇన్యో కౌంటీ, కాలిఫోర్నియా . జియోలజి సొసైటి అఫ్ అమెరికా బుల్లెటిన్, సం. 66, పే. 1329-1350.
  • రీడ్, J.B., Jr., బక్లిన్, E.P., కోపనగిల్, L., కిడ్దర్, J., ప్యాక్, S. M., పోలిస్సర్, P.J., మరియు విలియమ్స్, M. L., 1995, స్లైడింగ్ రాక్స్ ఏట్ ది రేస్ ట్రాక్, డెత్ వాలి: వాట్ మేక్స్ దెం మూవ్? . జియోలాజీ, v. 16, p. 649-653.
  • షార్ప్, R.P., కారే, D. L., రీడ్, J.B., Jr., పోలిస్సర్, P.J., మరియు విలియమ్స్, M.L., 1996, స్లైడింగ్ రాక్స్ ఏట్ ది రేస్ ట్రాక్, డెత్ వాలి: వాట్ మేక్స్ దెం మూవ్? ; చర్చ మరియు సమాధానం. జియోలాజీ, స. 16, పే. 649-653.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:Death Valley