కనకమామిడి స్వామిగౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనకమామిడి స్వామిగౌడ్
K Swamy Goud.jpg
జననం (1954-07-05) 1954 జూలై 5 (వయస్సు: 65  సంవత్సరాలు)
కిస్మత్‌పూర్ గ్రామం, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తితెలంగాణ శాసన మండలి ఛైర్మన్.
ప్రసిద్ధులుతెలంగాణ ఉద్యమకారులు
జీవిత భాగస్వామిమనోరమ

కనకమామిడి స్వామిగౌడ్ (జ. 1954 జూలై 5) భారత రాజకీయ కార్యకర్త, తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్. టి.ఎన్.జి.వో. మాజీ అధ్యక్షుడు[1], తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా పనిచేశాడు.[2][3][4] తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నాడు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

స్వామిగౌడ్ 1954, జూలై 5న నర్సమ్మ, లక్ష్మయ్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని కిస్మత్‌పూర్ గ్రామంలో జన్మించాడు. బీఎస్సీ వరకు చదివాడు.

వివాహం[మార్చు]

మనోరమతో వివాహం జరిగింది. వీరికి కొడుకు కనకమామిడి కిరణ్ గౌడ్ , ఇద్దరు కూతుళ్లు.

ఉద్యోగ, రాజకీయ జీవితం[మార్చు]

రాజేంద్రనగర్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అటెండర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1969 ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, బుల్లెట్ గాయానికి గురయ్యాడు. 1977లో దివిసీమలో వరదలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లి ప్రజలకు సహకారం అందించాడు.[5] తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో నాయకుడుగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా కీలకభూమిక పోషించడంతోపాటు, ప్రభుత్వోద్యోగులు చేసిన 42 రోజుల సమ్మెకు సకల జనుల సమ్మెగా పేరు పెట్టి ముందుండి నడిపించాడు. 2012 జూలైలో పదవీ విరమణ చేసి, నవంబరులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించబడ్డాడు. కరీంనగర్ జిల్లా పట్టభద్డుల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసన మండలికి ఎన్నికయ్యాడు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో 2014, జూలై 2న తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "K Swamy Goud MLC Profile". 5 July 2016. Cite news requires |newspaper= (help)
  2. B. Chandrashekhar (2012-10-22). "States / Andhra Pradesh : Naidu's padayatra enters 'T' sans opposition". The Hindu. Retrieved 2012-11-16. Cite web requires |website= (help)
  3. BV Shiva Shankar, TNN 9 Nov 2012, 06.19PM IST (2012-11-09). "Eying monopoly on Telangana, KCR vetoes; T-JAC meeting postponed - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2012-11-16. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
  4. Telangana Non-Gazetted Officers Association president
  5. నేటిఏపి.కాం. "చప్రాసీ నుంచి మండలి చైర్మన్ వరకు- స్వామిగౌడ్ ప్రస్థానం!". www.netiap.com. Retrieved 23 February 2017.
  6. పోడుతెలంగాణ. "తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్". porutelangana.in. Retrieved 22 February 2017.