దేవదాస్ కనకాల

వికీపీడియా నుండి
(కనకాల దేవదాస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవదాస్ కనకాల
దేవదాస్ కనకాల
జననందేవదాస్ కనకాల
(1945-07-30)1945 జూలై 30
యానాం శివారులోని కనకాల పేట
మరణం2019 ఆగస్టు 2(2019-08-02) (వయసు 74)
హైదరాబాదు, తెలంగాణ
వృత్తిటీవీ నటుడు.
ప్రసిద్ధితెలుగు సినిమా నటులు
మతంహిందూ మతము
పిల్లలుకుమారుడు:రాజీవ్ కనకాల, కోడలు:సుమ కనకాల
కుమార్తె: శ్రీలక్ష్మి కనకాల, అల్లుడు: పెద్ది రామారావు
తండ్రికనకాల తాతయ్య నాయుడు
తల్లిమహలక్షమమ్మ.

దేవదాస్ కనకాల (జూలై 30, 1945 - ఆగస్టు 2, 2019) నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగాడు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు.

జననం

[మార్చు]

1945లో జూలై 30 న యానంలో జన్మించాడు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా చేసాడు. తల్లి మహలక్షమమ్మ. తోబుట్టువులు తనతో కలిపి ఎనమండుగురులో తనే పెద్దవాడు.

చదువు - ఉద్యోగం

[మార్చు]

విశాఖపట్టణం లోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ చదివాడు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు.

వివాహం - పిల్లలు

[మార్చు]

1971 నవంబరు 21న లక్ష్మీదేవి కనకాల తో దేవదాస్ కనకాల ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు (రాజీవ్ కనకాల), ఒక కుమార్తె (శ్రీలక్ష్మి కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ సుమ తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ అధ్యాపకుడు డా. పెద్ది రామారావు తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.[1]

ఇతరములు

[మార్చు]

కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ సీత కథ లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించాడు. అంతేకాకుండా చలిచీమలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశాడు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ వద్ద రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా నట శిక్షణ పొందారు.

దూరదర్శన్ కోసం ఈయన దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది మొదలగు సీరియల్స్ విశేష ప్రజాదరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దారు.

నటించిన సినిమాలు

[మార్చు]

దర్శకత్వం వహించిన చిత్రాలు

[మార్చు]
  1. చలిచీమలు[3]
  2. ఓ ఇంటి భాగోతం

మరణం

[మార్చు]

ఈయన 2019, ఆగస్టు 2న హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్లో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి. "నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల". Archived from the original on 18 మే 2017. Retrieved 24 May 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. డైలీహంట్. "దేవదాస్ మాట! .. శరత్కాలం". m.dailyhunt.in. Retrieved 24 May 2017.
  3. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్. "ఆంధ్రసచిత్ర వార పత్రిక". www.pressacademyarchives.ap.nic.in. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 13 July 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "దేవదాస్‌ కనకాల కన్నుమూత". ఈనాడు. 2 August 2019. Archived from the original on 3 August 2019. Retrieved 8 August 2019.

ఇతర లింకులు

[మార్చు]