కనక సింహాసనం
| కనక సింహాసనం (2006 మలయాళం సినిమా) | |
డివిడి కవర్ | |
|---|---|
| దర్శకత్వం | రాజసేనన్ |
| నిర్మాణం | ఎం.మణి |
| రచన | రాజసేనన్ |
| చిత్రానువాదం | బిజు వట్టప్పర |
| తారాగణం |
|
| సంగీతం | ఎం. జయచంద్రన్ ఎస్.పి.వెంకటేష్(నేపథ్య సంగీతం) |
| ఛాయాగ్రహణం | కె. పి. నంబియతిరి |
| కూర్పు | రాజా ముహమ్మద్ |
| పంపిణీ | అరోమా ఫిల్మ్స్ |
| దేశం | భారతదేశం |
| భాష | మలయాళం |
| నిర్మాణ_సంస్థ | సునీతా ప్రొడక్షన్స్ |
కనక సింహాసనం 2006లో రాజసేనన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ భాషా యాక్షన్-కామెడీ చిత్రం. ఈ చిత్రంలో జయరామ్, కార్తీక, లక్ష్మీ గోపాలస్వామి, కిరణ్ రాజ్లు నటించారు.[1]
కథ
[మార్చు]తన భార్య భారతితో కలిసి నాటక బృందాన్ని నడుపుతున్న కనకాంబరన్ కథను ఈ చిత్రం చెబుతుంది. నాటక కంపెనీ నష్టంతో పనిచేస్తున్నా అప్పు ఇచ్చినవారు ఇబ్బందులు పెట్టడంతో ఈ జంట దానిని కొనసాగించడానికి కష్టపడుతున్నారు.
ఒకరోజు, ఉపేంద్ర వర్మ, రాధాకృష్ణ వర్మ నిజ జీవిత నాటకంలో పాల్గొనమని అడిగడంతో వారికి నక్కతోక తొక్కినట్లు అయ్యింది. ప్యాలెస్ సింహాసనానికి వారసుడు, 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన యువరాణి కాంచనలక్ష్మి చిన్ననాటి ప్రియుడు/భర్త అయిన సూర్యనారాయణన్ స్థానంలో నటించాలని వారు కనకాంబరన్ను కోరతారు.
కనకంబరన్ ఈ సవాలును స్వీకరిస్తాడు. కొంత కాలం తర్వాత తన భార్యను రాజ భవనంలో వంటమనిషిగా నియమిస్తాడు, ఈ మధ్యకాలంలో నరసింహన్ అనే దుర్మార్గుడు కాంచనలక్ష్మిపై కన్నువేస్తాడు.
కనకన్ నిజమైన యువరాజు కాదని నిరూపించడానికి నరసింహన్ శతవిధాలా ద్వారా ప్రయత్నిస్తాడు, కానీ ప్రతిసారీ విఫలమవుతుంటాడు. అతను దానికోసం ప్యాలెస్ సలహాదారు అయిన ఇంద్రసేనన్ రెడ్డిని తీసుకువస్తాడు, కాని నరసింహన్, అతని అనుచరుల చెడు ఉద్దేశాల గురించి తెలుసుకున్న ఇంద్రసేనన్, యువరాణిని రక్షించగలడని నమ్మి కనకన్కు సహాయం చేస్తాడు.
కనకన్ బావ గోపాలన్, మద్యం ప్రభావంతో మాట్లాడుతున్నప్పుడు, కనకాంబరనే వాస్తవానికి సూర్యనారాయణన్ అని ఇంద్రసేనన్కు తెలిసిపోతుంది. 24 సంవత్సరాల క్రితం రాజకుటుంబ సభ్యులపై అంతర్గత దాడి జరిగినప్పుడు, సూర్యనారాయణన్ దూరంగా పంపించి, తరువాత రాజభవనం వంటవాడు దత్తత తీసుకుంటాడు. అతను నిజం తెలుసుకున్నప్పటికీ, దానిని బహిరంగపరచడు.
ఈలోగా, నరసింహన్ అతని ముఠా త్రిపురసుందరి సహాయంతో కనకన్ నాటక కళాకారుడని తెలుసుకుని దానిని బహిర్గతం చేస్తారు. పొంది అతన్ని బహిర్గతం చేసి, కాంచనలక్ష్మి హృదయ విదారక స్థితికి దారితీస్తాడు.
మరుసటి రోజు, నరసింహన్ కాంచనలక్ష్మిని బలవంతంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాని కనకంబరన్, అతని అనుచరులు నరసింహన్ను చావగొడతారు. ఇంద్రసేనన్ అప్పుడు కనకాంబరనే సూర్యనారాయణన్ అనే విషయం అందరికీ చెబుతాడు.
కనకాంబరన్ తన నాటక ప్రపంచానికి తిరిగి వస్తాడు. నరసింహన్ మంచి వ్యక్తి అవుతాడు. తరువాత, కాంచనలక్ష్మి నరసింహన్ను వివాహం చేసుకుంటుంది. రెండు జంటలు నృత్యం చేసే పాటతో కథ ముగుస్తుంది.
తారాగణం
[మార్చు]- జయరామ్ - కాసరగోడ్ కనకాంబరన్/సూర్యనారాయణన్
- కార్తీక మాథ్యూ - కనకంబరన్ భార్య మార్తండం భారతి
- లక్ష్మీ గోపాలస్వామి - కాంచనలక్ష్మి, సూర్యనారాయణన్ చిన్ననాటి ప్రియురాలు
- కిరణ్ రాజ్ - నరసింహన్ రాజు
- కళశాల బాబు - ఇంద్రసేనారెడ్డి, రాజ గురువు
- సూరజ్ వెంజరమూడు - మార్తండం గోపాలన్, భారతి సోదరుడు, కనకాంబరన్ బావమరిది
- జనార్దన్ - ఉపేంద్ర వర్మ
- భీమన్ రఘు - రాధాకృష్ణ వర్మ
- సుబీ సురేష్ - త్రిపురసుందరి
- బేబీ నయనతార - కనకాంబరన్ కుమార్తె అమ్ముకుట్టి
- గీతా సలాం - గతంలో రాజ భవనంలో పనిచేసిన కనకంబరన్ దత్తత తీసుకున్న తండ్రి రిషికేష కైమల్
- కొచ్చు ప్రేమన్ - చెన్నకేశవ్ రెడ్డి
- సాజు కొడియన్ - అవరచన్
- టామ్ జాకబ్ - ఫిలిపోస్
పాటలు
[మార్చు]రాజీవ్ అలుంకల్ సాహిత్యం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఎం. జయచంద్రన్ సంగీతం సమకూర్చాడు.
- 1 "ప్రియతమే" - కె. జె. యేసుదాస్ & కె. ఎస్. చిత్ర
- 2 "సుందరనో" (రాగం: పున్నాగవరాళి) - సుజాత
- 3 "అళకార్ణ" (రాగం: బేగడ) - శంకరన్ నంబూదిరి, గంగా & ప్రియా
- 4 "సుందరనో" (రాగం: పున్నాగవరాళి) - ఎం. జయచంద్రన్ & సుజాత
మూలాలు
[మార్చు]- ↑ "Movie Review : Kanaka Simhasanam". Sify. Retrieved 10 August 2022.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link)