Coordinates: 16°04′52″N 80°44′17″E / 16.080982°N 80.738120°E / 16.080982; 80.738120

కనగాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనగాల
—  రెవిన్యూ గ్రామం  —
కనగాల is located in Andhra Pradesh
కనగాల
కనగాల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′52″N 80°44′17″E / 16.080982°N 80.738120°E / 16.080982; 80.738120
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,192
 - పురుషుల సంఖ్య 3,585
 - స్త్రీల సంఖ్య 3,607
 - గృహాల సంఖ్య 2,081
పిన్ కోడ్ 522259
ఎస్.టి.డి కోడ్ 08648.

కనగాల, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చెరుకుపల్లి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2081 ఇళ్లతో, 7192 జనాభాతో 1249 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3585, ఆడవారి సంఖ్య 3607. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 266 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 231. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590443[1].పిన్ కోడ్: 522259. ఎస్.టి.డి.కోడ్= 08648.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నడింపల్లి,పొన్నపల్లి,ఆళ్ళవారిపాలెం,పెద్దవరం,ఐలవరం గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.సమీప బాలబడి గూడవల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల చెరుకుపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల భట్టిప్రోలులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ రేపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల పొన్నపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గూడవల్లిలోను, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

పాఠశాలల జాబితా[మార్చు]

  • హెచ్.ఎం.కె.ఎస్. & ఎం.జి.ఎస్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
  • షేక్ హసన్ అహ్మద్ హిందీ పండిట్ శిక్షణ కళాశాల:- ఇటీవల ప్రకటించిన హిందీ పండిట్ పరీక్షా ఫలితాలలో, ఈ కళాశాలకు చెందిన షేక్ కమల్, 1000 మార్కులకుగాను 863 మార్కులు సంపాదించాడు. ఇదే కళాశాలకు చెందిన ఎం.అపర్ణ 851 మార్కులు సంపాదించింది. వీరిద్దరూ జిల్లాస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. ఈ కళాశాల నుండి 47 మంది విద్యార్థులు ఈ పరీక్షలు వ్రాయగా, 45 మంది ప్రథమశ్రేణిలోనూ ఇద్దరు ద్వితీయశ్రేణి లోనూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించారు. కళాశాల మొత్తంగా, జిల్లాలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నది.
  • జీనత్ హామోబీ ఉపాధ్యాయ శిక్షణ (టీచర్ ట్రైనింగ్) కళాశాల.
  • శ్రీ జగన్నాధ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠసాల.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కనగాలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కనగాలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామంలో ఉంది, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కనగాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 142 హెక్టార్లు
  • బంజరు భూమి: 3 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1103 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 5 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1101 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కనగాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1100 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 1 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కనగాలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

నేత వస్త్రాలు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

వేజెండ్ల గోవిందమ్మ[మార్చు]

భట్టిప్రోలు మండలంలోని ఆళ్ళమూడి గ్రామమంలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీ వేజెండ్ల చెంచురామయ్య, నాగేంద్రమ్మ దంపతుల కుమార్తె గోవిందమ్మ జి.ఎన్.ఎం. కోర్సు చదివి, ప్రస్తుతం కనగాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. సేవ చేయాలనే తపన, రోగులపై ప్రేమ, విషమ పరిస్థితులలోనూ తగ్గని ఆత్మ స్థయిర్యం ఈమె స్వంతం. తన వృత్తిపట్ల అంకితభావంతో పనిచేయుచున్న ఈమె, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అందించే ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సు పురస్కారానికి ఎంపిక అయినది. ఈమె, 2017.మే-12న కొత్తఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించు కార్యక్రమంలో, భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌ముఖర్జీగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్నీ, 50వేల రూపాయల నగదు బహుమతి, పతకం, అందుకొనబోవుచున్నారు. ఈ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ పురస్కారానికి ఎన్నికైన ఒకే ఒక మహిళా నర్సు ఈమె. [11]

విశాఖపట్నం నగరానికి చెందిన మదర్ థెరెస్సా ఆర్గనైజేషన్ అను సంస్థ, 2017,జులై-3న హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు ఆర్ట్ గ్యాలరీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ కె.కృష్ణమూర్తి, ప్రముఖ సాహితీవేత్త శ్రీ మొయినుద్దీన్, ఈ కార్యక్రమంలో భాగంగా, ఈమెను దుశాలువలతో సత్కరించి, ఆణిముత్యం పురస్కారాన్ని అందజేసినారు.

ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, 1.18 లక్షల అంచనా వ్యయంతో ఒక నూతన భవన నిర్మాణానికి 2017, ఏప్రిల్‌లో శంకుస్థాపన నిర్వహించారు.

కనగాల చేనేత సహకార సంఘం[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గంగానమ్మ చెరువు[మార్చు]

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో షేక్ నసీమా బీగం, సర్పంచిగా ఎన్నికైనారు.

గామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో శుక్ల త్రయోదశి నుండి పౌర్ణమి వరకూ, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. త్రయోదశి నాడు స్వామివారిని పెళ్ళికుమారుని చేసెదరు. చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణం జరిపి, పౌర్ణమికి గ్రామోత్సవం నిర్వహించెదరు. బహుళ పాడ్యమి నాడు వసంతోత్సవం నిర్వహించెదరు. సాయంత్రం సహస్ర దీపోత్సవం, పూర్ణాహుతి, అనంతరం ధ్వజారోఫణ జరుపుతారు. ఈ అలయానికి, ఐలవరం గ్రామంలో, 1.89 ఎకరాల మాన్యం భూమి ఉంది.

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలోని అమ్మవారు, ఆళ్ళవారిపాలెం, పిట్టువారిపాలెం వారికి గూడా గ్రామదేవత. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో, 2,4 ఆదివారాలలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏర్పాటుచేయడం ఆనవాయితీ. ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-25, సోమవారం నాడు, చండీయాగమహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వరపూజ, చండీహవనంతోపాటు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు.

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలు 2016,మే-22వ తేదీ ఆదివారం (వైశాఖ బహుళ పాడ్యమి) నాడు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ కోదండరామాలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక రథం బజారులో ఉంది.

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామ ప్రముఖులు[మార్చు]

శ్రీ అడిగొప్పుల నరసింహారావు, రేడియో కళాకారులు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7268. ఇందులో పురుషుల సంఖ్య 3632, స్త్రీల సంఖ్య 3636,గ్రామంలో నివాసగృహాలు 1925 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=కనగాల&oldid=3848740" నుండి వెలికితీశారు