Jump to content

కనన్ దేవి

వికీపీడియా నుండి
కనన్ దేవి
కనన్ దేవి (1930)
జననం(1916-04-22)1916 ఏప్రిల్ 22
మరణం1992 జూలై 17(1992-07-17) (వయసు 76)
వృత్తినటి

కనన్ దేవి (1916 ఏప్రిల్ 22 - 1992 జూలై 17) బెంగాలీ సినిమా నటి, గాయని.[1] కనన్ బెంగాలీ సినిమా తొలి నటి, గాయనిగా గుర్తింపు పొందింది. కనన్ పాడిన శైలీ, కోల్‌కతాలోని న్యూ థియేటర్‌లలో కొన్ని అతిపెద్ద హిట్‌లలో వాయిద్యంగా ఉపయోగించబడింది.

జీవిత చరిత్ర

[మార్చు]

కానన్ 1916 ఏప్రిల్ 22న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరా నగరంలో జన్మించింది. "శబరే అమీ నామి" అనే పేరుతో తన ఆత్మకథ రాసుకుంది.

సినిమారంగం

[మార్చు]

కాకాబాబు అని పిలిచే తులసి బెనర్జీ, కానన్‌కు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు మదన్ థియేటర్స్/జ్యోతి స్టూడియోస్‌కు పరిచయం చేశాడు. కానన్ అక్కడ జైదేవ్ (1926)లో ఒక చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత 1927లో శంకరాచార్యలో నటించింది. ఆ సమయంలో కనన్ బాలా అని పిలిచేవారు.[1]

మదన్ థియేటర్స్ ప్రొడక్షన్స్‌లో (1926–1932) కనన్ ఐదు సినిమాలు చేసింది, రిషిర్ ప్రేమ్ (1931), జోరేబరత్ (1931), విష్ణు మాయ (1932), ప్రహ్లాద్ సినిమాలలో పాత్రలు పోషించింది. ఆ తర్వాత 1933 నుండి 1936 వరకు రాధా ఫిల్మ్స్‌తో, తర్వాత 1937 నుండి 1941 వరకు న్యూ థియేటర్స్‌తో, ఏంపి ప్రొడక్షన్స్ 1942 నుండి 1948 వరకు పనిచేసింది. తదుపరి శ్రీమతి పిక్చర్స్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థను (1949 నుండి 1965 వరకు) స్థాపించింది. బాలనటిగా మూకీ సినిమాలలో పాత్రల నుండి, కనన్ టాకీ సినిమాలలో విజయవంతమైన సినిమాలలో నటించింది. జోరేబరత్ (1931), మనోమోయీ గర్ల్స్ స్కూల్, ఖూనీ కౌన్, మా (1934) సినిమాలతో గుర్తింపు పొందింది.

మరణం

[మార్చు]

కనన్ తన డెబ్బై ఆరు సంవత్సరాల వయస్సులో 1992, జూలై 17న కలకత్తాలోని బెల్లేవ్ క్లినిక్‌లో మరణించింది.

అవార్డులు

[మార్చు]
భారతదేశం 2011 స్టాంపుపై దేవి

గౌరవం

[మార్చు]
  • 2011 ఫిబ్రవరిలో భారత కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి కనన్ గౌరవార్థం కనన్ చిత్రంలో కూడిన పోస్టల్ స్టాంపును విడుదలచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Rajadhyaksha, Ashish; Willemen, Paul; Professor of Critical Studies Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Routledge. p. 88. ISBN 978-1-135-94318-9. Retrieved 28 February 2015.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కనన్_దేవి&oldid=4338141" నుండి వెలికితీశారు