కనపర్తి (నాగులుప్పలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కనపర్తి
రెవిన్యూ గ్రామం
కనపర్తి is located in Andhra Pradesh
కనపర్తి
కనపర్తి
అక్షాంశ రేఖాంశాలు: 15°35′24″N 80°12′54″E / 15.59°N 80.215°E / 15.59; 80.215Coordinates: 15°35′24″N 80°12′54″E / 15.59°N 80.215°E / 15.59; 80.215 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం4,293 హె. (10,608 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం5,927
 • సాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523180 Edit this at Wikidata

కనుపర్తి, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523180., ఎస్.ట్.డి.కోడ్ = 08592.

ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్థూపాలున్న ముఖ్య క్షేత్రాలలో కనుపర్తి ఒకటి

గ్రామ చరిత్ర[మార్చు]

బ్రహ్మకుండి అని పిలువబడే గుండ్లకమ్మ నది, అనంతసాగరంలో కలగలసిపోయే ప్రాంతంలో వెలసిన ప్రదేశమే కనపర్తి. ఈ గ్రామం రెండవ శతాబ్దం నుండి బౌద్ధ నివాస కేంద్రం. శాతవాహన పాలకులు పరిపాలించిన, పవిత్ర పుణ్యక్షేత్రంగా అలరారిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, శిల్పాలు దర్శనం ఇస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో వెలసిన కనపర్తి క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకూ విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఈ గ్రామ సమీపంలోనుండి ప్రవహించుచున్న బకింగ్ హాం కాలువద్వారా ఆంగ్లేయుల కాలంలో, విజయవాడ నుండి చెన్నై వరకు, నావల (జలమార్గం) ద్వారా సరకు రవాణా నిత్యం జరిగేది. మార్గమధ్యంలో విడిదికోసం కనపర్తిలో అతిధులకోసం, బంగళాను గూడా ఏర్పాటు చేసారు. అప్పట్లోనే ప్రత్యేకంగా రంగూను నుండి టేకును తెప్పించి, మరుగుదొడ్డి, ప్రత్యేక పాన్ ల వంటివి ఏర్పాటుచేసి మరీ బంగళాను నిర్మించారు. చెన్నై నుండి సరిగ్గా 191వ మైలు వద్ద ఈ బంగళాను నిర్మించారు. (ఈ 191వ మైలురాయి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిచ్చుచూ సందర్శకులను ఆకట్టుకొనుట విశేషం). ఈ బంగళాలో గతంలో బ్రిటిష్ రణి విడిది చేసినట్లుగా స్థానికులు చెబుతుంటారు. అప్పటి నుండి ఈ బంగళాకు "బకింగ్ హాం బంగళా"గా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ బంగళా శిథిలావస్థలో ఉంది. [8]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామం కనకాపురి, కనకభంజనపురి, కనకాంబుజపురి. అను పేర్లతో చారిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందినది.

గ్రామ భౌగోళికం[మార్చు]

కనపర్తి గ్రామం ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

తిమ్మసముద్రం 4 కి.మీ, దేవరంపాడు 5 కి.మీ, చేజర్ల 6 కి.మీ, రాపర్ల 7 కి.మీ. పెదగంజాం 7 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

చినగంజాం 12.కి.మీ, నాగులుప్పలపాడు 13.8 కి.మీ, కొత్తపట్నం 17.1 కి.మీ, ఒంగోలు 19.6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన కొత్తపట్నం మండలం, పశ్చిమాన ఒంగోలు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం.

గామంలోని రవాణా సౌకర్యాలు[మార్చు]

రోడ్డు మార్గం[మార్చు]

ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనున్న కనపర్తికి చేరుకోవాలంటే ఒంగోలు డిపోనుంచి ఉదయం 5 గంటలనుంచే ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. సముద్ర తీరానికి చేరుకోవాలంటే అక్కడి మ్యూజియం నిర్వాహకులే వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలలో కూడా కనపర్తి సముద్ర తీరానికి చేరుకోవచ్చు.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

కనుపర్తి ఎత్తిపోతల పథకం:- ఈ పథకం ద్వారా, మొదట 6,000 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ గత 23 సంవత్సరలుగా, ఈ పథకం క్రింద 4,500 ఎకరాలు మాత్రమే సాగుచేసుకుంటున్నారు. మిగిలిన 1500 ఎకరాలకు, సాగునీరందక మెట్టభూములుగానే మిగిలిపోయినవి. ప్రస్తుతం ఈ పథకం క్రింద సాగవుచున్న 4,500 ఎకరాలభూమిని మాత్రమే గుండ్లకమ్మ జలాశయానికి అనుసంధానం చేసారు. [7]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు:- కనపర్తి, తోపుపాలెం, దాసరివారిపాలెం, పల్లెపాలెం, యానాదికాలనీ, చిన్నంగారి పట్టపుపాలెం, ఎం.ఎస్.పట్టపుపాలెం, కుక్కలవారిపాలెం.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చాట్ల నారాయణ, సర్పంచిగా ఎన్నికైనారు.[2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

పురావస్తు ప్రదర్శనశాల[మార్చు]

కనపర్తి గ్రామంలో పురావస్తు శాఖ అధ్వర్యంలో ఒక మ్యూజియం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అయిన టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ఈ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో వినాయక, కుమారస్వామి, నారాయణ, బ్రాహ్మణి. సూర్య, పరశురామ, వర్షిణి, విగ్రహాలతోపాటు వివిధ పరిమాణాల, ఆకారాల శివలింగాలు ఉన్నాయి. కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల ధారాలింగం. దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది. దీంతో ఈ శివలింగం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.[3] పూర్వకాలంలో కనాపురి పట్టణంలో వాడిన రాతి గొడ్డళ్లు, ఇటుకలు, అలంకరణ సామగ్రి, పూసలు.. తదితర వస్తువులు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి. అలాగే అనేక బావులు, వాటి నిర్మాణానికి వినియోగించిన పెద్ద పెద్ద ఇటుకలు, బ్రహ్మలిపిలో ఉండే బౌద్ధ స్తూపాలు, ప్రాకృత భాషలో గల విజయనగర రాజు కృష్ణదేవరాయులవారి శాసనాలు, ద్రావిడ భాషల్లో గల తూర్పు చాళుక్యుల, చోళుల శాసనాలను మనం అక్కడ చూడవచ్చు. మ్యూజియంలో ఎల్లప్పుడూ గైడ్‌ అందుబాటులో ఉంటారు. ఇక కనపర్తి గ్రామంలోని శైవ, వైష్ణవ ఆలయాలు ఆనాటి ప్రజల జీవన చిత్రాన్ని కళ్లకు కట్టేటట్లుగా ఉన్నాయి.

చారిత్రిక సంపద[మార్చు]

ఈ గ్రామములోని పోలేరమ్మ ఆలయ సమీపంలో ఇంటిమెరకకోసం రైతు శ్రీ పోతినేని సోమయ్య, తన స్వంత పొలంలో మొరక సరిచేస్తుండగా ఒక మట్టికుండ బయల్పడినది. ఆ మట్టికుండలో 14 బుద్ధుడి విగ్రహాలతోపాటు, ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు, ఎగిరే భంగిమలోని గంధర్వుడి పంచలోహ విగ్రహాలు లభ్యమైనవి. పూజాదికాలకు వినియోగించే గంటలు, మూకుడు, ధూపం వేసే వస్తువులు దొరికినవి. మరో రెండు స్థూపాలు గూడా లభ్యమైనవి. ఇవి 5వ శతాబ్దానికి చెందినవిగా భావించుచున్నారు. [9]

కనపర్తి బీచ్‌[మార్చు]

పురావస్తు ప్రదర్శన శాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కనపర్తి సముద్ర తీరం సౌందర్యం వర్ణనాతీతం. సాధారణంగా సముద్ర తీరానికి వెళ్లిన వారికి దూరంగా మాత్రమే ఒంపు కన్పిస్తుంది. ఒంపు వద్దకు వెళ్లాలని ప్రయత్నిస్తే, మరికొంచెం దూరంలో కన్పిస్తుంది. అయితే కనపర్తి తీరంలో మాత్రం ఒయ్యారాలు ఒలకబోస్తున్నట్లుండే సముద్ర తీరపు ఒంపుసొంపులను దగ్గర్నించే చూడవచ్చు. సెలవు దినాల్ని ఆహ్లాదకరంగా గడపాలనుకునేవారు ముఖ్యంగా పార్క్‌లకు బీచ్‌లకు వెళ్లడం చేస్తుంటారు. అయితే... ఆ బీచ్‌లకు దగ్గరే గుళ్లూ, గోపురాలు, చారిత్రక స్థలాలు కూడా ఎలా ఉంటే ఎలావుంటుంది? ప్రకృతి ఆహ్లాదంతో పాటు... ఆధ్యాత్మిక అనుభూతి, చారిత్రక విజ్ఞానం కూడా మీ సొంతమవుతుంది. అలాంటి అరుదైన బీచ్‌... ఈ కనపర్తి బీచ్‌.

దేవాలయాలు[మార్చు]

ఇక్కడ చాళుక్య రాజులకాలంనాటి ఒక రామాలయం, పదవ శతాబ్దంనాటి ఏలేశ్వరస్వామి ఆలయం అనే శివాలయం శిథిలావస్థలో ఉన్నాయి.[4]

కనపర్తి సముద్రతీరంలోని పట్టపుపాలెంలో, 2017,మార్చి-7వతేదీ మంగళవారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవం కన్నులపండువగా సాగినది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ రథోత్సవంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించిపోయినారు. [10]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గామానికి చెందిన శ్రీమతి ఊర విజయలక్ష్మి, తన సృజనాత్మకతను విభిన్నరీతిలో చాటుకున్నారు. ఈమె వంట ఇంటి ఆహార పదార్ధాలతో, "క్రికెట్టు మైదానం, ప్రపంచ కప్పు" నమూనాలను తయారుచేసి ఆకట్టుకున్నారు. క్యారట్టుతో క్రికెట్టు బాటు, బంతి, పాలకూర అన్నంతో మైదానం, బంగాళదుంపలతో వికెట్లు, క్యారట్టు, ఉల్లి, నిమ్మతో ప్రపంచ కప్పు నమూనాను తయారుచేసి, శభాష్ అనిపింఛుకున్నారు. [6]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,219.[5] ఇందులో పురుషుల సంఖ్య 3,132, మహిళల సంఖ్య 3,087, గ్రామంలో నివాస గృహాలు 1,433 ఉన్నాయి.
జనాభా (2011) - మొత్తం 5,927 - పురుషుల సంఖ్య 3,023 - స్త్రీల సంఖ్య 2,904 - గృహాల సంఖ్య 1,612

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-2; 1వపేజీ.
  3. http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=149027
  4. ది హిందూ దినపత్రిక; 2013,ఏప్రిల్-18; పేజీ-20
  5. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[6] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-25; 15వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-22; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,అక్టోబరు-15; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-8; 15వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,మార్చి-8; 1వపేజీ.