కన్యాశుల్కం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్యాశుల్కం
(1955 తెలుగు సినిమా)
Kanyasulkam telugu 1955film.jpeg
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం డి.ఎల్.నారాయణ
తారాగణం గోవిందరాజుల సుబ్బారావు,
సి.యస్.ఆర్. ఆంజనేయులు,
విన్నకోట రామన్నపంతులు,
నందమూరి తారక రామారావు,
వంగర వెంకటసుబ్బయ్య,
సావిత్రి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ వినోదా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
కన్యాశుల్కం విసిడి కవరు చిత్రం

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సిన విషయం నటుల నటన గురించి. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించటానికి ఎంతగానో ప్రయత్నం జరిగింది. ఈ చలన చిత్రంలో ముగ్గురి నటన బాగా చెప్పుకోతగ్గది. లుబ్దావధానులుగా, గోవిందరాజుల సుబ్బారావు, రామప్పపంతులుగా సి ఎస్.ఆర్, మధురవాణిగా సావిత్రి. ముగ్గురూ కూడి ఉన్న దృశ్యాలన్నీ కూడ నటనను అత్యున్నత స్థితికి తీసుకు వెళ్ళినవే. వీరితో పాటుగా,అగ్నిహోత్రావధానులుగా వేసిన విన్నకోట రామప్ప పంతులు కూడ నటనలో పొంకం చెడకుండా పాత్రకు న్యాయం చేశారు. నందమూరి తారక రామారావు, ప్రతినాయకుడు వంటి, నాయక పాత్రను చక్కగా పోషించాడు.[1]

అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా సానుకూల స్పందన లభించలేదు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే - పి.సుశీల
  2. ఇల్లు ఇల్లు అనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే చిలకా - పద్మప్రియ
  3. కీచకవధ ( వీధీ భాగవతం) - రచన: సముద్రాల రాఘవాచార్య; గానం: పి. కృష్ణమూర్తి, పద్మప్రియ బృందం
  4. చేదాము రారే కల్యాణము చిలకా గోరింక పెళ్ళి సింగారం - పద్మప్రయ బృందం
  5. చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి; గానం: ఘంటసాల
  6. పుత్తడిబొమ్మా పూర్ణమ్మా ... మేలిమి బంగరు నెలతల్లారా - ఘంటసాల బృందం
  7. పులస్యనవని (శ్లోకం) - ఘంటసాల ( గుమ్మడి మాటలతో)
  8. సరసుడ దరి చేరరా ఔరా సరసుడ దరి చేరరా సమయమిదే - ఎం.ఎల్. వసంతకుమారి

విడుదల[మార్చు]

స్పందన[మార్చు]

కన్యాశుల్కం సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా సానుకూల స్పందన లభించలేదు.[2]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి. "ఎన్టీఆర్‌ 'కన్యాశుల్కం' 60 ఏళ్లు". Archived from the original on 28 సెప్టెంబర్ 2015. Retrieved 24 August 2017. CS1 maint: discouraged parameter (link)
  2. చల్లా, రమణ (February 1956). ధనికొండ, హనుమంతరావు (ed.). "పరిశ్రమ జాతకం". చిత్రసీమ. 1 (2): 17–21.

ఇతర లింకులు[మార్చు]