Jump to content

కన్వ వంశం

వికీపీడియా నుండి

Kanva dynasty

75 BCE–30 BCE
రాజధానిPataliputra or Vidisha
సామాన్య భాషలుSanskrit
మతం
Hinduism
Buddhism
ప్రభుత్వంmonarchy
Maharajadhiraj 
చరిత్ర 
• స్థాపన
75 BCE
• పతనం
30 BCE
Preceded by
Succeeded by
Shunga dynasty
Gupta dynasty
Satavahanas
Mitra dynasty

కన్వా రాజవంశం (కన్వాయన) ఒక రాజవంశం.[1] ఇది తూర్పు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో శుంగ రాజవంశం స్థానాన్ని భర్తీ చేసింది. ఇది క్రీ.పూ 75 నుండి క్రీ.పూ 30 వరకు పరిపాలించింది. [2][3]

కన్వా రాజవంశం మగధ (తూర్పు భారతదేశంలో) లో పాలించినట్లు పురాణ సాహిత్యం సూచించినప్పటికీ వారి నాణేలు ప్రధానంగా మధ్య భారతదేశంలోని విదీష, పరిసరాలలో కనిపిస్తాయి.[4] ఇది తరువాత షుంగా పాలకులకు రాజధానిగా కూడా ఉంది.[5]

క్రీస్తుపూర్వం 75 లో షుంగా రాజవంశం యొక్క చివరి పాలకుడు దేవభూతిని పడగొట్టి ఆయన మంత్రి వాసుదేవుడు కన్వ రాజవంశాన్ని స్థాపించాడు.[6] కన్వ పాలకుడు శుంగ రాజవంశం రాజులను వారి పూర్వ సామ్రాజ్యంలోని ఒక మూలలో గుప్తంగా పాలన కొనసాగించడానికి అనుమతించాడు. నలుగురు కన్వా పాలకులు ఉన్నారు. పురాణాల ఆధారంగా వారి రాజవంశానికి శాతవాహనులు ముగింపు పలికారు.[7][3]

ఉత్పన్నం

[మార్చు]

శుంగ రాజవంశానికి చెందిన దేవభూతిని వాసుదేవకన్వా చంపి కన్వా వంశం స్థాపించబడింది.[8]

పాలకులు

[మార్చు]

కన్వరాజవంశం మొదటి పాలకుడు వాసుదేవుడు. ఆయన గోత్రం పేరు రాజవంశానికి పేరుగా పెట్టబడింది.[9] ఆయన తరువాత ఆయన కుమారుడు భూమిమిత్ర అధికారపీఠం అధిష్ఠించాడు. భూమిమిత్ర చిత్రంతో ముద్రించబడిన నాణేలు పాంచాల రాజ్యప్రాంతంలో కనుగొనబడ్డాయి. "కన్వస్య" చిత్రాలతో ముద్రించబడిన రాగి నాణేలు విదిషా, అలాగే వత్స రాజ్యంలోని కౌశంబిలో కూడా కనుగొనబడ్డాయి.[10] భూమిమిత్ర పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత ఆయన కుమారుడు నారాయణ వారసత్వంగా రాజ్యపాలన చేసాడు. నారాయణ పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత ఆయన కుమారుడు సుషర్మాను కన్వరాజవంశం చివరి రాజుగా రాజ్యపాలన చేసాడు.[11][12]

  • వాసుదేవుడు (మ. క్రీ.పూ. 75 - క్రీ.పూ. 66)
  • భూమిమిత్ర (మ. క్రీ.పూ.66 - క్రీ.పూ. 52)
  • నారాయణ (మ. క్రీ.పూ. 52 - క్రీ.పూ. 40)
  • సుసర్మాను (మ. క్రీ.పూ .40 - క్రీ.పూ. 30)

తరువాత పాలకులు

[మార్చు]

కన్వా రాజవంశం చివరి పాలకుడిని బాలిపుచ్చా హత్యచేసి అంధ్ర రాజవంశాన్ని స్థాపించాడు.[8]

తరువాత పాలకులు

[మార్చు]

శాతవాహనులు కన్వ రాజవంశాన్ని ఓడించి మధ్య భారతదేశంలో రాజ్యస్థాపన చేసారు.[13][14] ఏది ఏమయినప్పటికీ క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దం నుండి సా.శ. 2 వ శతాబ్దం వరకు మగధ కౌశంబిని పాలించిన మిత్రా రాజవంశానికి సామంతరాజ్యంగా ఉందని నామిస్మాటికు, ఎపిగ్రాఫికు ఆధారాలు సూచిస్తున్నాయి.[14]

మూలాలు

[మార్చు]
  1. World history from early times to A D 2000 By B.V.Rao, Sterling Publishers, Page 97
  2. INDIAN HISTORY by Dr. Sanjeevkumar Tandle, Page 150
  3. 3.0 3.1 Raychaudhuri 2006, p. 333.
  4. Bhandare, Shailendra. "Numismatics and History: The Maurya-Gupta Interlude in the Gangetic Plain." in Between the Empires: Society in India, 300 to 400, ed. Patrick Olivelle (2006), pp.91–92
  5. Bhandare (2006), pp.71, 79
  6. Radhey Shyam Chaurasia. History of Ancient India: Earliest Times to 1000 A. D. Atlantic Publishers & Dist, 2002 - India - 308 pages. p. 132.
  7. History of Ancient India By Rama Shankar Tripathi, Page 189
  8. 8.0 8.1 Thapar 2013, p. 296.
  9. Brajmohan Kumar. Archaeology of Pataliputra and Nalanda. Ramanand Vidya Bhawan, 1987 - India - 236 pages. p. 26.
  10. Bajpai (2004), p.38 with footnote 4, and p.173
  11. optional Indian history ancient India by Pratiyogita Darpan Editorial Team, Page 121 (The Kanvas)
  12. World Monarchies and Dynasties By John Middleton, Routledge Publishers, Page 486 (Kanva Dynasty)
  13. Bhandare (2006), pp.91–92
  14. 14.0 14.1 K. D. Bajpai (అక్టోబరు 2004). Indian Numismatic Studies. Abhinav Publications. pp. 38–39. ISBN 978-81-7017-035-8.

వనరులు

[మార్చు]
అంతకు ముందువారు
Shunga dynasty
Magadha dynasties తరువాత వారు
Satavahana

వర్గం

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కన్వ_వంశం&oldid=3505819" నుండి వెలికితీశారు