కన్హయ్య కుమార్

వికీపీడియా నుండి
(కన్హయ్య కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కన్హయ్య కుమార్‌
జననం13 జనవరి 1987
బిహాత్కు, బేగుస‌రాయ్‌, బిహార్‌ రాష్ట్రం, భారతదేశం
విద్యబిఏ
ఎంఏ - నలంద ఓపెన్ యూనివర్సిటీ
జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ - పి.హెచ్.డి[1]
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)

కన్హయ్య కుమార్‌ ఢిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సామాజిక కార్య‌క‌ర్త, రాజకీయ నాయకుడు. [2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కన్హయ్య కుమార్‌ 13 జనవరి 1987లో బిహార్‌ రాష్ట్రం, బేగుస‌రాయ్‌లో జైశంక‌ర్ సింగ్, మీనా దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి పూర్తి చేశాడు. కన్హయ్య కుమార్‌ సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్‌లో 2008లో చేరాడు. ఆయన 2015లో ఢిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఏఐఎస్‌ఎఫ్ త‌రపున జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కన్నయ్య కుమార్‌ 2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని బెగూసరయ్‌ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.[4]ఆయన 28 సెప్టెంబర్ 2021న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[5] కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ 06 జూలై 2023న నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) ఎఐసిసి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.[6] ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మొత్తం దూరం నడిచాడు.

వివాదాలు[మార్చు]

కన్హయ్య కుమార్‌ 2016 ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూ క్యాంపస్‌లో అప్జల్ గురుకు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసాడని అతనిపై దేశ ద్రోహం కేసు నమోదైంది.[7]

మూలాలు[మార్చు]

  1. "Kanhaiya Kumar's PhD done, he wants to be a professor". The Times of India. 15 February 2019.
  2. "WHO IS KANHAIYA KUMAR". Business Standard. 2019. Archived from the original on 26 సెప్టెంబరు 2021. Retrieved 26 September 2021.
  3. Sakshi (31 March 2019). "లాల్, నీల్‌.. కన్హయ్య". Archived from the original on 26 సెప్టెంబరు 2021. Retrieved 26 September 2021.
  4. 10TV (24 March 2019). "బెగుసరాయ్ నుంచి లోక్ సభ బరిలో కన్హయ్య" (in telugu). Archived from the original on 26 సెప్టెంబరు 2021. Retrieved 26 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (28 September 2021). "Kanhaiya Kumar: కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్‌". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
  6. The Hindu (6 July 2023). "Kanhaiya Kumar appointed AICC in-charge of NSUI" (in Indian English). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  7. News తెలుగు (28 February 2020). "కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం". Archived from the original on 26 సెప్టెంబరు 2021. Retrieved 26 September 2021.