కపిల్ మిశ్రా
| కపిల్ మిశ్రా | |||
ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
| |||
| పదవీ కాలం 2023 ఆగస్టు 5 – ప్రస్తుతం | |||
| పదవీ కాలం 2015 – 2017 | |||
| గవర్నరు | నజీబ్ జంగ్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 14 – 2019 ఆగస్టు 2 | |||
| ముందు | మోహన్ సింగ్ బిష్త్ | ||
| తరువాత | మోహన్ సింగ్ బిష్త్ | ||
| నియోజకవర్గం | కరవాల్ నగర్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | మోహన్ సింగ్ బిష్త్ | ||
| నియోజకవర్గం | కరవాల్ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1980 నవంబరు 13 ఢిల్లీ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ (2013–2017) | ||
| జీవిత భాగస్వామి | ప్రెట్టీ మిశ్రా | ||
| సంతానం | 2 | ||
కపిల్ మిశ్రా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 నుండి 2017 వరకు జల వనరుల నిర్వహణ శాఖ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్ట్ చేతిలో 3,083 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్ట్ పై 44,431 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కపిల్ మిశ్రా 2015 నుండి 2017 వరకు అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో జల వనరుల నిర్వహణ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించిన తరువాత ఆయన మంత్రిత్వ శాఖలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుండి తొలగించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంలో అవినీతి సంఘటనలు జరిగాయని ఆరోపించాడు. ఆయన 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల సంఘటనలను ఢిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లగా పార్టీ ఫిరాయింపు ,పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది.[1]
కపిల్ మిశ్రా తన ఎమ్మెల్యేగా పదవిపై అనర్హత వేటు పడిన కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ బిజెపి సీనియర్ నాయకులు మనోజ్ తివారీ, విజయ్ గోయల్, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ సమక్షంలో 2019 ఆగస్ట్ 17న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2023 ఆగస్టు 5న ఢిల్లీ యూనిట్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. కపిల్ మిశ్రా 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి మనోజ్ త్యాగిపై 23355 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2025 ఫిబ్రవరి 20న జల, పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Rebel AAP MLA Kapil Mishra disqualified from Delhi assembly". The Times of India. 2 August 2019. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ "Former AAP minister Kapil Mishra joins BJP" (in ఇంగ్లీష్). India Today. 17 August 2019. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ "Kapil Mishra, the firebrand BJP leader who replaced sitting MLA and won" (in ఇంగ్లీష్). The Indian Express. 9 February 2025. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Karawal Nagar". Election Commission of India. 8 February 2025. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ "Delhi CM Rekha Gupta's Cabinet: List of ministers and portfolios" (in ఇంగ్లీష్). CNBCTV18. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.