కపూర్తలా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కపూర్తలా జిల్లా

ਕਪੂਰਥਲਾ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా
కపుర్తలా సైనిక్ స్కూల్, కపుర్తలా మహారాజుల పూర్వ రాజభవనం
కపుర్తలా సైనిక్ స్కూల్, కపుర్తలా మహారాజుల పూర్వ రాజభవనం
రెండు విడివిడి భాగాలుగా ఉంటుంది
పంజాబ్‌లో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంపంజాబ్
పేరు వచ్చినవిధంనవాబ్ కపూర్ సింగ్
ముఖ్య పట్టణంకపూర్తలా
విస్తీర్ణం
 • మొత్తం1,633 km2 (631 sq mi)
జనాభా వివరాలు
(2011)‡[›]
 • మొత్తం817,668
 • సాంద్రత500/km2 (1,300/sq mi)
భాషలు
 • అధికారికపంజాబీ
కాలమానంUTC+5:30 (IST)
అక్షరాస్యత80.20%
జాలస్థలిwww.kapurthala.net.in

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో కపూర్తలా జిల్లా (డొయాబీ : ਕਪੂਰਥਲਾ ਜ਼ਿਲਾ) ఒకటి. కపూర్తలా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. వైశాల్యం, జనసంఖ్యల పరంగా కపూర్తలా, రాష్ట్రంలో చిన్న జిల్లాగా గుర్తింపు పొందింది. 2001 గణాంకాలను అనుసరించి కపూర్తలా జనసంఖ్య 7,54,521. ఈ జిల్లా దూరదూరంగా ఉన్న రెండు వేరువేరు ముక్కలుగా ఉంటుంది. ఒకటి కపూర్తలా -సుల్తాన్‌పూర్ లోఢీ కాగా, రెండవది ఫగ్వారా తాలూకా.

భౌగోళికం[మార్చు]

కపూర్తలా- సుల్తాన్‌పూర్ లోఢి భాగం 31° 07', 31° 22' ఉత్తర అక్షాంశం, 75° 36 తూర్పురేఖాంశంలో ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో హోషియార్‌పూర్, గుర్‌దాస్‌పూర్, అమృత్‌సర్, పశ్చిమ సరిహద్దులో బియాస్ నది, దక్షిణ సరిహద్దులో సట్లెజ్ నది, జలంధర్, హోషియార్‌పూర్ జిల్లాలు ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

  • జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది : కపూర్తలా, ఫగ్వారా, సుల్తాంపూర్ లోఢి. మొత్తం వైశాల్యం 1633 చ.కి.మీ. కపూర్తలా తాలూకా వైశాల్యం 909.09 చ.కి.మీ.పగ్వారా వైశాల్యం 304.05 చ.కి.మీ., సుల్తాన్‌పూర్ లోఢీ వైశాల్యం 451.0 చ.కి.మీ.

ఆర్ధికం[మార్చు]

జిల్లా అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. గోధుమ, వడ్లు, చెరుకు, ఉర్లగడ్డలు, మొక్కజిన్నాలు. కపూర్తలా ప్రధాన భూభాగం కలి- బెయిన్ మద్య ఉంది. దీనిని బెట్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతం తరచూ వరదలకు గురౌతూ ఉంటుంది. నీరు నిలవడం భూమిలో క్షారగుణం అధికమవడం వంటి సమస్యలను ఈ ప్రాంతం ఎదుర్కొంటూ ఉంటుంది. వరదల నుండి రక్షణ కొరకు " ధుస్సి బంధ్ " అనే నిర్మాణాన్ని బియాస్ నది ఎడమ తీరంలో నిర్మించబడింది. ఇది ఈ ప్రాంతాన్ని వరద తీవ్రత నుండి రక్షిస్తూ ఉంది. ఈ జిల్లాభూభాగం అంతా సారవంతమైన భూభాగం కలిగి ఉంది. దక్షిణతీరంలో ఉన్న నల్లరేగడి భూమిని " దిన్నా " ( ఇసుక, బంకమట్టి) అంటారు. పంజాబీ మైదాన వాతావరణం జిల్లా అంతటా ఉంటుంది. జిల్లాలో ఉపౌష్ణమండల వర్షపాతం ఉంటుంది. విస్తారంగా పంటలు పండే భూమి కనుక జిల్లాలో అరణ్యాలు, వన్యమృగాలకు అంతగా అవకాశం లేదు.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 817,668,[1]
ఇది దాదాపు. కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 481 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 501 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 912:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.2%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Dakota 814,180