కపోతేశ్వరస్వామి దేవాలయం (చేజర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కపోతేశ్వర స్వామి దేవాలయం
కపోతేశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
కపోతేశ్వర స్వామి దేవాలయం
కపోతేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278Coordinates: 16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశము
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు
ప్రదేశం:చేజర్ల
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కపోతేశ్వర స్వామి దేవాలయం

కపోతేశ్వర స్వామి దేవాలయం గుంటూరు జిల్లా చేజర్ల గ్రామంలో ఈ దేవాలయం ఉంది. అతి ప్రాచీనమైన దేవాలయం.

స్థల పురాణం[మార్చు]

పూర్వం కాశ్మీరుని శిబిచక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. అతనికి ఇద్దరు సోదరులు ఉండేవారు. శిబిచక్రవర్తి సోదరులు దేశాటనతోపాటు తీర్థయాత్రలు జరపాలన్న నిశ్చయానికి వచ్చి అన్నగారి అనుమతి తీసుకుని బయలుదేరారు. తీర్థయాత్రలను యాజ్ఞకు అనుగుణంగా మేఫూడంబరుడు, జీమూతవాహనుడు ఉత్తరదేశంలోని దివ్యక్షేత్రములన్నింటిని దర్శించుకుంటూ దక్షిణాపధంలోకి వచ్చారు. వారు వస్తున్న రథం శీలవూడి పడిపోవడంతో వారి ప్రయాణం ఈ చేజర్లకి కొద్ది దూరంలో ఆగిపోయింది.ఈ కారణంగా మేగాఢంబరుడు, జీమూతవాహనుడు అక్కడికి సమీపంలో ఉన్న పర్వత గుహల్లోకి చేరి తపస్సు ప్రారంభించారు. కొంతకాలంపాటు ఆ ఇరువురు దీర్ఘతపస్సు చేసి చివరకు లింగాకృతులను పొంది దేహత్యాగం చేసి శివసాయుజ్యాన్ని పొందారు. తన సోదరులు ఎంతకి తిరిగి రాకపోవడంతో శిబిచక్రవర్తి వారిని వెదుక్కుంటూ బయలుదేరాడు.ఈ చేజర్ల ప్రాంతానికి వచ్చేసరికి తన సోదరులు అక్కడి గుహల్లో లింగాకృతులుగా మారారని తెలిసి, ఇక్కడే విడిది చేసి శిబిచక్రవర్తి శతయజ్ఞదీక్ష ప్రారంభించాడు. అందువల్ల శిబి నిత్యలోక ప్రాప్తి పొందుతాడని కలవరపడిన త్రిమూర్తులు ఆయన దానగుణాన్ని వరీక్షించదలచి బ్రహ్మణేగగా, విష్ణువు కపోతంగా, శివుడు బోయవాడు మారి పావురంపై బాణం వదిలాడు గాయపడిన పావురం యజ్ఞ దీక్షాస్థలంలో వున్న శిబిని శరణుకోరడంతో కపోతాన్ని ఇమ్మని శిబిని కోరాడు. అయితే శిబి అందుకు నిరాకరించాడు. పక్షి బరువుతో సరితూగే తన మాంసాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. పక్షిని ఇకవైపు, శిబిచక్రవర్తి తన దేహం నుంచి తీసి ఇచ్చిన మాంసం మరోవైపు త్రాసులో ఉంచగా ఎంతకూ సరితూగకపోవడంతో తన మొండాన్ని త్రాసులో పెట్టబోవడంతో త్రిమూర్తులు ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమన్నారు.శిబితనకూ, తనతో పాటు వచ్చినవారికి శివైక్యాన్ని ప్రసాదించమని, శివుని అక్కడే ఉండమని కోరాడు. నాటినుంచి శ్రీకపోతేశ్వరస్వామి క్షేత్రంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. కపోతేశ్వర లింగాన్ని స్వయంభువుగా భావిస్తారు.[1]

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

రవాణా సౌకర్యం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. విజయవాడ: ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.