కబీర్ బేడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కబీర్ బేడి
Kabir Bedi.jpg
2009 లో ఒక సినిమా విడుదల సందర్భంగా కబీర్ బేడి
జననం (1946-01-16) జనవరి 16, 1946 (వయస్సు: 72  సంవత్సరాలు)
పంజాబ్
క్రియాశీలక సంవత్సరాలు 1971–ఇప్పటివరకు
భార్య/భర్త ప్రతిమా బేడి (విడాకులు)
సుసాన్ హంఫ్రీస్ (విడాకులు)
నిక్కి బేడి (విడాకులు)

కబీర్ బేడి (జననం:16 జనవరి 1946) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు. అతని చలనచిత్ర మరియు బుల్లితెర ప్రస్థానం భారతదేశం, అమెరికా సంయుక్తరాష్ట్రాలు మరియు పలు ఐరోపా దేశాల్లోనూ విస్తరించింది. Taj Mahal: An Eternal Love Story అనే చిత్రంలో షాజహాన్ చక్రవర్తి పాత్ర ద్వారా అతను విశిష్ట గుర్తింపు పొందాడు. ఐరోపాలోని ఒక లఘు టీవీ కార్యక్రమంలో కాల్పనిక దోపిడీదారుడు శాండోకన్‌ పాత్రను పోషించడం ద్వారా అతను అక్కడ బాగా ప్రాచుర్యం పొందాడు. అలాగే 1983 జేమ్స్ బాండ్ చిత్రం ఆక్టోపుస్సీలో గోవింద పాత్ర కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే ఇటలీలో అతనికి మంచి పేరుంది. ఇటాలియన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలడు.

కబీర్ బేడి ఇప్పటికీ భారతదేశాన్నే స్థావరంగా చేసుకుని ముంబైలో ఉంటున్నాడు.

జీవితచరిత్ర[మార్చు]

బాల్యం[మార్చు]

భారతదేశంలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించిన ముగ్గురు సంతానంలో కబీర్ బేడి ఒకడు. బ్రిటీషు వలసపాలన నుంచి భారతదేశ స్వాతంత్ర్య సాధనకు అతని కుటుంబం అంకితమైంది. అతని తల్లి ఫ్రిదా బేడి తర్వాత టిబెట్ బౌద్ధమతంలోకి మారింది.[1] అతని తండ్రి బాబా ప్యారే లాల్ బేడి ఒక రచయిత మరియు సిక్కు మత విశ్వాసాలపై నమ్మకం ఉన్నవాడు. అతని వంశం యొక్క మూలాలు మొదటి సిక్కు గురుతో ముడిపడి ఉన్నాయి.[2]

కబీర్ బేడి నైనిటాల్‌లోని షెర్‌వుడ్ కళాశాలలో చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

బేడికి మూడు సార్లు వివాహమైంది. అతనికి పూజా, సిద్దార్థ్ మరియు ఆడమ్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఒడిస్సి నర్తకియైన ప్రొతిమా బేడిని అతను వివాహం చేసుకున్నాడు. వారి తనయ పూజా బేడి హిందీ చలనచిత్రాలలో నటిగా ఎదిగింది. ఆమె పత్రికా రచయిత్రి. అమెరికాలోని ఒక యూనివర్శిటీకి వెళ్లే వారి తనయుడు సిద్దార్ధ్‌కు షిజోఫ్రేనియా (మానిసిక రుగ్మతలు) పరంగా పెద్ద చరిత్రే ఉంది. అందువల్లే అతను 1997లో 26 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫ్రాతిమా బేడితో తన వివాహ బంధం తెగిపోవడంతో అతను ప్రవీణ్ బాబికి దగ్గరయ్యాడు. అయితే వారు వివాహం చేసుకోలేదు. తర్వాత అతను బ్రిటన్‌లో పుట్టిన ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రేస్‌ను పెళ్ళి చేసుకున్నాడు. వారి ముద్దుల తనయుడు ఆడమ్ బేడి ఒక అంతర్జాతీయ మోడల్. హెలో? కౌన్ హై! అనే థ్రిల్లర్ చిత్రం ద్వారా అతను ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.[3] వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

1990 దశకాల చివర్లో TV మరియు రేడియో సమర్పకురాలు నిక్కీ బేడిని కబీర్ బేడి పెళ్ళి చేసుకున్నాడు. సంతానం లేని వారు 2005లో విడిపోయారు. తాజాగా అతను ప్రవీణ్ దుసాంజ్ అనే లండన్‌ మహిళకు దగ్గరయ్యాడు.[4]

బర్మాలో జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి కబీర్ బేడి తన వంతు బలమైన మద్దతు తెలిపాడు. తద్వారా బర్మా ఉద్యమం UKకి అధికారిక ప్రచారకర్తగా అవతరించాడు.[5]

వృత్తి[మార్చు]

భారతీయ నాటకరంగం ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించిన కబీర్ బేడి అనంతరం హిందీ చలనచిత్రాలపై దృష్టి పెట్టాడు. అంతేకాక అతను రెండు హాలీవుడ్ చిత్రాల్లోనూ మరియు తాను ఎక్కువగా ఆదరణ పొందిన ఐరోపాలో కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లోనూ నటించాడు.

రంగస్థల నటన[మార్చు]

రంగస్థల నటుడుగా కబీర్ షేక్‌స్పియర్ రాసిన ఓదిల్లో అనే నాటకంలో నటించాడు. అలాగే ఒక మతిస్థిమితం లేని భారతదేశానికి చెందిన ఒక చారిత్రాత్మక రాజు తుగ్లక్ పాత్రను మరియు ది వల్చర్స్‌లో మద్యపాన వ్యసనపరుడుగా కూడా అతను నటించాడు. ఇక లండన్‌‌లోని షాఫ్టెస్బరీ థియేటర్‌లో ది ఫార్ పెవిలియన్స్ అనే నాటికలోనూ అతను నటించాడు. ఇది M. M. కాయే నవల యొక్క వెస్ట్ ఎండ్ యక్షగాన అనువర్తనం.

సినీ జీవితం[మార్చు]

జేమ్స్ బాండ్ చిత్రం ఆక్టోపుస్సీలో అతను ప్రతినాయకుడి సహాయకుడుగా రోజర్ మూరీతో మొదటి నుంచి ఆఖరి వరకు పోరాడే గోవింద పాత్రలో నటించాడు.

కబీర్ సుమారు 60కి పైగా భారతీయ బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. ఒక చారిత్రాత్మక చిత్రం Taj Mahal: An Eternal Love Storyలో కబీర్ షాజహాన్ చక్రవర్తి పాత్రను చేశాడు. రాజ్ ఖోస్లాకి చెందిన కచ్చీ ధాగీ, రాకేశ్ రోషన్ యొక్క ఖూన్ భరీ మాంగ్ మరియు ఫరా ఖాన్ తీసిన మై హూ నా వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ అతను నటించాడు. తాజాగా అతను భారతీయ TVపై డైరెక్టర్స్ కట్‌ పేరుతో సొంతంగా ఒక సినిమా తరహా టాక్ షోను ఆవిష్కరించాడు. ఇది 13-భాగాల ప్రత్యేక కార్యక్రమం. ఇందులో దేశంలోని ప్రముఖ దర్శకులను ఇంటర్వూ చేయడం జరుగుతుంది.

కబీర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ సొంతంగా తీస్తున్న కైట్స్‌, గోవింద (షోమ్యాన్ ) మరియు అక్షయ్ కుమార్ (బ్లూ ) చిత్రాల్లో నటిస్తున్నాడు.[6] అమితాబ్ బచ్చన్ మరియు జాన్ అబ్రహాంలతో దీపా మెహతా తీస్తున్న తదుపరి చిత్రం కామగత మారు లోనూ అతను నటిస్తున్నాడు.

ఆఫ్గనిస్తాన్‌లో రష్యా యుద్ధానికి సంబంధించిన కొలంబియా పిక్చర్స్ చిత్రం ది బీస్ట్ ఆఫ్ వార్‌ ‌లో కబీర్ నటించాడు. దీనికి కెవిన్ రీనార్డ్స్ దర్శకుడు. అలాగే ప్రతిష్ఠాత్మక డేవిడ్ ది డొనేటెల్లో అవార్డు విజేత, దర్శకుడు మార్కో పోంటి తీసిన ఇటలీ చిత్రం అండాత రిటర్నో లోనూ అతను నటించాడు.

బుల్లితెర ప్రస్థానం[మార్చు]

కబీర్ ఎక్కువగా ప్రైమ్‌టైమ్ (వీక్షకుల తాకిడి ఎక్కువగా ఉండే సమయం) మరియు పగటిపూట ప్రసారమయ్యే నాటికలు మరియు లఘు ధారావాహికాలైన అమెరికా బుల్లితెర కార్యక్రమాల్లో నటించాడు. వాటిలో హాల్‌మార్క్‌కు చెందిన ఆఫ్రికా పురాణం ఫోర్‌బిడన్ టెరిటరీ, కెన్ ఫోలెట్ యొక్క ఆన్ వింగ్స్ ఆఫ్ ఈగల్స్ మరియు రెడ్ ఈగల్‌ ఉన్నాయి. NBC ప్రసారం చేసిన ది లాస్ట్ ఎంపైర్‌లో అతను ఫ్రియర్ శాండ్స్‌గా నటించాడు. అలాగే డినాస్టీ, మర్డర్, షీ రోట్, మేగ్నమ్, P.I., హంటర్, నైట్ రైడర్ మరియు Highlander: The Series వంటి ఇతర వాటిల్లోనూ కబీర్ నటించాడు.

ఐరోపాలో శాండోకన్ అనే నాటిక అతనికి భారీ విజయాన్ని సాధించి పెట్టింది. అది తెల్లదొరల వలస పాలన సమయంలో ఒక శృంగార ఆసియా దోపిడీదారుడుకు సంబంధించిన ధారావాహికం. ఇటలీ-జర్మనీ-ఫ్రాన్స్ TV ధారావాహికమైన అది అప్పట్లో ఐరోపా వ్యాప్తంగా వీక్షకుల రికార్డులను తిరగరాసింది.[ఆధారం కోరబడింది]. అలాగే ఇటలీలోని అతిపెద్ద ప్రసార సంస్థ RAI TVలో ప్రసారమైన ప్రైమ్‌టైమ్ బుల్లితెర ధారావాహికం అన్ మెడికో ఇన్ ఫ్యామిగ్లియా లోనూ కబీర్ ఇటీవల నటించాడు.

దూరదర్శన్ ఇండియాలో ప్రసారమైన 1995 TV పురాణ ధారావాహికం బైబిల్ కి కహానియా లో కబీర్ యుక్త వయసు మరియు వృద్ధుడి పాత్ర రెండింటినీ చేశాడు. తద్వారా అప్పటివరకు బయటపడని తనలోని అద్భుత నటనను ఆవిష్కరించి, అందరి మన్ననలు అందుకున్నాడు. అయితే నిర్మాతలు మరియు సమర్పకుల మధ్య విభేదాల కారణంగా దాని ప్రసారాన్ని అర్థాంతరంగా నిలిపివేశారు.

ది బోల్డ్ అండ్ ది బ్యూటిఫుల్ అనే బుల్లితెర కార్యక్రమంలో కబీర్ సుమారు ఏడాదికి పైగా నటించాడు. 149 దేశాల్లో బిలియన్ (100 కోట్లు) మందికి పైగా వీక్షకులు తిలకించిన ఈ ధారావాహికం ప్రపంచంలోనే రెండో అత్యధిక ఆదరణ పొందిన కార్యక్రమంగా నిలిచింది.

పురస్కారాలు మరియు ఘనతలు[మార్చు]

కబీర్ ఆస్కార్ అవార్డుల ప్రధానానికి బాధ్యత వహించే ప్రతిష్ఠాత్మక అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క ఓటింగ్ సభ్యుడు కూడా. అంతేకాక అతను స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఓటింగ్ సభ్యుడు కూడా.

అతను ఐరోపా మరియు భారతదేశం వ్యాప్తంగా అసంఖ్యాక చలనచిత్ర, ప్రచార మరియు ప్రఖ్యాత అవార్డులను కూడా గెలుచుకున్నాడు.[7]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

చలనచిత్రాలు[మార్చు]

బుల్లితెర[మార్చు]

ఓటింగ్ సభ్యత్వాలు[మార్చు]

సూచనలు[మార్చు]

బాహ్య వలయాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కబీర్_బేడి&oldid=2105739" నుండి వెలికితీశారు