కబేరి బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కబేరి బోస్
జననం(1938-11-28)1938 నవంబరు 28 [1]
మరణం1977 ఫిబ్రవరి 18(1977-02-18) (వయసు 38)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1955–1975
గుర్తించదగిన సేవలు
రాజ్‌కమల్
దృష్టి
దేవి మాలిని
అరణ్యేర్ దిన్ రాత్రి
అమీ సే ఓ సఖా
జీవిత భాగస్వామిఅజిత్ ఛటోపాధ్యాయ (1956)
పురస్కారాలుబెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ ఉత్తమ సహాయ నటి (1971)

కబేరి బోస్, బెంగాలీ సినిమా నటి. ఉత్తమ్ కుమార్ సరసన శ్యామాలి సినిమాలో, సత్యజిత్ రే దర్శకత్వం వహించిన అరణ్యేర్ దిన్ రాత్రి సినిమాలో నటించింది.[2][3]

జననం[మార్చు]

కబేరి 1938 మార్చి 28న జన్మించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కబేరికి 1956లో అజిత్ ఛటోపాధ్యాయతో వివాహం జరిగింది. ఆ తరువాత సినిమారంగాన్ని విడిచి ముంగేరుకు వెళ్ళిపోయింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. 12 సంవత్సరాల విరామం తరువాత 1968లో వచ్చిన అరణ్యర్ దిన్ రాత్రి సినిమాలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

1970, జూన్ 12న కబేరి తన భర్త, చిన్న కుమార్తెతో కలిసి డార్జిలింగ్ నుండి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కుమార్తె, భర్త మృతి చెందగా, కబేరి తీవ్ర గాయాలతో బయటపడింది.

సినిమారంగం[మార్చు]

దర్శకుడు సుబోధ్ మిత్ర 1955లో దర్శకత్వం వహించిన రాజ్‌కమల్ సినిమా ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. ఒక సంవత్సరకాలంలో ఏడు బెంగాలీ సినిమాల్లో నటించింది.

సినిమాలు[మార్చు]

  1. నగర్ దర్పణే (1975)
  2. జేఖనే దరియే (1974)
  3. అమీ సే ఓ సఖా (1974)
  4. అరణ్యేర్ దిన్ రాత్రి (1969)
  5. శ్యామాలీ (1956)
  6. మధుమాలతి (1957)
  7. రాజ్ కమల్ (1955)
  8. దేవిమాలిని (1955)
  9. పరధీన్ (1956)
  10. శంకర్ నారాయణ్ బ్యాంక్ (1956)

మరణం[మార్చు]

1976లో కబేరికి క్యాన్సర్ వ్యాధి సోకింది. 1977, ఫిబ్రవరి 18న మరణించింది.

మూలాలు[మార్చు]

  1. "সিনেমা কাবেরীকে ভালবেসেছিল, কিন্তু সিনেমা তাঁর সয়নি". anandabazar.com. Retrieved 2022-03-03.
  2. "Suchitra Sen". filmsack. Archived from the original on 6 April 2017. Retrieved 2022-03-03.
  3. "Subodh Mitra's RAIKAMAL (1955) Bengali Classic: Uttam Kumar - Kaberi Bose | WBRi | Washington Bangla Radio on internet". Retrieved 2022-03-03.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]